ఇది అహాన్ని ప్రదర్శించే సమయం కాదు.
కులాలకు అతీతంగా,
మతాలకు అతీతంగా,
పార్టీలకు అతీతంగా,
ప్రాంతాలకు అతీతంగా,
అధికారాలకు అతీతంగా,
ఆదేశాలను అచరించే సమయం..
రేపు [మార్చి 22 ఆదివారం] ఉదయం 7గంటలనుండి రాత్రి 9గంటల వరకు భారత ప్రభుత్వం చెప్పినట్టుగా స్వచ్చందంగా జనతా కర్ఫ్యూ ని పాటిద్దాం.
మోడీజీ కోరినట్టుగా కరోనా బాధితుల కోసం డాక్టర్లు చేస్తున్న సేవలను హర్షిస్తూ సాయంత్రం 5గంటలకు కరతాళధ్వనులు చేద్దాం.
రేపు జరగబోయే ఈ పూర్తి కార్యక్రమంలో ఉన్న లాజిక్ అర్థం కాని వాళ్ళు ఎవరైనా ఉన్నా కాసేపు అందులో ఉన్న మంచిచెడులని పక్కన పెట్టేసి పెద్దాయన చెప్పిన మాటలకి గౌరవమిద్దాం.
అన్ని పనులు ఆపేసి ఇంట్లోనే ఉండిపోదాం.
ఎదుటివాడికి ఏమీ చేయకుండా ఉండిపోవడమే కొన్ని సందర్భాల్లో అతిపెద్ద సహాయం.
అదే మనం ప్రకృతికి తిరిగిచ్చే అతిపెద్ద బహుమానం
రేపు నేను స్వచ్చందంగా ఒక నిబద్ధతతో కర్ఫ్యూని పాటించబోతున్నాను..
సాయంత్రం చప్పట్లు కూడా కొట్టబోతున్నాను.
మీరు కూడా ఇందులో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేస్తారని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను….
థ్యాంక్యూ….😍❤🙏 – TNR