మీకు పూర్తిగా క్లారిటీ లేకుండా సగం సగం తెలిసిన విషయాలని దయచేసి సోషల్ మీడియా లో పోస్ట్ చేసి భయాందోళనలొ ఉన్న ప్రజలని మరింత భయానికి గురిచెయ్యకండి..
పూర్తిగా అవగాహనకి వచ్చాకే పోస్ట్ చెయ్యండి.
మీ ఆతృత ని ప్రదర్శించడానికి ఇది సరైన సమయం కాదు.
బాధ్యత తో వ్యవహరించండి.
ఇలా అవగాహన లేని విషయాలను సోషల్ మీడియాలో పోస్ట్ చేసే వాళ్లు టెర్రరిస్టులకంటే ప్రమాదం.
ఈ కింద కనపడుతున్న విషయం మీకెక్కడైనా వీడియో రూపం లో ఉందా?
మరి ప్రూఫ్స్ లేకుండా ఎందుకు ఇలాంటి “నేనే మొత్తం మార్కులు కొట్టెయ్యాలనే ఆతృత”.?
దయచేసి అర్థం చేసుకోండి…
ఏ శ్రమ లేకుండా నాలుగు గోడల మధ్య,అనాలోచితంగా ,వేళ్లు కూడా నొప్పి పెట్టకుండా, సింపుల్ గా ,మొబైల్ లో రెండు బటన్స్ ప్రెస్ చేసి పెట్టే మీ పోస్టులు ఎక్కడో ప్రశాంతంగా ఉన్న వేరొక వ్యక్తి గుండెల్లో నొప్పి పుట్టించొచ్చు.
ఆ గుండె నొప్పికి పరోక్షంగా కారణమయి పాపం మూటగట్టుకొకండి…❤ – TNR
…………………………………..
ఈ ఫొటోతో మీకు షేర్ అవుతున్న మ్యాటర్ ఫేక్ న్యూస్.
దయచేసి దాన్ని ఎవరికీ ఫార్వార్డ్ చెయ్యకండి
……………………………………….