iDreamPost
android-app
ios-app

The Gray Man ‘ది గ్రే మ్యాన్’ స్క్రీనింగ్‌లో హీరో ధనుష్ హాలీవుడ్ ఎటెన్ష‌న్ కొట్టేశాడు

  • Published Jul 12, 2022 | 3:55 PM Updated Updated Jul 12, 2022 | 3:55 PM
  • Published Jul 12, 2022 | 3:55 PMUpdated Jul 12, 2022 | 3:55 PM
The Gray Man  ‘ది గ్రే మ్యాన్’ స్క్రీనింగ్‌లో హీరో ధనుష్ హాలీవుడ్ ఎటెన్ష‌న్ కొట్టేశాడు

బాలీవుడ్‌లో పేరు తెచ్చుకున్నాడు. ఇప్పుడు సౌత్ ఇండియా సూపర్ స్టార్ ధనుష్ హాలీవుడ్ ఎటెన్ష‌న్ ను సంపాదించ‌డానికి రెడీ అయ్యాడు. రుస్సో బ్రదర్స్ సినిమా ‘ది గ్రే మ్యాన్’ ప్రమోషన్ చేస్తున్నాడు.

ఒక సౌత్ ఇండియ‌న్ యాక్ట‌ర్, హాలీవుడ్ సినిమా ప్ర‌మోష‌న్ కోసం హాలీవుడ్ కోస్టార్స్ తో స్టేజ్ మీద‌కు రావ‌డం నిజంగా గొప్ప విష‌య‌మే. ఈ ప్ర‌మోష‌న‌ల్ ఈవెంట్ స్టేజ్ మీద, క్రిస్ ఎవాన్స్(Captain America Chris Evans), ర్యాన్ గోస్లింగ్(Ryan Gosling), అనా డి అర్మాస్(Ana de Armas) రెగె-జీన్ పేజ్(Regé-Jean Page)
వంటి కోస్టార్స్ ఉన్నారు.

మొద‌టి సినిమాతో హాలీవుడ్ తో అల్లుకుపోతున్న‌ట్లే ధ‌నుష్ క‌నిపిస్తున్నాడు. ఇప్పుడు వైరల్ అయిన వీడియోలో, ధనుష్ ‘ది గ్రే మ్యాన్’లో ఎలా తాను ఎలా నటించాడో చెప్పాడు. మీడియా అడిగిన ప్ర‌శ్నకు ‘నేను ఈ సినిమాలోకి ఎలా వ‌చ్చానో నాకు తెలియదు’ అని అన్న‌ప్పుడు అత‌ని సింపుల్ సిటీకి, మాట‌ల‌కు ర్యాన్ గోస్లింగ్ , క్రిస్ ఎవాన్స్ తోపాటు ఆడియ‌న్స్ కూడా పెద్ద‌గా న‌వ్వేశారు.

ద గ్రే మేన్ ప్రిమియ‌ర్ కోసం, లాస్ ఏంజిల్స్‌లో జరిగిన మీడియా స‌మావేశంలో ధ‌నుష్ మాట్లాడాడు. ద గ్రేమేన్ లో అవ‌కాశం వచ్చినందుకు చాలా ఎగ్జైటెడ్‌గా, థ్రిల్‌గా ఉన్నానని, ఈ సినిమాలో తాను బాగా నటించానని ధనుష్ గ‌ర్వంగా చెప్పారు.

‘ది గ్రే మ్యాన్’లో ధనుష్ హంతకుడిగా నటిస్తున్నారు. ఈ హీరో యాక్టింగ్ కు మేం ఫిదా అయిపోయామ‌ని రూసో సోదరులు ధనుష్ మీద‌ ప్రశంసలు కురిపించారు. అందుకే ఈ దర్శక-ద్వయం నెక్ట్స్ ప్రాజెక్ట్ లోనూ ధ‌నుష్ యాక్ట్ చేయ‌నున్నాడు.

ఈ సినిమా మీద ఇండియ‌న్ ఆడియ‌న్స్ లో అప్పుడే క్రేజ్ వ‌చ్చేసింది. ధనుష్ అభిమానుల‌కు ట్ర‌యిల‌ర్ నచ్చినా, ఆ స్టంట్స్, ఆ యాక్టింగ్ మా హీరోకి కొట్టిన పిండేన‌ని కామెంట్స్ చేస్తున్నారు. అంతేనా? త‌మిళ సినిమాల్లో ఇంత‌క‌న్నా గొప్పగా ఫైట్స్ చేశాడ‌ని ధ‌నుష్ ను ఆకాశానికెత్తేస్తున్నారు.

Jojobet GirişHoliganbetHoliganbetHoliganbetGrandpashabetholiganbetholiganbetjojobetgrandpashabetbetparkcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetcasibom girişCasibomgrandpashabetJojobet Girişbigboss