iDreamPost
android-app
ios-app

రజిని ‘జైలర్’లో ఎన్నో ఆకర్షణలు

  • Published Jun 20, 2022 | 6:01 PM Updated Updated Jun 20, 2022 | 6:02 PM
  • Published Jun 20, 2022 | 6:01 PMUpdated Jun 20, 2022 | 6:02 PM
రజిని ‘జైలర్’లో ఎన్నో ఆకర్షణలు

సూపర్ స్టార్ రజినీకాంత్ హీరోగా నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో రూపొందబోయే సినిమాకు జైలర్ టైటిల్ ని లాక్ చేసిన సంగతి తెలిసిందే. ఆ మేరకు చిన్న ప్రీ లుక్ పోస్టర్ లాంటిది వదిలారు కూడా. దీని రెగ్యులర్ షూటింగ్ వచ్చే నెల నుంచి మొదలుకానుంది. ఇందులో చాలా ఆకర్షణలు ఉండబోతున్నాయి. అందులో మొదటిది కన్నడ స్టార్ హీరో శివ రాజ్ కుమార్ చేయబోయే పాత్ర. మొదటిసారి ఈ కలయిక జరగనుంది. ఇందులో ఖైదీ క్యారెక్టర్ లో కనిపిస్తారని టాక్. ఫ్యాన్స్ శివణ్ణ అని పిలుచుకునే ఈ సీనియర్ హీరో శాండల్ వుడ్ కాకుండా బయటి భాషల్లో చేయడం చాలా అరుదు. గౌతమిపుత్ర శాతకర్ణిలో బుర్రకథ పాటలో నర్తించింది ఈయనే.

సౌత్ ఇండియన్ మ్యూజిక్ సెన్సేషన్ గా మారిన అనిరుద్ రవిచందర్ సంగీతం మీద అప్పుడే అంచనాలు ఎక్కడికో వెళ్లిపోతున్నాయి. విక్రమ్ లో కమల్ హాసన్ కి ఇచ్చిన నేపధ్య సంగీతం చూశాక అభిమానులు తలైవాకు ఎక్కువ ఆశించడం తప్పేమీ కాదు. ఇక రమ్యకృష్ణ కూడా ఈ ప్రాజెక్టులో భాగం కాబోతున్నారు. నరసింహలో నీలాంబరిగా ఇరవై ఏళ్ళ క్రితం పెర్ఫార్మన్స్ ని ఎవరూ మర్చిపోలేరు. బాబాలో అలా ఒక్క సీన్ కే పరిమితమయ్యింది కానీ ఆ తర్వాత ఈ కాంబో రిపీట్ కాలేదు. ఇప్పుడీ జైలర్ లో తిరిగి కనిపించనుండటంతో అంచనాలు ఇంకాస్త పెరుగుతున్నాయి. కానీ ఆవిడ పాత్ర తాలూకు తీరుతెన్నులు తదితర వివరాలు ఇంకా లీక్ కాలేదు.

ఇక అసలు అట్రాక్షన్ ఐశ్వర్య రాయ్. చాలా కాలం తర్వాత ఆవిడ రీ ఎంట్రీ ఇస్తున్నారు. రోబోలో రజినితో ఆల్రెడీ ఆడిపాడిన ఎక్స్ పీరియన్స్ తనకుంది. మళ్ళీ ఇన్నేళ్ల తర్వాత రిపీట్ కావడమంటే ఐష్ కూడా ఎగ్జైట్ అవుతున్నారు. అభిషేక్ బచ్చన్ తో పెళ్లి తర్వాత పూర్తిగా వైవాహిక జీవితానికి అంకితం కావడంతో పాటు పాపను చూసుకోవడం మీద దృష్టి పెట్టిన ఐశ్వర్య రాయ్ ఇకపై సబ్జెక్టు నచ్చితే సినిమాలు చేసేందుకు రెడీ అవుతోంది. అయితే జైలర్ లో రజనికి భార్యగా కనిపిస్తుందని టాక్. కోకోకోకిల, డాక్టర్ వరుస హిట్ల తర్వాత బబీస్ట్ రూపంలో షాక్ తిన్న దర్శకుడు నెల్సన్ దిలీప్ కుమార్ ఈసారి డార్క్ హ్యూమర్ జోలికి వెళ్ళడని చెన్నై టాక్.

Jojobet GirişjojobetJojobetjojobetjojobetJojobetZirvebetjojobetultrabetcasibomcasibomcasibomjojobetcasibom girişşanlıurfa konteynerbetciobetcioTipobetHoliganbetHoliganbetTipobetjojobetjojobet girişjojobet giriş