Somesekhar
ప్రస్తుతం టాలీవుడ్ డేంజర్ లో ఉందని, సినిమాను ఓటీటీలు ముంచేస్తున్నాయని కొందరు సినీ పండితులతో పాటుగా సినీ లవర్స్ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇందుకు సంబంధించి పూర్తి వివరాల్లోకి వెళితే..
ప్రస్తుతం టాలీవుడ్ డేంజర్ లో ఉందని, సినిమాను ఓటీటీలు ముంచేస్తున్నాయని కొందరు సినీ పండితులతో పాటుగా సినీ లవర్స్ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇందుకు సంబంధించి పూర్తి వివరాల్లోకి వెళితే..
Somesekhar
టాలీవుడ్.. వేల కోట్ల వ్యాపారం, అంతకంటే ఎక్కువ వేల కుటుంబాల జీవనాధారం. అలాంటి టాలీవుడ్ ప్రస్తుతం డేంజర్ జోన్ లో ఉంది. అదేంటి? ఇండస్ట్రీలో హీరోలందరూ సినిమాలతో బిజీగా ఉన్నారు, మూవీస్ రిలీజ్ అవుతూనే ఉన్నాయి మీరేమో డేంజర్ జోన్ లో ఉందని అంటున్నారు? ఇదెక్కడి లాజిక్ అని మీరు అనుకోవచ్చు. ప్రస్తుతం టాలీవుడ్ లో సినిమాలు నిర్మించే తీరు పూర్తిగా మారిపోయింది. పైగా దాదాపు ఇప్పుడు వచ్చే చిత్రాలన్నీ పాన్ ఇండియా మూవీసే. అయితే కోవిడ్ కాలంలో ఎప్పుడైతే ఓటీటీ సంస్థలు ఎంట్రీ ఇచ్చాయో.. అప్పటి నుంచి ఇండస్ట్రీ స్వరూపమే మారిపోయింది. ప్రస్తుతం టాలీవుడ్ డేంజర్ లో ఉందని, సినిమాను ఓటీటీలు ముంచేస్తున్నాయని కొందరు సినీ పండితులతో పాటుగా సినీ లవర్స్ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇందుకు సంబంధించి పూర్తి వివరాల్లోకి వెళితే..
బాహుబలి సినిమా నుంచి టాలీవుడ్ లో మూవీస్ తీసే విధానం పూర్తిగా మారిపోయింది. మరోవైపు కోవిడ్ కారణంగా పుట్టగొడుగుల్లా ఓటీటీలు పుట్టుకొచ్చాయి. దాంతో నిర్మాతలకు థియేట్రికల్ రైట్స్ తో పాటుగా ఓటీటీలకు సినిమాను అమ్ముకోవడం ద్వారా ఆదాయం రావడం మెుదలైంది. అయితే ఇక్కడి వరకు బాగానే ఉంది. కానీ.. కరోనా తర్వాత పూర్తిగా పరిస్థితులు మారిపోయాయి. థియేటర్లకు ప్రేక్షకులు రావడం తగ్గించేశారు. సినిమాకు సూపర్ హిట్ టాక్ వచ్చి.. మౌత్ టాక్ ద్వారా థియేటర్లకు వెళ్లే పరిస్థితులు నెలకొన్నాయి. అదీకాక ఓటీటీల రూపంలో థియేటర్ వ్యవస్థకు గడ్డురోజులు వస్తున్నాయి.
ఇదిలా ఉండగా.. ఓటీటీలు రానురాను సినిమాలను కొనే విధానాన్ని పూర్తిగా మార్చేశాయి. చిన్న సినిమాల వైపు కన్నెత్తికూడా చూడ్డంలేదు. అదీకాక ఓటీటీలు ఇప్పుడు సినిమాలను శాసించే స్థాయికి ఎదిగిపోయాయని సినీ ప్రముఖులు అంటున్నారు. అందుకు కారణాలు లేకపోలేదు. ఓటీటీ సంస్థలతో పెట్టుకున్న ఒప్పందం కారణంగా వారు చెప్పిన తేదీలకే, నిర్మాతలకు ఇష్టం లేకపోయినా సినిమాలను విడుదల చేయాల్సి వస్తుంది. దీంతో పాటుగా మూవీ విడుదల అయిన నాలుగు, అయిదు వారాలకే స్ట్రీమింగ్ చేయాలని కండీషన్స్ పెడుతున్నాయట సదరు సంస్థలు. దాంతో రానురాను సినిమాల మనుగడ కష్టం అయిపోతుందని మూవీ లవర్స్ వాదిస్తున్నారు. సినిమా ద్వారా బతికే సంస్థలు సినిమాను ముంచే స్థాయికి వెళ్తుండటం భవిష్యత్ కు మంచిదికాదని సోషల్ మీడియా వేదికగా సినిమా ప్రేమికులు కామెంట్స్ చేస్తున్నారు. ఓటీటీ విధానంలో మరిన్ని మార్పులు తీసుకురావాలని వారు కోరుకుంటున్నారు. పరిస్థితి ఇలాగే కొనసాగితే.. టాలీవుడ్ డేంజర్ లో పడటమే కాదు.. సినిమా మనుగడ కష్టం అవుతుంది కూడా. మరి ఈ విషయంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.