iDreamPost
android-app
ios-app

Mirai Release date: తేజ సజ్జ బర్త్ డే.. మిరాయ్ రిలీజ్ డేట్ ఫిక్స్..

  • Published Aug 23, 2024 | 12:26 PM Updated Updated Aug 23, 2024 | 12:26 PM

మిరాయ్ మూవీ రిలీజ్ డేట్ ను ఫిక్స్ చేస్తూ.. తేజ సజ్జ బర్త్ డే సందర్భంగా ఓ పోస్టర్ ను రిలీజ్ చేశారు మేకర్స్. ఈ సినిమా ఎప్పుడు రాబోతోందంటే?

మిరాయ్ మూవీ రిలీజ్ డేట్ ను ఫిక్స్ చేస్తూ.. తేజ సజ్జ బర్త్ డే సందర్భంగా ఓ పోస్టర్ ను రిలీజ్ చేశారు మేకర్స్. ఈ సినిమా ఎప్పుడు రాబోతోందంటే?

  • Published Aug 23, 2024 | 12:26 PMUpdated Aug 23, 2024 | 12:26 PM
Mirai Release date: తేజ సజ్జ బర్త్ డే.. మిరాయ్ రిలీజ్ డేట్ ఫిక్స్..

తేజ సజ్జ.. హనుమాన్ మూవీతో పాన్ ఇండియా హీరోగా మారిపోయాడు. ఆ చిత్రం బ్లాక్ బస్టర్ విజయం సాధించడంతో.. అందరి చూపు అతడు నటించబోయే నెక్ట్స్ మూవీపై పడింది. ప్రస్తుతం తేజ డైరెక్టర్ కార్తీక్ ఘట్టమనేని తెరకెక్కించే యాక్షన్ అండ్ అడ్వెంచర్ మూవీ ‘మిరాయ్’లో నటిస్తున్నాడు. ఇప్పటికే విడుదలైన గ్లింప్స్ కు ఊహించని రెస్పాన్స్ వచ్చింది. ఇక ఈ మూవీ రిలీజ్ డేట్ ను ఫిక్స్ చేస్తూ.. తేజ సజ్జ బర్త్ డే సందర్భంగా ఓ పోస్టర్ ను రిలీజ్ చేశారు మేకర్స్.

తేజ సజ్జ-కార్తీక్ ఘట్టమనేని కాంబినేషన్ లో వస్తున్న సూపర్ హీరో మూవీ ‘మిరాయ్’. యాక్షన్ అండ్ అడ్వెంచరల్ మూవీగా తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని పీపుల్ మీడియా ఫ్యాక్టరీపై టీజీ విశ్వప్రసాద్ భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నాడు. పాన్ ఇండియా రేంజ్ లో రూపొందుతున్న ఈ మూవీలో విలన్ గా మంచు మనోజ్ నటిస్తున్నాడు. ఇప్పటికే విడుదలైన గ్లింప్స్ తో సినిమాపై భారీ అంచనాలను పెంచేశాడు డైరెక్టర్. ఇదిలా ఉండగా.. నేడు(ఆగస్ట్ 23) తేజ సజ్జ బర్త్ డే సందర్భంగా ఓ పోస్టర్ ను రిలీజ్ చేశారు మేకర్స్. అందులో రిలీజ్ డేట్ ను కూడా రివీల్ చేశారు. 2025 ఏప్రిల్ 18న 8 భాషల్లో 2డి, 3డిలో మిరాయ్ రాబోతోంది.

ఇక తాజాగా రిలీజ్ చేసిన కొత్త పోస్టర్ సినిమాపై అంచనాలను ఇంకాస్త పెంచేసింది. ఇక విజువల్ వండర్ గా రానున్న ఈ మూవీలో యాక్షన్ సన్నివేశాలు ప్రేక్షకులను ఓ కొత్త లోకంలోకి తీసుకెళ్తాయని మేకర్స్ చెబుతున్నారు. అయితే మిరాయ్ వచ్చే సమయానికి పెద్ద సినిమాలే విడుదల కానున్నాయి. ఏప్రిల్ 10న ప్రభాస్ ది రాజాసాబ్ తో రానున్నాడు. దీంతో పాటుగా కొన్ని రోజుల గ్యాప్ లోనే ఇతర స్టార్ల సినిమాలు కూడా రిలీజ్ కాబోతున్నాయి. దాంతో ఇంత పోటీలో తేజ సజ్జ తట్టుకుని నిలుస్తాడా? అన్నది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.

Jojobet GirişJojobetHoliganbetHoliganbetHoliganbetJojobetholiganbetjojobetgrandpashabetbetparkcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetgrandpashabetbetwoon girişEscortes BelgiqueGrandpashabetCasibomGrandpashabet GirişgrandpashabetJOJOBET GİRİŞLERİ