iDreamPost
android-app
ios-app

OTTలోకి ‘కిల్’ మూవీ తెలుగు వెర్షన్! ఎక్కడ చూడొచ్చంటే?

  • Published Sep 24, 2024 | 10:02 PM Updated Updated Sep 24, 2024 | 10:10 PM

Kill Movie: థియేటర్లో మిస్ అయినా కొన్ని బ్లాక్ బస్టర్ సినిమాల కోసం ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురు చూస్తుంటారు. బాలీవుడ్ బాక్స్ ఆఫీస్ వద్ద విధ్వంసం సృష్టించిన సినిమా 'కిల్'..

Kill Movie: థియేటర్లో మిస్ అయినా కొన్ని బ్లాక్ బస్టర్ సినిమాల కోసం ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురు చూస్తుంటారు. బాలీవుడ్ బాక్స్ ఆఫీస్ వద్ద విధ్వంసం సృష్టించిన సినిమా 'కిల్'..

OTTలోకి ‘కిల్’ మూవీ తెలుగు వెర్షన్! ఎక్కడ చూడొచ్చంటే?

థియేటర్లో మిస్ అయినా కొన్ని బ్లాక్ బస్టర్ సినిమాల కోసం ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తుంటారు. ఆ సినిమాల ఓటీటీ ఎంట్రీ కోసం పడి గాపులు కాస్తూ ఉంటారు. ఓటీటీ అన్నాక ఎలాంటి కంటెంట్ రిలీజ్ అవుతూ ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. కథలో కంటెంట్ ఉంటే కనుక హాలీవుడ్ , బాలీవుడ్ , టాలీవుడ్ అని తేడా లేకుండా ప్రతి సినిమాని కూడా ఆదరిస్తూ ఉంటారు ప్రేక్షకులు. ఈ క్రమంలో బాలీవుడ్ బాక్స్ ఆఫీస్ వద్ద విధ్వంసం సృష్టించిన సినిమా ‘కిల్’.. విడుదల అయ్యాక మోస్ట్ వైలెంట్ యాక్షన్ డ్రామాగా క్రేజ్ సంపాదించుకున్న ఈ మూవీని.. థియేటర్ లో మిస్ అయినా తెలుగు వారు.. ఓటీటీలో చూడాలని ఎదురుచూస్తున్నారు. ఇక ఇప్పుడు ఈ మూవీ ఓటీటీ లో ఎంట్రీ ఇచ్చేసింది.

సెప్టెంబర్ 6 నుంచి ఈ మూవీ ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ అయిన హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ అవుతుంది. 20 రోజుల నుంచి కేవలం హిందీలోనే అందుబాటులో ఉన్న ఈ మూవీ సెప్టెంబర్ 24 నుంచి తెలుగుతోపాటు తమిళం, మలయాళం భాషల్లోనూ స్ట్రీమింగ్ అవుతుంది. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద రూ.50 కోట్ల వరకు వసూలు చేసింది. ఈ మూవీలో హింస ఎక్కువగా ఉందంటూ అనేక విమర్శలు వచ్చాయి. కానీ అటు బాక్సాఫీస్ వద్ద మాత్రం బ్లాక్ బస్టర్ హిట్ అయ్యింది. ఇక ఈ మూవీలో లక్ష్ లాల్వానీ, తాన్య మనక్తి కీలక పాత్రలు పోషించారు. గతేదాడి సెప్టెబంర్ నెలలో తొలిసారి టొరంటో ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్లో ఈ సినిమాని ప్రదర్శించారు.

ఈ సినిమా కథ విషయానికి వస్తే..కిల్ మూవీ రైల్లోనే సాగే యాక్షన్ థ్రిల్లర్. ఢిల్లీ నుంచి రాంచీకి వెళ్లే రైలులో బంధిపోట్లు దాడి చేస్తారు. వారి దాడిని హీరో ఎలా తిప్పుకొట్టాడు.. బందిపోట్ల దాడిలో హీరోయిన్, ఆమె కుటుంబానికి అసలు ఏం జరిగింది ? అనేది ఈ మూవీ కథ. ఈ మూవీకి డైరెక్టర్ నిఖిల్ నగేశ్ భట్ దర్శకత్వం వహించారు. ఇప్పుడు ఈ తెలుగులో కూడా స్ట్రీమింగ్ అవుతుంది. ఈ మూవీలో అమిత్ రాథోజ్ (ఆర్మీలో ఎన్ఎస్జీ కమాండర్)గా నటించి హీరో లక్ష్య లల్వానీ అదరగొట్టాడు. అతడి ప్రేయసి తులికా పాత్రలో హీరోయిన్ గా తన్య మనిక్తలా నటించింది. ఇక తాజాగా ఒటిటిలో విడుదల అయిన కిల్ తెలుగు వెర్షన్ పై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి.

Jojobet Girişdeneme bonusuDeneme Bonusu Veren SitelerDeneme Bonusu Veren SitelerbetparkGrandpashabetgrandpashabetGrandpashabetGrandpashabetGrandpashabetGrandpashabetcasibomtarafbet girişjojobet girişjojobet girişdeneme bonusu veren sitelerMadridbetMadridbetJojobetJojobetjojobetgrandpashabet girişgrandpashabet resmi girişgrandpashabetgrandpashabetGrandpashabetJojobetGrandpashabetJojobet Girişmarsbahis