iDreamPost
android-app
ios-app

Time Concept : టైం కాన్సెప్ట్ ని వాడుకుంటున్న మూడు సినిమాలు

  • Published Dec 05, 2021 | 6:39 AM Updated Updated Dec 05, 2021 | 6:39 AM
Time Concept : టైం కాన్సెప్ట్ ని వాడుకుంటున్న మూడు సినిమాలు

టైం ట్రావెల్ కాన్సెప్ట్ సినిమాల్లో కొత్తది కాదు కానీ దర్శకులు ఎక్కువగా వాడేది మాత్రం కాదు. ఏ మాత్రం కన్విన్సింగ్ గా ఈ పాయింట్ ని చెప్పలేకపోయినా సరే ఫలితం తేడా కొట్టేస్తుంది. బ్యాక్ టు ది ఫ్యూచర్ లాంటి హాలీవుడ్ క్లాసిక్స్ ని ఆధారంగా చేసుకుని సౌత్ లోనూ చెప్పుకోదగ్గ చిత్రాలు వచ్చాయి. ఆదిత్య 369తో మొదలు సూర్య 24 దాకా మంచి విజయాలు సాధించినవి ఉన్నాయి. ఇది ఒకరకమైన ట్రీట్మెంట్ అయితే గతాన్ని వర్తమానాన్ని ముడిపెడుతూ హీరోతో డ్యూయల్ రోల్ చేయించే ఫార్మట్ మరో టైపు. త్వరలో విడుదల కాబోతున్న మూడు భారీ బడ్జెట్ చిత్రాల్లో ఇదే తరహా పోకడ కనిపించడం కాకతాళీయమే అయినా పరిగణించాల్సిన విషయమే.

ముందుగా నాని శ్యామ్ సింగ రాయ్ ని చూసుకుంటే ఇందులో దశాబ్దాల క్రితం దేవదాసిల వ్యవస్థకు వ్యతిరేకంగా పోరాడిన పాత్రలో ఒకటి, అతని వారసుడిగా గతం తాలూకు రహస్యాలను ఛేదించే క్యారెక్టర్ మరొకటి న్యాచురల్ స్టార్ చేస్తున్నారు. ఇవి రెండు తెరమీద కలిసి కనిపిస్తాయా లేక ఫాంటసీ టచ్ ఏమైనా జోడించారా అనేది తెలియాల్సి ఉంది. కళ్యాణ్ రామ్ బింబిసార కూడా అంతే. ఎప్పుడో శతాబ్దాల వెనుక ఒక రాజు ఇప్పటి కాలంలో అదే పోలికలతో ఉన్న యువకుడికి మధ్య ఉన్న కనెక్షన్ ప్రధానంగా రూపొందించారు. ఇక రాధే శ్యామ్ లోనూ ప్రభాస్ 1913 ఇటలీ, 2020 ఇండియా బ్యాక్ డ్రాప్ లో కనిపిస్తారట.

కథల మధ్య అసలు సంబంధం లేకపోయినా టైం అనే కాన్సెప్ట్ మాత్రం మూడింట్లో కామన్ గా కనిపిస్తోంది. ఇవన్నీ అటు ఇటు గా ఒక నెల గ్యాప్ లోనే విడుదల కాబోతుండటం మరో విశేషం. శ్యాం సింగ రాయ్ డిసెంబర్ 24న వస్తుండగా, రాదే శ్యామ్ జనవరి 14 లాక్ చేసుకుంది. బింబిసార డేట్ గురించి ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. ఇవన్నీ మీడియం రేంజ్ మూవీస్ కావడం గమనార్హం. అఖండ ఇచ్చిన వసూళ్ల ఊపుతో సినిమాలన్నీ ధైర్యంగా రిలీజ్ కు రెడీ అవుతున్నాయి. జనం థియేటర్లకు రావడంలో ఇంకెలాంటి అనుమానాలు లేకపోవడంతో షెడ్యూల్ చేసిన డేట్లలో మార్పులు ఉండవు. ఏవైనా అనూహ్య పరిణామాలు జరిగితే తప్ప

Also Read : Akhanda : అఖండ విజయానికి 6 కారణాలు