iDreamPost
android-app
ios-app

Allu Arjun : సరైనోడు కాంబినేషన్ లో స్పెషల్ ఇదే

  • Published Jan 04, 2022 | 7:02 AM Updated Updated Jan 04, 2022 | 7:02 AM
Allu Arjun : సరైనోడు కాంబినేషన్ లో స్పెషల్ ఇదే

పుష్ప పార్ట్ 1 ది రైజ్ బ్లాక్ బస్టర్ సక్సెస్ ని ఎంజాయ్ చేస్తున్న ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఫిబ్రవరి నుంచి పార్ట్ 2 మొదలుపెట్టబోతున్నాడు. మధ్యలో ఇంకో సినిమా చేద్దామని గతంలో అనుకున్నారు కానీ మళ్ళీ గెటప్పు, హెయిర్ స్టైల్ ఇదంతా సమస్య అవుతుంది కాబట్టి కొనసాగింపుకే మొగ్గు చూపారు. మొదటి భాగం సక్సెస్, దానికి వచ్చిన కామెంట్స్ ని దృష్టిలో పెట్టుకుని దర్శకుడు సుకుమార్ సీక్వెల్ కి కావాల్సిన కొన్ని కీలక మార్పులను చేసే ప్రయత్నంలో బిజీగా ఉన్నారు. ముఖ్యంగా నార్త్ నుండి పుష్పకు ఊహించని రెస్పాన్స్ రావడంతో వాళ్లను మరింత రంజింపజేయడానికి ఏమేం కావాలో అన్నీ సిద్ధం చేస్తున్నారట

ఇదలా ఉంచితే అల్లు అర్జున్ నెక్స్ట్ చేయబోయే సినిమా బోయపాటి శీనుతో దాదాపుగా ఖరారైనట్టే. ఇప్పుడు బన్నీ ఎంజాయ్ చేస్తున్న మాస్ స్టార్ డంకి సరైనోడుతో బలమైన పునాది వేసింది బోయపాటినే. అందుకే మరోసారి ఈ కాంబినేషన్ ని సెట్ చేసేందుకు గీతా ఆర్ట్స్ సంస్థ ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. అఖండ ఫలితం చూశాక దీన్నిక ఆలస్యం చేసే ఉద్దేశంలో బన్నీ లేడు. కాకపోతే ఇంకో ఆరు నెలల తర్వాత కానీ రెగ్యులర్ షూట్ కి వెళ్ళలేదు. మరో ప్రత్యేకత ఏంటంటే ఇందులో అల్లు అర్జున్ డ్యూయల్ రోల్ చేయబోతున్నాడట. ఇప్పటిదాకా కెరీర్ లో బన్నీ ఈ ఫీట్ చేయలేదు. దాదాపు అందరు హీరోలు ద్విపాత్రాభినయాలు చేశారు.

ఒకవేళ ఇదే నిజమైతే ఐకాన్ స్టార్ కి డబుల్ ఫీస్ట్ అన్నమాట. మాములుగా స్టార్ హీరోలు మొదటిసారి డబుల్ ఫోటోల సినిమాలు చేసినప్పుడు బ్లాక్ బస్టర్లు అందుకున్న సందర్భాలు ఎక్కువ. అలనాటి ఎన్టీఆర్ రాముడు భీముడు, ఏఎన్ఆర్ ఇద్దరు మిత్రులు, నాగార్జున హలో బ్రదర్ తో మొదలుపెడితే రామ్ చరణ్ నాయక్ జూనియర్ ఎన్టీఆర్ అదుర్స్(రెండు పాత్రలు ఒకే ఫ్రేమ్) దాకా ఎన్నో ఉదాహరణలు ఉన్నాయి. సో ఈ సెంటిమెంట్ కూడా అల్లు అర్జున్ కు వర్కౌట్ అవుతుందేమో చూడాలి. బోయపాటి సింహా లెజెండ్ అఖండలు అన్నీ ఒకే హీరో రెండు పాత్రల ఫార్ములాతో సూపర్ సక్సెస్ అయినవే. ఇది కూడా అదే దారేమో వేచి చూడాలి.

Also Read : Nayattu : బ్లాక్ బస్టర్ రీమేక్ నిర్ణయం మారిందట

Jojobet GirişgrandpashabetcasibomjojobetcasibomjojobetJojobetjojobetholiganbetmatbet girişgrandpashabetDeneme Bonusu Veren Sitelergrandpashabet kayıp bonusugrandpashabet kayıp bonusugrandpashabet telegramgrandpashabet girişGrandpashabetGrandpashabetGrandpashabetGrandpashabetjojobetjojobet girişcasibomgrandpashabetesrar satın algrandpashabetmarsbahis girişholiganbetholiganbetgrandpashabet