iDreamPost
android-app
ios-app

సొంతిల్లు కొనేందుకు ఇదే మంచి సమయం.. ఎందుకంటే..?

కలలు కనండి.. ఆ కలలను సాకారం చేసుకోండి అన్న వ్యాఖ్యలను ఇంటి విషయంలో కచ్చితంగా పాటిస్తుంటారు. సొంత ఇల్లు ఉండాలని అందరూ భావిస్తుంటారు. కానీ కొందరికే అవకాశం దక్కుతుంది. అయితే హైదరాబాద్ వంటి మహా నగరాల్లో ప్రస్తుతం ధరలు ఎలా ఉన్నాయంటే..?

కలలు కనండి.. ఆ కలలను సాకారం చేసుకోండి అన్న వ్యాఖ్యలను ఇంటి విషయంలో కచ్చితంగా పాటిస్తుంటారు. సొంత ఇల్లు ఉండాలని అందరూ భావిస్తుంటారు. కానీ కొందరికే అవకాశం దక్కుతుంది. అయితే హైదరాబాద్ వంటి మహా నగరాల్లో ప్రస్తుతం ధరలు ఎలా ఉన్నాయంటే..?

సొంతిల్లు కొనేందుకు ఇదే మంచి సమయం.. ఎందుకంటే..?

సొంత ఇళ్లు ఉండాలనేది ప్రతి ఒక్కరి కల. తిన్నా, తినకపోయినా ఇల్లు అనేది ఒకటుంటే ఆ థీమానే వేరు. చిన్న స్థలం ఉంటే చాలురా.. చిన్న గుడిసె అయినా వేసుకుని బతికేయొచ్చు అనుకుంటారు పేదవాడు సైతం. ఇక మధ్య తరగతి, సంపన్నులు తమ బడ్జెట్‌లో ఇల్లు కొనుగోలు చేస్తుంటారు. అయితే నేడు భూమి ధరలు ఆకాశాన్ని తాకుతున్నాయి. ఇక ప్లాట్ ధరలైతే చెప్పనక్కర్లేదు.. సామాన్యులకు అందడం లేదు. ముఖ్యంగా దేశానికి రెండవ రాజధాని పరిశీలనలో ఉన్న హైదరాబాద్ సంగతి ఇక చెప్పనక్కర్లేదు. రోజు రోజుకూ నగరం అభివృద్ధి చెందడంతో పాటు విస్తరిస్తుండటంతో ఇంటి ధరలు.. చుక్కలు చూపిస్తున్నాయి. ఇక్కడ ఒక్కో ప్రాంతంలో ఒక్కోలా ధరలు ఉన్నాయి.

ఏ ఏ ప్రాంతాల్లో ధరలు ఎలా ఉన్నాయంటే… మెట్రో, అన్ని రవాణా సదుపాయాలు, మౌళిక సదుపాయాలు సంవృద్ధిగా ఉన్న ప్రాంతాల వారీగా ఫ్లాట్ ధరలు ఉన్నాయి. పట్టణానికి కాస్త దూరంగా ఉన్న ఉప్పల్, ఎల్బీనగర్, బీఎన్ రెడ్డి, నాగోల్, పటాన్ చెరు, శంషాబాద్, జీడిమెట్ల వంటి ప్రాంతాల్లో ధరలు బాగానే ఉన్నాయి. ఇక్కడ సింగిల్ బెడ్ రూం రూ.50 లక్షలు, డబుల్, ట్రిపుల్ బెడ్ రూమ్స్ అయితే.. రూ. 58 నుండి రూ. 64 లక్షల వరకు ఉంటోంది. హైదరాబాద్ శివారు ప్రాంతాలైన శామీర్ పేట్, అల్వాల్, తారామణి పేట, బాచారం, ఘట్ కేసర్ వంటి ప్రాంతాల్లో సింగిల్ బెడ్ రూం ఫ్లాట్ ధర రూ. 40 లక్షలు పలుకుతోంది. డబుల్ బెడ్ రూం రూ. 44 లక్షలుగా ఉంది. ఇక ట్రిపుల్ బెడ్ రూం అయితే రూ. 48 లక్షలు చెబుతున్నారు.

ఇక నగర నడిబొడ్డు ప్రాంతాలైన జూబ్బీహిల్స్, బంజారా హిల్స్, మాదాపూర్, హైటెక్ సిటీ, కొండాపూర్, గచ్చిబౌలి, మియాపూర్, మణికొండ, నార్సింగి, కోకాపేట్, మెకిల ప్రాంతాల్లో ఏ ఫ్లాట్ అయినా కోటి రూపాయల పై చిలుకు పలుకుతున్నాయ ప్లాట్ ధరలు. అంటే చదరపు అడుగులు సుమారు 10 వేలు ఉంటుంది. గేటెడ్ కమ్యూనిటీ సౌకర్యాలను బట్టి.. ఆ ధరలు మరింత అధిక ధర కోట్ చేస్తున్నారు బిల్డర్స్. ఇక విల్లాల సంగతి చెప్పనక్కర్లేదు. రూ. 5 కోట్ల నుండి రూ. 25-30 కోట్ల వరకు పులుకుతున్నాయి. దీన్ని బట్టి చూస్తే హైదరాబాద్ లో మినిమం రూ.40 లక్షలు ఉంటే.. సొంటింటి కలను నిజం చేసుకోవచ్చు. ఇదిలా ఉంటే.. ఇవి నిజంగా చౌక ధరకే వస్తున్నాయని, అసెంబ్లీ ఎన్నికలు జరిగే సమయంలో .. ఆ తర్వాత మరింత పెరిగే అవకాశాలున్నాయని విశ్లేషకులు చెబుతున్నారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి