Movie Entertainment : డెఫినెషన్ మార్చుకుంటున్న సినిమా వినోదం

కరోనా మరొకటో కారణం ఏదైనా ఓటిటి ఎంటర్ టైన్మెంట్ తనకంటూ కొత్త డెఫినేషన్ ని రాసుకుంటోంది. థియేటర్లో వచ్చి వెళ్ళిపోయిన సినిమాలు మాత్రమే కాదు ఈ ప్లాట్ ఫార్మ్ కోసమే చిత్రాలు విడిగా తీయాల్సిన ట్రెండ్ వచ్చేసింది. రెండింట్లో ఏది అటుఇటు అయినా ఫలితం కూడా దానికి తగ్గట్టే వస్తోంది. గత కొన్ని నెలల్లో వచ్చిన డిజాస్టర్లను గమనిస్తే వీటి కోసం హాలు దాకా వెళ్లే అవసరం లేదు కదానే ఫీలింగ్ వచ్చిన ప్రేక్షకులే ఎక్కువ. ముఖ్యంగా తక్కువ బడ్జెట్ లో పెద్దగా పరిచయం లేని హీరో హీరోయిన్లతో తీసిన సినిమాలు బాగా రిస్క్ లో పడుతున్నాయి. ఓపెనింగ్స్ వీక్ గా రావడంతో పాటు మౌత్ టాక్ వచ్చేలోపే థియేటర్ల నుంచి మాయమవుతున్నాయి.

క్లియర్ గా చెప్పాలంటే థియేటర్ ఎక్స్ పీరియన్స్ డిమాండ్ చేసే కంటెంట్ ని ఇకపై ఆషామాషీగా తీసుకోవడానికి లేదు. ఒకప్పుడు ఊరికే టైం పాస్ కాకపోతే చాలు జనం సినిమాలకు వెళ్ళేవాళ్ళు. అప్పట్లో యుట్యూబ్లు, ఓటిటిలు లేవు. 80, 90 దశకంలో చాలా మంది ఇళ్లల్లో కనీసం టీవీలు కూడా ఉండేవి కాదు. అందుకే రోజుకు నాలుగేసి ఆటలతో సిల్వర్ జూబ్లీలు చేసుకున్న బ్లాక్ బస్టర్లు ఎన్నో. ఏడాది ఆడినవి చాలా ఉన్నాయి. కానీ ఇప్పుడంత సీన్ లేదు. ఎంత పెద్ద స్టార్ అయినా మహా అంటే రెండు వారాలు. మూడో వారం హౌస్ ఫుల్ చేయిస్తే అది గొప్పే. ఘనంగా చెప్పుకోవచ్చు. అంతలా పరిస్థితులు విపరీతమైన మార్పులకు గురి కావడం వాస్తవం.

ఏ సినిమా అయినా తీయడానికి ముందు అయితే థియేటర్ లేదా ఓటిటికి ఇద్దాం అనుకోవడానికి లేదు. డిజిటల్ సంస్థలు కూడా తమ పాలసీలు మార్చుకున్నాయి. కంటెంట్ సెలక్షన్ లో చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నాయి. వాటికీ చేదు అనుభవాలు ఉన్నాయి. కోట్లు కుమ్మరించి దెబ్బ తిన్న సందర్భాలు కోకొల్లలు. అందుకే ప్లానింగ్ విషయంలో ఆచి తూచి అడుగులు వేస్తున్నాయి. ఓటిటికి తీసింది థియేటర్ కు ఇచ్చినా హాల్లో రావాల్సింది డిజిటల్ లో డైరెక్ట్ గా వేసినా తేడాలు వచ్చేస్తాయి. అందుకే ఇకపై రెండు విడివిడిగా చూస్తేనే దర్శక రచయితలు మంచి క్వాలిటీని రాయగలరు తీయగలరు. ప్రేక్షకుల డిమాండ్స్ అలా మారిపోయాయి మరి

Also Read : SS Rajamouli : రాజమౌళి ఆ కలయికని సాధ్యం చేస్తారా

Show comments