Keerthi
రాష్ట్రంలో బీడీ కార్మికులకు తెలంగాణ సర్కార్ ఓ గుడ్‌న్యూస్‌ను అందించింది. ఇక బీడీ పరిశ్రమలో పనిచేస్తున్న కార్మికులు, ఉద్యోగులు, ప్యాకర్లకు నిజంగా ఇది తీపి కబురనే చెప్పవచ్చు.
రాష్ట్రంలో బీడీ కార్మికులకు తెలంగాణ సర్కార్ ఓ గుడ్‌న్యూస్‌ను అందించింది. ఇక బీడీ పరిశ్రమలో పనిచేస్తున్న కార్మికులు, ఉద్యోగులు, ప్యాకర్లకు నిజంగా ఇది తీపి కబురనే చెప్పవచ్చు.
Keerthi
తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజసంక్షేమం కోసం ఇచ్చి హామీలను శరవేగంగా పూర్తి చేస్తున్న విషయం తెలిసిందే. అలాగే సీఎం రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా పదవి భాద్యతలను చెపట్టిన నుంచి రాష్ట్రంలో సంక్షేమ పథకాలకు పుట్టినిల్లుగా మారింది. ఇప్పటికే రాష్ట్రంలోని రైతులకు మహిళలకు ఇలా అన్ని వర్గాల వరకు శుభవార్త చెప్పిన కాంగ్రెస్ సర్కార్.. ఇప్పుడు బీడి పరిశ్రమలో పనిచేస్తున్న కార్మికుల గురించి దృష్టి సారించి వారికి చక్కటి శుభవార్తను అందించింది. ఆ వివరాళ్లోకి వెళ్తే..
రాష్ట్రంలో బీడీ కార్మికులకు తెలంగాణ సర్కార్ ఓ గుడ్‌న్యూస్‌ను అందించింది. కాగా, బీడీ పరిశ్రమలో పనిచేస్తున్న కార్మికులు, ఉద్యోగులు, ప్యాకర్లకు త్వరలోనే వేతనాలు పెంచుతున్నట‍్లు ప్రకటించింది. ఇక ఈ బీడి కార్మికుల పెంపుపై కార్మిక సంఘాలు, యాజమాన్య సంఘాలకు మధ్య శనివారం జరిగిన చర్చలు సఫలమయ్యాయి. అయితే ఈ చర్చలతో ఈ చర్చలతో బీడీ పరిశ్రమలో పనిచేస్తున్న దాదాపు 7 లక్షల మంది కార్మికులకు నిజంగా ఇది తీపి కబురనే చెప్పవచ్చు. ఇక కొత్తగా చేసిన ఈ వేతన పెంపు 2024 మే 1 నుంచి రెండేళ్ల పాటు అమల్లో ఉండేలా ఒప్పందం కుదిరింది.
అయితే గతంలో బీడీ పరిశ్రమలో పనిచేస్తున్న బీడీ చుట్టే కార్మికులు, బీడీ ప్యాకర్లు, నెలవారీ వేతన ఒప్పందం 2024 ఏప్రిల్ 30 తేదీతో ముగిసింది. కాగా, ఇప్పుడు కొత్త వేతనాల అమలు కోసం కార్మిక సంఘాలు, యాజమాన్య సంఘాల మధ్య శనివారం చర్చలు జరిగాయి. ఇక బీడి పరిశ్రమలో పనిచేసే కార్మికుల్లో 95 శాతానికిపైగా బీడీలు చుట్టే కార్మికులే ఉంటారు. ప్రస్తుతం 1000 బీడీలు చుడితే వారికి రూ.245.08 వేతనంగా అందుతోంది. అయితే తాజాగా జరిగిన చర్చల్లో అదనంగా రూ.4.25 పెంచేందుకు బీడీ పరిశ్రమ యాజమాన్యాలు ముందుకొచ్చింది. ఇక పెరిగిన ఈ వేతనాలు మొత్తానికి పండగ, సెలవులు, బోనస్ అన్నీ కలిపితే ప్రతి 1000 బీడీలకు వేతనం రూ.249.99కి చేరునుంది.
దాంతో పాటు బీడీ ప్యాకర్లు ప్రస్తుతం పొందుతున్న వేతనాలపై నెలకు అదనంగా రూ.3,650 ఇవ్వనున్నారు. అలాగే నెలవారీ వేతన ఉద్యోగులైన బట్టీవాలా, చెన్నీవాలా, బీడీసార్టర్లు తదితరులకు ప్రస్తుత నెలవారీ వేతనాలపై అదనంగా రూ.1,700 పెంచేలా ఈ చర్చల్లో నిర్ణయం తీసుకున్నాయి. కాగా, ఈ వేతన ఒప్పందం అనేది 2026 ఏప్రిల్ 30 వరకు అమల్లో ఉండనుంది. కాగా, ఈ చర్చల అనంతరం వేతనాలు పెంపుపై బీడి కార్మికలకు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. మరి, త్వరలోనే బీడి పరిశ్రమలో పనిచేసే కార్మికులకు వేతనాలు పెంచడం పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.