iDreamPost
iDreamPost
నా కంఠంలో ప్రాణం ఉన్నంత వరకు తెలంగాణని ఆగం కానివ్వను. రాష్ట్రాన్ని కాపాడేందుకు సర్వశక్తులను ధారపోస్తా. నా బలగం ప్రజలే. మీ అండదండలున్నంత వరకు, తనకేం కాదని సీఎం కేసీఆర్ అన్నారు. రంగారెడ్డి జిల్లా కలెక్టరేట్‌ను ప్రారంభించిన అనంతరం కేసీఆర్ బీజేపీనుద్దేశించి మాట్లాడారు. ప్రధానిపై నిప్పులు చెరిగారు.
మౌనంగా భరిద్ధామా? పిడికిలి బిగిద్దామా? మౌనంగా ఉంటే మతచిచ్చు పెట్టే మంటలు వస్తాయి. తమిళనాడు, బెంగాల్, ఢిల్లీలో ప్రభుత్వాలను కూలగొట్టేందుకు ప్రయత్నిస్తున్నాయి. మనం నిద్రపోతే పెద్ద ప్రమాదానికి లోనవుతాం. హైదరాబాద్ 24 గంటల కరెంట్ ఉంటే, ఢిల్లీలో ఉండదు. ప్రధాని కంటే పెద్ద పదవి ఉందా? ప్రధాని కుట్రలు చేసి రాష్ట్రాల్లో ప్రభుత్వాలను పడగొడుతున్నారు. నేను బతికుండగా తెలంగాణను ఆగం కానివ్వనని అన్నారు.
ఇటీవల రెచ్చగొట్టే మతపరమైన వ్యాఖ్యలను ప్రస్తావించిన సీఏం కేసీఆర్, రాష్ట్రం ఏర్పడాలంటే చాలా ఏళ్లు పడుతుంది. ప్రాజెక్టు కట్టాలంటే చాలా టైం పడుతుంది. మూఢనమ్మకాలు, పిచ్చితో, ఉన్మాదంతో వాటన్నింటిని రెండు మూడు రోజుల్లో కూలగొట్టొచ్చు. ఎంత కష్టమైతది. శిథిలమైపోతదని అన్నారు. తెలంగాణ ఉద్యమాన్ని ప్రస్తావిస్తూ, 58 ఏండ్లు తెలంగాణ కోసం కొట్లాడం. తెలంగాణ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కోరారు. ఇటీవల బెంగళూరు సిటీలో పెరుగుతున్న మతపరమైన ఉద్రక్తితల గురించి చెప్పారు. బెంగళూరు సిటీ సిలికాన్ వ్యాలీ ఆఫ్ ఇండియాగా పేరొందింది. అక్కడి ప్రభుత్వాలు చాలా కష్టపడి ఒక వాతావరణాన్ని నిర్మాణం చేశారు. 30 లక్షల మందికి ఐటీలో ప్రత్యక్షంగా ఉద్యోగాలు దొరకుతున్నాయి. ఈయేడాది మన కంటే తక్కువ ఉద్యోగాల కల్పన జరిగింది. తెలంగాణ ఒక లక్షా 55 వేల ఉద్యోగాలు ఇస్తే, బెంగళూరులో ఈ ఏడాది ఏడెనిమిది వేల ఉద్యోగాలు తగ్గిపోయాయి. అక్కడ వాతావరణాన్ని కలుషితం చేశారు. అలాంటి వాతావరణం తెలంగాణలో, హైదరాబాద్‌లో రావాలా? ఆలోచించాల్సిన అవసరం ఉందని కేసీఆర్ అన్నారు.