iDreamPost
iDreamPost
మలయాళంలో రేపే విడుదలవుతున్నా అఖండ దెబ్బకు తెలుగులో ఒక రోజు ఆలస్యంగా వస్తున్న మోహన్ లాల్ మరక్కార్ అరేబియా సింహం చాలా గ్రాండ్ గా కనిపిస్తోంది కానీ ఇక్కడ మాత్రం ఎలాంటి సౌండ్ చేయడం లేదు. కీర్తి సురేష్ – యాక్షన్ కింగ్ అర్జున్ లాంటి నోటెడ్ ఆర్టిస్టులు ఉన్నా ఎందుకో మన ప్రేక్షకులకు అంతగా కనెక్ట్ కావడం లేదు. పైగా ప్రమోషన్లు కూడా అంతంత మాత్రంగా ఉండటంతో ఓపెనింగ్స్ విషయంలో పెద్దగా ఆశలు పెట్టుకోవడానికి లేదు. కేరళలో ఎంత బజ్ ఉన్నా మమ్ముట్టి, మోహన్ లాల్ డబ్బింగ్ సినిమాలు మన దగ్గర ఆడిన దాఖలాలు చాలా తక్కువ. ఎప్పుడో పాతికేళ్ల క్రితం మంచి వసూళ్లు వచ్చేవి కానీ ఇప్పుడు కాదు
మరక్కార్ దర్శకుడు ప్రియదర్శన్ భారీ బడ్జెట్, హై ఎండ్ గ్రాఫిక్స్ తో దీన్ని తెరకెక్కించారు. ముందు ఓటిటి రిలీజ్ కు ఫిక్స్ అయ్యాక మనసు మార్చుకుని మళ్ళీ థియేటర్ మార్గం పట్టారు. దీనికి గత ఏడాది విభాగంలోనే జాతీయ అవార్డు దక్కింది. నిన్న వదిలిన ట్రైలర్ ప్రామిసింగ్ గా అనిపిస్తున్నప్పటికీ ఇక్కడ బ్లాక్ బస్టర్ టాక్ వస్తే తప్ప మనవాళ్ళు ఆదరించడం కష్టం. ఒకవేళ అఖండ కొంచెం అటుఇటు అయితే అప్పుడు మరక్కార్ కి ఏ సెంటర్స్ లో మంచి రెస్పాన్స్ ఉండొచ్చు. ఇప్పటికైతే పెద్దగా చప్పుడు లేదు. బాహుబలి తరహాలో ఇది కూడా నిలిచిపోతుందనే అంచనాలో మల్లువుడ్ వర్గాలున్నాయి.
ఇప్పుడీ రెండు రోజుల సినిమాల మీద ట్రేడ్ దృష్టి గట్టిగా ఉంది. ఓమిక్రాన్ వైరస్ ప్రచారం నేపథ్యంలో థియేటర్లకు వచ్చే జనాల శాతంలో ఏమైనా హెచ్చుతగ్గులు ఉంటాయా లేదానేది పరిశీలించబోతున్నారు. ముఖ్యంగా అందరి కన్ను అఖండ మీదే ఉంది. ప్రీ రిలీజ్ పాజిటివ్ వైబ్రేషన్స్ ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఒకవేళ టార్గెట్ పెట్టుకున్న 54 కోట్ల థియేట్రికల్ బిజినెస్ ని కనక షేర్ రూపంలో అఖండ అందుకోగలిగితే ఆపై వచ్చే పుష్ప లాంటి వాటికి ఊతం దక్కుతుంది. మరక్కార్ చేసే అద్భుతాలు పెద్దగా ఉండకపోయినా కురుప్ లాగా పెట్టుబడిని సేఫ్ గా ఇస్తుందన్న నమ్మకం డిస్ట్రిబ్యూటర్లలో ఉంది. చూడాలి మరి ఏమైనా సర్ప్రైజ్ చేస్తారేమో
Also Read : Shyam Singha Roy : శ్యామ్ సింగ రాయ్ కు రెండు వైపులా చిక్కులు