iDreamPost

మూడు పెళ్లిళ్లు.. అనేక మంది మహిళలతో అక్రమ సంబంధాలు.. అడిగితే..

మూడు పెళ్లిళ్లు.. అనేక మంది మహిళలతో అక్రమ సంబంధాలు.. అడిగితే..

వివాహానికి ఒక అమ్మాయి దొరికితే చాలు రా దేవుడా అనుకుంటున్నారు పెళ్లికాని ప్రసాదులు. కానీ మనం చెప్పుకోబోయే ప్రబుద్ధుడు ఏకంగా ఒకటి కాదు రెండు కాదూ మూడు పెళ్లిళ్లు చేసుకుని, కాపురం పెట్టేశాడు. ఒకరికి ఒకరు తెలియకుండా సంసారం సాగిస్తున్నాడు. పోనీ అక్కడితో ఆగాడా అంటే.. మరికొంత మంది మహిళలతో రాసలీలల్లో మునిగి తేలుతున్నాడు. వివాహేతర సంబంధాలు పెట్టుకుని విచ్చల విడితనంగా వ్యవహరిస్తున్నాడు. ఇది తప్పు అని చెప్పిన వారిని.. మీ పని చూసుకోవాలని సమాధానం చెప్పడంతో పాటు.. ఇంకొంచెం ఎక్కువ మాట్లాడితే దాడికి కూడా దిగుతున్నాడు. ఇతడి వెకిలి చేష్టలు నానాటికి పెరిగిపోతుండటంతో రంగంలోకి దిగారు కుల పెద్దలు.. అతడి పట్ల కఠిన నిర్ణయం తీసుకున్నారు.

పల్నాడు జిల్లాలోని గురజాలలోని బేడ బుడగ జంగాల కాలనీలో నివసిస్తున్నాడు గంధం లక్ష్మయ్య. ఒక భార్యను మెయిన్ టైన్ చేయడమే కష్టమౌతున్న ఈ రోజుల్లో ఒకరిని కాదూ ముగ్గుర్ని పెళ్లిళ్లు చేసుకుని జల్సా జీవితాన్ని గడుపుతున్నాడు. అక్కడితో ఊరుకోలేదు.. కొంత మంది మహిళలతో అక్రమ సంబంధాలు పెట్టుకునేవాడు. ఇక ఇతగాడు చేసే పని చేప్తే నోరెళ్లబెట్టడం ఖాయం. ఇరుగింటి, పొరిగింటి కబుర్లు ఇతరులకు మోస్తూ, చాడీలు చెబుతూ.. కాలనీ వాసుల మధ్య తగాదాలు పెట్టేవాడు. ఈ క్రమంలోనే అతడి భాగోతం బయటపడింది. తాము మోసపోయామంటూ ముగ్గురు మహిళలు.. పోలీస్ స్టేషన్ మెట్లెక్కారు. దీని వెనుక అతడి రాసలీలలు ఒక్కొక్కటిగా బయటకు వచ్చాయి. అయినా అతడి తీరులో మార్పు రాలేదు.

చివరకు ఇతడి వ్యవహారం కుల పెద్దల చెంతకు చేరింది. ఇది తప్పని, నీ తీరు మార్చుకోవాలని హెచ్చరించారు. మీరెవ్వరూ తనకు చెప్పడానికి అంటూ వారికే ఎదురు సమాధానం చెప్పేవాడు. వారిని లెక్క చేసేవాడు కాదు. మీరేం చేసుకుంటారో చేసుకోండని తెగింపు మాటలు మాట్లాడటంతో దీనికి ఓ పరిష్కారం చేపట్టాలని కుల పెద్దలు నిర్ణయించారు. కుల పెద్దల సమక్షంలో సమావేశం ఏర్పాటు చేసి..అందరి అభిప్రాయాలు అడిగి తెలుసుకున్నారు. చివరకు అతడిని ఊరి నుండి వెలివేయాలని తీర్మానం చేశారు. కుల పెద్దల పంచాయితీలో కుల పెద్ద ఈ మేరకు తీర్పును అమలు చేశారు. కాలనీ నుండి లక్ష్మయ్యను బహిష్కరిస్తున్నట్లు పంచాయితీ నిర్ణయించినట్లు వెల్లడించారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి