Idream media
Idream media
ఈ రోజు శనివారం నుంచి పవిత్ర రంజాన్ మాసం ప్రారంభమైంది. దేశవ్యాప్తంగా శుక్రవారం రాత్రి నెలవంక దర్శనమివ్వడంతో ముస్లింలు రంజాన్ మాసం ప్రత్యేక ప్రార్థనలు చేశారు. కరోనా వైరస్ నేపధ్యంలో సామూహిక మత ప్రార్థనలు చేసేందుకు అవకాశం లేకుండా పోయింది.
ఈ మేరకు ఇప్పటికే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఆయా మసీదుల పెద్దలకు, ముస్లిం లకు సూచనలు జారీ చేశారు. ముస్లిం అందరూ ఇళ్లలో నే ఉండి ప్రార్థనలు చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలతో పాటు మత పెద్దలు కరోనా వైరస్ కట్టడికి తమ వంతు కృషి చేస్తున్నారు. రంజాన్ రంజాన్ ప్రార్థనలు ఇళ్లలో ఉండి నిర్వహించుకోవాలని సూచిస్తున్నారు.
ముస్లింలకు రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శుభాకాంక్షలు తెలియజేశారు. పవిత్ర రంజాన్ మాసంలో కరోనా ను కలిసికట్టుగా జయించేందుకు ముస్లిం సోదరులు అంతా తీర్మానం చేయాలని రాష్ట్రపతి కోరారు.
ప్రపంచవ్యాప్తంగా ఉండే ప్రతి ముస్లిం ఘనంగా జరుపుకున్న ఏకైక పండుగ రంజాన్. అయితే గతంలో ఎన్నడూ లేనివిధంగా కరోనా కారణంగా ఏర్పడిన పరిస్థితుల నడుమ ఈ సారి పండుగను జరుపుకొనున్నారు. బంధువులతో కలిసి పండుగ జరుపుకునే అవకాశం కరోనా కారణంగా లేకుండా పోయింది. ఇక ఘనంగా ఇచ్చే ఇఫ్తార్ విందులకు ఈ ఏడాది అవకాశం లేదు.