ఆ ఇద్దరికీ భలే లక్కీ ఛాన్స్

ఎదురు చూస్తున్న సుముహూర్తం వచ్చేసింది. తెలుగు రాష్ట్రాల్లో థియేటర్లు తెరుచుకోబోతున్నాయి. 30న తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ లో మూవీ లవర్స్ కోసం గేట్లు తెరుచుకోబోతున్నాయి. పెద్ద సినిమాలు లేకపోయినా అసలు జనం మూడ్ ఎలా ఉందో తెలుసుకోవడానికి కొత్త రిలీజులు ఉపయోగపడుతున్నాయి. అందులో ప్రధానంగా పబ్లిక్ దృష్టి ఉన్నవి రెండే. ఒకటి సత్యదేవ్ తిమ్మరుసు. రెండు తేజ సజ్జ ఇష్క్. కాకతాళీయంగా ఇవి రెండూ రీమేక్ కావడం గమనార్హం. ఏపిలో పూర్తి స్థాయిలో హాళ్లు తెరుచుకోవడం అనుమానంగానే ఉంది. నైజామ్ లోనూ అన్ని తెరవడం లేదు. కొన్ని ఇంకో వారం పది రోజులు అయ్యాక ఓపెన్ చేసే అవకాశాలు ఉన్నాయి.

ఇప్పుడు సత్యదేవ్, తేజ్ లకి ఇది అనుకోని అదృష్టంగానే చెప్పుకోవాలి. ప్రతి శుక్రవారం పోటీ మధ్య యుద్ధాలు చేయాల్సిన పరిస్థితుల్లో ఈసారి వీళ్లిద్దరు మాత్రమే బరిలో ఉండటం విశేషం. స్టార్ హీరోలకే ఒక్కోసారి దొరక్క ఇబ్బందులు పడే ఆర్టిసి క్రాస్ రోడ్స్ లోని సంధ్య దేవి లాంటి పెద్ద థియేటర్లు కూడా వీళ్ళకు దొరికాయంటే లక్కీ ఛాన్సేగా. ఓపెన్ చేయబోతున్న స్క్రీన్లలో 70 శాతం పైగా ఈ రెండు సినిమాలే వేయబోతున్నారు. టాక్ కనక ఏ మాత్రం పాజిటివ్ గా వచ్చినా చాలు నక్క తోక తొక్కినట్టే. మంచి కలెక్షన్లు వస్తాయి. ఎలాగూ మూడు నెలల ఎడబాటు కాబట్టి థియేటర్ ఎక్స్ పీరియన్స్ కోసం వచ్చే వాళ్ళు చాలా ఉంటారు.

ఇప్పుడీ పరిణామాలన్నీ అగ్ర నిర్మాతలు గమనించబోతున్నారు. తిమ్మరుసు, ఇష్క్ లతో పాటు నరసింహపురం, త్రయం, పరిగెత్తు పరిగెత్తు అనే మరో మూడు సినిమాలు ఉన్నాయి కానీ వీటికి కనీస బజ్ లేకపోవడంతో ఎక్కువ అద్భుతాలు ఆశించలేం. భారీ చిత్రాలన్నీ ఇంకా వెయిటింగ్ లోనే ఉండటం పట్ల డిస్ట్రిబ్యూటర్లు అసహనం వ్యక్తం చేస్తున్నారు. కనీసం ఆగస్ట్ 13కైనా ఏవైనా అనౌన్స్ మెంట్లు ఇస్తే ఎగ్జిబిటర్లకు ఉత్సాహం వస్తుందని చిన్న సినిమాలతో ఎక్కువ క్రౌడ్స్ ని ఆశించలేమని అంటున్నారు. ఏది ఎలా ఉన్నా అనుకోకుండా వచ్చిన ఈ లక్కీ ఛాన్స్ ని తిమ్మరుసు. ఇష్క్ లు ఎలా వాడుకుంటాయో చూడాలి

Also Read: ఆసక్తి రేపుతున్న వెబ్ మల్టీ స్టారర్

Show comments