ఆట తీరు మార్చకపోతే కష్టం గురూ

గత నాలుగు సీజన్లతో పోలిస్తే బిగ్ బాస్ సీజన్ 5 చప్పగా సాగుతున్న మాట వాస్తవం. పెద్దగా హడావిడి కనిపించడం లేదు. ఆ మధ్య రామ్ చరణ్ ని తీసుకొచ్చి జోష్ నింపే ప్రయత్నం చేసినా వీక్ డేస్ లో పరిస్థితి మళ్ళీ మొదటికే వచ్చింది. రేటింగ్స్ ఆశించినంత రావడం లేదని టిఆర్పి రిపోర్ట్. దీనికన్నా వెనుకబడుతుందని భావించిన ఎవరు మీలో కోటీశ్వరుడు చాలా మెరుగ్గా ఉండటం గమనార్హం. షో టైమింగ్స్ లో రెండింటి మధ్య క్లాష్ లేనప్పటికీ రాత్రి 10 గంటలకు ప్రసారమవుతున్న బిగ్ బాస్ వైపు ఫ్యామిలీ ఆడియన్స్ పెద్దగా ఆసక్తి చూపించడం లేదన్నది ట్రెండ్ ని గమనిస్తే అర్థమవుతుంది. స్టార్ మా ఛానల్ దీని మీద గట్టిగానే ఫోకస్ పెట్టిందట.

దీనికి కొన్ని కారణాలు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా పార్టిసిపెంట్స్ విషయంలో ప్రేక్షకులు ఏమంత సంతృప్తిగా లేరు. ఎక్కువ సోషల్ మీడియా బ్యాచ్ ని దింపడం ఒకరకంగా ప్లస్ అయితే ఎక్కువ మైనస్ గా మారుతోంది. గతంలో పాల్గొన్న శివ బాలాజీ, రాహుల్ సింప్లిగుంజ్, ధన రాజ్, గీతా మాధురి, నవదీప్ లాంటి వాళ్ళకు స్వతహాగా ఫాలోయింగ్ తో పాటు అంతో ఇంతో బయట ఫైనాన్షియల్ బ్యాక్ అప్ ఉండేది. దాని వల్ల ఫేస్ బుక్, ఇన్స్ టా, ట్విట్టర్లలో బాగా క్యాంపైన్ చేసుకున్నారు. దాని ప్రభావం ఉంది. కానీ ఇప్పుడున్న వాళ్ళలో కొందరికి ఈ విషయంలో సపోర్ట్ తక్కువగా ఉంది. అందుకే ఏం జరుగుతున్నా బయట హై లైట్ కావడం లేదు.

ఇప్పుడీ గ్యాప్ ని రిపేర్ చేసే పనిలో షో నిర్వాహకులు ఉన్నట్టు సమాచారం. వైల్డ్ కార్డు ఎంట్రీలు కూడా ఇప్పటిదాకా జరగలేదు. రెండు మూడు పేర్లు పరిశీలనలో ఉన్నాయి కానీ గేమ్ ని తమవైపు తిప్పుకుని హంగామా చేస్తూ కనీసం రెండు మూడు వారాలు హౌస్ లో ఉండేలా ఎవరైనా సెలబ్రిటీ వస్తే బెటర్ గా ఉంటుంది. యాంకర్ రవి సైతం ఏమంత మేజిక్ చేయలేకపోతున్నాడు. ఉన్నంతలో ప్రియాకు బయట మద్దతు ఎక్కువగా కనిపిస్తోంది. ఆన్ లైన్ వోటింగ్స్ లో సన్నీ(23%) మొదటి స్థానంలో ప్రియా(18%) రెండో ప్లేస్ లో ఉన్నారు. ఎల్లుండి జరగబోయే ఎలిమినేషన్ తో పాటు రాబోయే రోజుల్లో అయినా ఆసక్తి పెరిగేలా ఏమైనా చేస్తారేమో చూడాలి

Also Read : రాజీ ప్రసక్తే లేదంటున్న ప్రభాస్ టీమ్

Show comments