iDreamPost
android-app
ios-app

సచిన్‌తో ఉన్న చిన్నోడు.. ఇప్పుడు టాలీవుడ్ యంగ్ హీరో.. ఎవరో తెలుసా..?

  • Published Nov 05, 2023 | 12:22 PM Updated Updated Nov 05, 2023 | 12:22 PM

ప్రస్తుతం త్రో బ్యాక్ ట్రెండ్ నడుస్తోంది. నటీనటులు తమ చిన్నప్పటి ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ట్రెండింగ్ లో నిలుస్తున్నారు. మరికొన్నింటిని ఫ్యాన్స్, మీమర్స్ వైరల్ అయ్యేలా చేస్తున్నారు. ఈ పిక్ కూడా ఆ కోవకు చెందినదే.

ప్రస్తుతం త్రో బ్యాక్ ట్రెండ్ నడుస్తోంది. నటీనటులు తమ చిన్నప్పటి ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ట్రెండింగ్ లో నిలుస్తున్నారు. మరికొన్నింటిని ఫ్యాన్స్, మీమర్స్ వైరల్ అయ్యేలా చేస్తున్నారు. ఈ పిక్ కూడా ఆ కోవకు చెందినదే.

  • Published Nov 05, 2023 | 12:22 PMUpdated Nov 05, 2023 | 12:22 PM
సచిన్‌తో ఉన్న చిన్నోడు.. ఇప్పుడు టాలీవుడ్ యంగ్ హీరో.. ఎవరో తెలుసా..?

ప్రస్తుతం సోషల్ మీడియాదే హవా. ఇది ట్రెండింగ్ అవుతుందో దానిపైనే దృష్టిసారిస్తుంటారు. అలాగే ట్రెండింగ్ చేస్తూ ఉంటారు. ముఖ్యంగా నటీనటులకు సంబంధించిన ఏ పిక్ కనిపించినా వదిలిపెట్టరు. ఇప్పుడు ఎలాగో త్రో బ్యాక్ ట్రెండ్ కాబట్టి.. నటీనటుల చిన్నప్పటివి లేదంటే ఇండస్ట్రీలోకి రాక ముందు ఫోటోలు బయటకు వస్తుంటాయి. సామాజిక మాధ్యమాల్లో షేర్ చేసుకున్న పిక్స్‌ను.. నెటిజన్లు వలవేసి పట్టి.. నెట్టింట్లో చక్కర్లు కొట్టిస్తుంటారు. అటువంటిదే ఈ ఫోటో కూడా. ఇందులో దిగ్గజ మాజీ క్రికెటర్ సచిన్ టెండూల్కర్ చేతిలో ఉన్న ఈ కుర్రాడిని చూశారా.. అయితే ఎవరో గుర్తు పట్టండి. అతడు ఇప్పుడు టాలీవుడ్ యంగ్ హీరో కూడా.

ఎంతో క్యూట్‌గా, చబ్బీ చబ్బీగా కనిపిస్తున్న ఈ పిల్లగాడు.. ఇప్పుడు హీరో అయ్యి.. పాన్ ఇండియా మూవీలో ఛాన్స్ కొట్టేశాడు. పరిశ్రమలోకి అడుగుపెడుతూనే.. సెన్సేషనల్ హీరోయిన్ ప్రక్కన నటించాడు (అతడితో నటించాకే ఫేమ్ వచ్చిందని చెప్పొచ్చు). ఇంతకు అతడు ఎవరంటే.. మన కుటుంబ కథా చిత్రాల నాయకుడు, హీరో, ఇప్పటి విలన్, బిజియెస్ట్ క్యారెక్టర్ ఆర్టిస్టుగా మారిన శ్రీకాంత్ కుమారుడు రోషన్. తండ్రి వారసత్వాన్ని పుణుకుపుచ్చుకుని.. హీరోగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టాడు ఈ లవ్ బాయ్. నిర్మల్ కాన్వెంట్ అనే సినిమాతో చైల్డ్ ఆర్టిస్ట్ గా పరిచయమైన టాలీవుడ్ హృతిక్ రోషన్.. ఆ తర్వాత కథానాయకుడిగా మారాడు.

తన తండ్రి నటించిన, సెన్సేషనల్ హిట్‌గా నిలిచిన పెళ్లి సందడి టైటిల్ తో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. టాలీవుడ్ టాప్ హీరోయిన్‌గా మారిన శ్రీలలకు కూడా ఇదే తొలి సినిమా. శ్రీలల వరుసగా సినిమాలు చేసుకుంటూ పోతుంది. అయితే రోషన్ మాత్రం కథల ఎంపికలో ఆచి తూచి అడుగులు వేస్తున్నాడు. ప్రస్తుతం మోహన్ లాల్ కీలక పాత్రలో తెరకెక్కిస్తున్న పాన్ ఇండియా మూవీ వృషభలో నటిస్తున్నాడు. కనెక్ట్ మీడియా, బాలాజీ తెలుగు ఫిలిమ్స్, ఏవీఎస్ స్టూడియోస్ బ్యానర్లపై ఈ సినిమా నిర్మితమౌతుంది. 2024లో ఈ సినిమా విడుదలయ్యే అవకాశాలు ఉన్నాయి. అలాగే చాంపియన్ అనే మూవీలో కూడా నటిస్తున్నారు రోషన్. స్పోర్స్ట్ డ్రామాగా ఈ సినిమాను తెరకెక్కిస్తోంది వైజయంతి మూవీస్.

 

View this post on Instagram

 

A post shared by Roshann meka (@iamrshn)

Jojobet GirişJojobetHoliganbetHoliganbetHoliganbetJojobetholiganbetjojobetgrandpashabetbetparkcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetgrandpashabetbetwoon girişgrandpashabetEscortes BelgiqueGrandpashabetCasibomGrandpashabet Giriş