iDreamPost
android-app
ios-app

Barrelakka: కన్నీరు పెట్టుకున్న బర్రెలక్క.. ‘నేను ఏ తప్పు చేయలేదు.. అతనేవరో నాకు తెలీదంటూ’

  • Published Aug 22, 2024 | 10:46 AM Updated Updated Aug 22, 2024 | 11:31 AM

Barrelakka-Fake News, Kannada Channel: బర్రెలక్క బోరున విలపిస్తూ.. ఓ వీడియోని షేర్‌ చేసింది. తనే తప్పు చేయలేదు అంటుంది. ఇంతకు ఏం జరిగిందంటే..

Barrelakka-Fake News, Kannada Channel: బర్రెలక్క బోరున విలపిస్తూ.. ఓ వీడియోని షేర్‌ చేసింది. తనే తప్పు చేయలేదు అంటుంది. ఇంతకు ఏం జరిగిందంటే..

  • Published Aug 22, 2024 | 10:46 AMUpdated Aug 22, 2024 | 11:31 AM
Barrelakka: కన్నీరు పెట్టుకున్న బర్రెలక్క.. ‘నేను ఏ తప్పు చేయలేదు.. అతనేవరో నాకు తెలీదంటూ’

బర్రెలక్క అలియాస్‌ కర్నె శిరీష..ఈమె గురించి తెలియని వారు రెండు తెలుగు రాష్ట్రాల్లో చాలా అరుదుగా ఉంటారు. ఇక తాజాగా తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయడంతో.. ఆమె గురించి చాలా మందికి తెలిసింది. నిరుద్యోగుల తరఫున ఎన్నికల బరిలో నిలిచిన బర్రెలక్కకు చాలా మంది మద్దతిచ్చారు. అలానే  ఈ ఏడాది జరిగిన పార్లమెంట్‌ ఎన్నికల్లో కూడా బర్రెలక్క పోటీ చేసింది. కానీ రెండు సార్లు ఓడిపోయింది. ఇక తాజాగా నిరుద్యోగులు.. కాంగ్రెస్‌ పార్టీకి వ్యతిరేకంగా చేసిన ఆందోళనలో పాల్గొని.. అరెస్ట్‌ అయిన సంగతి తెలిసిందే. ఇలా నిత్యం వార్తల్లో నిలుస్తుంది బర్రెలక్క. తాజాగా మరోసారి సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యింది. వెక్కి వెక్కి ఏడుస్తూ.. నేను ఏ తప్పు చేయలేదంటూ ఆవేదన వ్యక్తం చేసింది. అసలు ఆ వ్యక్తి ఎవరో నాకు తెలియదు అని బర్రెలక్క చెప్పుకొచ్చింది. అసలేం జరిగింది.. ఆమె ఎందుకు ఏడ్చింది వంటి వివరాలు తెలియాలంటే ఇది చదవాల్సిందే. ఆ వివరాలు..

తాజాగా బర్రెలక్క తన ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ వీడియోని షేర్‌ చేసింది. దానిలో ఆమె బోరున ఏడుస్తూ.. నాకు ఏ పాపం తెలియదు.. ఆ వ్యక్తికి నాకు ఎలాంటి సంబంధం లేదు.. అంటూ కన్నీరు పెట్టుకుంది. ఇంతకు బర్రెలక్క ఎందుకు ఇంతలా ఆవేదన వ్యక్తం చేస్తుందంటే.. కొందరు తన పేరు మీద ఫేక్‌ ఫేస్‌బుక్‌ పేజీలు, ఐడీలు, ఫేక్‌ యూట్యూబ్‌ ఛానెళ్లు క్రియేట్‌ చేస్తున్నారని.. గతంలోనే చెప్పుకొచ్చిన బర్రెలక్క.. ఇప్పుడు వాటి వల్ల తాను ఎలాంటి సమస్యలు ఎదుర్కొంటుందో వివరిస్తూ.. వెక్కి వెక్కి ఏడ్చింది.

తాజాగా కన్నడకు చెందిన ఓ ప్రముఖ ఛానెల్‌.. బర్రెలక్క.. తన ఫేస్‌బుక్‌ అకౌంట్‌ ద్వారా.. ఎవరో ఒక వ్యక్తి దగ్గర నుంచి డబ్బులు తీసుకుని.. మోసం చేసిందంటూ వార్తలను ప్రచారం చేసింది. ఈ న్యూస్‌లో తన ఫొటోలతో పాటు, పేరు కూడా ప్రస్తావించింది సదరు ఛానెల్‌. పైగా బాధితుడు కూడా తనను బర్రెలక్క మోసం చేసిందని చెప్పడం సంచలనంగా మారింది. ప్రస్తుతం ఈ వార్త నెట్టింట తెగ వైరల్‌ అవుతోంది. ఈ న్యూస్‌ బర్రెలక్క దృష్టికి వచ్చింది. దానిపై స్పందిస్తూ.. ఇవన్నీ అవాస్తవం అని.. ఆ వ్యక్తి ఎవరో కూడా తనకు తెలియదంటూ వెక్కి వెక్కి ఏడ్చింది. తాను ఎవరి దగ్గర కూడా డబ్బులు తీసుకోలేదని చెప్పుకొచ్చింది. ఈ మేరకు ఇన్‌స్టాలో ఓ వీడియోని షేర్‌ చేసింది.

Barrelakka-Fake News In Kannada Channel 02

‘‘ఇప్పుడే ఓ న్యూస్‌ చూశాను. ఇది ఏ ఛానలో కూడా నాకు తెలియదు. ఏదో కన్నడ ఛానల్‌ అని తెలుస్తుంది. ఇలాంటి ఫేక్‌ న్యూస్‌ ఎందుకు స్ప్రెడ్‌ చేస్తున్నారో నాకు అర్థం కావడం లేదు. ఫేస్‌బుక్‌లో చాట్‌ చేసి డబ్బులు దోచుకుందని వార్తలు వేస్తున్నారు. అసలేం జరుగుతుందో నాకు అర్థం అవ్వట్లేదు. వాడెవడో ముసలోడు.. తనెవరో కూడా నాకు తెలియదు. ఎందుకిలా నా మీద బ్యాడ్‌ న్యూస్‌ ప్రచారం చేస్తున్నారో నాకు అర్థం కావడం లేదు. పెళ్లి చేసుకుని నా బతుకేదో నేను బతుకుతున్నాను. కానీ కొందరు కావాలనే నా జీవితంతో ఆడుకుంటున్నారు’’ అని ఆవేదన వ్యక్తం చేసింది.

‘‘నా పేరు మీద ఫేస్‌బుక్‌, ఇన్‌స్టాగ్రామ్‌లలో చాలా ఫేక్‌ అకౌంట్స్‌ ఉన్నాయి. అందులో ఎవరు ఇలాంటి పని చేశారో నాకు తెలియదు. నేనేం తప్పు చేయలేదు.. అనవసరంగా నన్ను బ్లేమ్‌ చేయకండి.. ప్లీజ్‌’’ అంటూ బోరున విలపిస్తూ.. వీడియో విడుదల చేసింది. కానీ ప్రస్తుతం ఇది ఇన్‌స్టాలో లేదు. ఇది చూసిన అభిమానులు మీరు కంగారు పడకండి.. ఈమధ్య కాలంలో ఇలాంటి మోసాలు విపరీతంగా పెరిగాయి. పోలీసులకు కంప్లైట్‌ ఇ‍వ్వండి అంటూ ఆమెకు ధైర్యం చెబుతున్నారు.