iDreamPost
android-app
ios-app

అమ్మాయిలను, మహిళలను వేధిస్తున్న పోకిరీ.. ఉతికారేసింది

పొద్దున లేచిన దగ్గర నుండి బలాదూర్ గా రోడ్లపై తిరగడం, బాధ్యత పట్టకుండా షికార్లు చేయడం.. తన లాంటి బేకార్లతో ముచ్చట్లు పెట్టడం ఇదే పోకిరీల పని. రోడ్డుపై ఎవరైనా నడవడం పాపం.. వాళ్లను ర్యాగింగ్ చేస్తూ ఆనందం పొందుతుంటాడు.

పొద్దున లేచిన దగ్గర నుండి బలాదూర్ గా రోడ్లపై తిరగడం, బాధ్యత పట్టకుండా షికార్లు చేయడం.. తన లాంటి బేకార్లతో ముచ్చట్లు పెట్టడం ఇదే పోకిరీల పని. రోడ్డుపై ఎవరైనా నడవడం పాపం.. వాళ్లను ర్యాగింగ్ చేస్తూ ఆనందం పొందుతుంటాడు.

అమ్మాయిలను, మహిళలను వేధిస్తున్న పోకిరీ.. ఉతికారేసింది

eve-teasing

పోకిరీలకు పనులేమీ ఉండవు. పొద్దున నుండి సాయంత్రం వరకు రోడ్డు మీద పడి తిరగడం..బాగా రద్దీ ఉండే ప్రాంతాల్లో ఓ ప్లేస్ ఎంచుకుని గోడపై కూర్చొని.. అటు, ఇటు పోయేవాళ్లని టీజ్ చేయడం, ర్యాగింగ్ చేస్తూ ఉంటారు. చిన్న పిల్లల నుండి పెద్ద వాళ్ల వరకు ఎవ్వరినీ వదిలిపెట్టరు. అడ్డుగోలుగా కామెంట్లు చేయడం, విజిల్స్, చప్పట్లు, వెక్కిరింతలు, బూతులు మాట్లాడటం వంటి వల్గర్ పనులు చేస్తుంటారు. ఇక అమ్మాయిలు కనిపడితే చాలు.. పై నుండి కిందకు చూస్తూ వెకిలి మాటలు మాట్లాడుతూ.. మానసిక వేదనకు గురి చేస్తుంటారు. ఇలాంటి ఆగడాలకు పాల్పడుతున్న ఓ పోకిరీని తోలు వలిచేలా కొట్టిందో మహిళ. బతిమాలాడుకున్నా వదల్లేదు.

కుక్కను కొట్టినట్లు కొట్టింది. ఈ వీడియో వైరల్ అవుతుంది. ఈ ఘటన ఉత్తరప్రదేశ్‌లోని బులందర్ షహర్‌లో చోటుచేసుకుంది. బాలికను వేధిస్తున్నాడన్న ఆరోపణలతో ఓ మైనర్‌ను పిచ్చ కొట్టుడు కొట్టింది. అన్సారీ రోడ్ మార్కెట్‌లో మహిళ కొట్టినట్లు తెలుస్తోంది. మార్కెట్ కు వచ్చే అమ్మాయిలను కుర్రాడు ఆటపట్టించేవాడని, మహిళలను, అమ్మాయిలను వెకిలి మాటలతో ర్యాగింగ్ చేసేవాడని తెలుస్తోంది. తొలుత వాడి ఆగడాలను పట్టించుకోనప్పటికీ.. అవి శృతి మించడంతో.. ఓ మహిళ క్షమించలేదు. బాలుడ్ని పట్టుకుని కర్ర తీసుకుని కొట్టింది. వదిలేమని వేడుకున్నా ఆమె వదల్లేదు. చేతులు వెనక్కు మెలిపెట్టి చెంప చెళ్లుమనిపించింది.

యువకుడ్ని మహిళ అలా కొడుతుంటే.. వీడియో తీస్తున్నారు, చోద్యం చూస్తున్నట్లు చూస్తున్నారే తప్ప.. ఎవ్వరూ అడ్డు చెప్పలేదు. ఆ మహిళ నుండి కుర్రాడిని రక్షించేందుకు ముందుకు కూడా రాలేదు. అయితే చితకొట్టిన తర్వాత.. బాలుడు ఆమెను వదిలేయాంటూ వేడుకున్నాడు. అయితే ఈ ఘటనపై పోలీసులకు ఫిర్యాదు అందినట్లు కానీ, ఇతర సమాచారం కానీ లేదు. అయితే వీడియో మాత్రం నెట్టింట్లో హల్ చల్ చేస్తోంది.

Jojobet Girişdeneme bonusuDeneme Bonusu Veren SitelermeritkingDeneme Bonusu Veren SitelerbetparkGrandpashabetgrandpashabetGrandpashabetGrandpashabetGrandpashabetGrandpashabetcasibomtimebetjojobet girişdeneme bonusu veren sitelerMariobetMariobetMadridbetMadridbetcasibomgrandpashabet girişJojobetgrandpashabetcasibomcasibomultrabetgrandpashabetultrabetgrandpashabet girişcasinoroyalbetciograndpashabet girişcasibom girişgrandpashabet girişgrandpashabetgrandpashabetholiganbet