iDreamPost
iDreamPost
పచ్చ మీడియా మరో సారి వైఎస్సార్ సిపి మీద ముఖ్యమంత్రి జగన్ పై విషం చిమ్మింది.మళ్ళీ ఫోటోల రాజకీయానికి తెర తీసింది.కర్నూలు జిల్లా ఆత్మకూరు లో వర్ధన్ కో – ఆపరేటివ్ బ్యాంకు ను ప్రారంభించి 50 శాతం సబ్సిడీతో ఋణాలంటూ ప్రజల నెత్తిన కుచ్చు టోపి పెట్టిన జాషువా అలియాస్ మహేష్ అరెస్ట్ నేపథ్యంలో ఈ విష ప్రచారానికి ఆంధ్రజ్యోతి తెర తీసింది.సంవత్సర కాలంగా పోలీసులను తప్పించుకు తిరుగుతున్న మహేష్ ను ఎట్టకేలకు అరెస్ట్ చేస్తే ఎపుడో fir అయిన ఈ కేసును ఇపుడు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి ముడి పెట్టే యత్నం ఆ కథనంలో కనిపించింది.
అసలేం జరిగింది:
మహేష్ అలియాస్ జాషువా గుంటూరు జిల్లా తాడేపల్లికి చెందినవాడు.ఇతనిపై గతంలోనే పలు ఆర్థిక నేరాలకు సంభందించిన కేసులు ఉన్నాయి.శ్రీశైలం నియోజక వర్గానికి చెందిన బాలన్న అనే వైసిపి ఎస్సి నాయకుడు కుల సంఘాల సమావేశాల్లో పాల్గొనేందుకు తరుచుగా అమరావతి వెళ్ళేవాడు.అక్కడ జాషువాతో ఈయనకు పరిచయం అయ్యింది.తాడేపల్లిలో జాషువా ప్రారంభించిన వర్ధన్ బ్యాంకులో 50 శాతం సబ్సిడీతో ఋణాలిప్పిస్తానని బాలన్నను ఒప్పించిన జాషువా తనబ్యాంకులో 3 లక్షలు డిపాజిట్ చేయించి రుణం మంజూరు చేయించాడు.దీనితో జాషువాను నమ్మిన బాలన్న వర్ధన్ బ్యాంకు శాఖను ఆత్మకూరులో ప్రారంభించాలని కోరాడు.అప్పటికే బాలన్న నంద్యాల జిల్లా వైఎస్ ఆర్ సిపి ఎస్సి సెల్ అధ్యక్షుడయ్యారు.2020 సెప్టెంబర్ లో జాషువా ఆత్మకూరులో వర్ధన్ బ్యాంక్ శాఖను ప్రారంభించారు.అదే శాఖలో బాలన్న కుమార్తె హేమలతకు మేనేజర్ ఉద్యోగం కూడా ఇచ్చారు. ఈ బ్యాంకు ప్రారంభోత్సవానికి స్థానిక ఎమ్మెల్యే శిల్పా చక్రపాణి రెడ్డిని కూడా ఆహ్వానించారు.బ్యాంకు ప్రారంభోత్సవంలో ప్రయివేట్ బ్యాంకులపై తనకున్న అనుమానాలను కూడా వ్యక్తపరిచారు కూడా.
ఆయన అనుమానించినట్లే ఆత్మకూరు వర్ధన్ బ్యాంక్ ను 7 నెలల్లోనే మూసివేశారు.అప్పటికే సుమారు 20 కోట్ల వరకు ప్రజల నుంచి డిపాజిట్ ల రూపంలో దండుకున్నారు.కొందరు బాధితులు అప్పటి కర్నూలు ఎస్పీ ఫకీరప్పకు ఫిర్యాదు చేశారు.ఈ ఫిర్యాదు వెనుక ఎమ్మెల్యే చక్రపాణిరెడ్డి చొరవ కూడా ఉంది.ఆ నాటినుంచి జాషువా పోలీసుల కళ్లుగప్పి తిరుగుతున్నాడు.ఎట్టకేలకు పోలీసులు మూడు రోజుల కిందట జాషువా అలియాస్ మహేష్ ను అదుపులోకి తీసుకున్నారు.నిందితున్ని విచారిస్తున్న పోలీసులు ఈ అరెస్ట్ ను ధృవీకరించలేదు.ఈ వ్యవహారం రెండేళ్లుగా జరుగుతున్నా బాధితులకు అండగా నిలవని టీడీపీ కానీ ఎన్నడూ ఒక వార్త రాయని పచ్చ మీడియా హఠాత్తుగా దీన్ని సీఎం జగన్ కు ఎమ్మెల్యేలకు చుట్టే యత్నం మొదలెట్టారు. వైఎస్సార్ సిపి నంద్యాల ఎస్సి విభాగం అధ్యక్షుడు బాలన్న తోపాటు ఎమ్మెల్యే మేరుగ నాగార్జున,మాదిగ కార్పొరేషన్ చైర్మన్ కనకయ్య మాదిగ లతో జాషువా కలసి ఉన్న ఫోటోలను,108 అంబులెన్స్ ల కోసం జాషువా ముఖ్యమంత్రికి రూ.10 లక్షలు విరాళంగా ఇచ్చిన సందర్భంలోని ఫోటోలను పెట్టి విషప్రచారం వంటను పాఠకులకు వండివార్చారు.
ప్రణాళకలో భాగంగా నే సోమవారం వార్తా కథనం రాగానే టిడిపి నాయకులు జిల్లా కేంద్రంలో ప్రెస్ మీట్ పెట్టి దీని వెనుక స్థానిక ఎమ్మెల్యే నుంచి ముఖ్యమంత్రి వరకు సంబంధం ఉందని నిరాధార ఆరోపణలు చేశారు.వర్ధన్ బ్యాంకు ఫ్రాడ్ వ్యవహారంలో తాను భాధితున్నని తనను నమ్మి ఎందరో దళితులు కోట్లరూపాయలు డిపాజిట్ చేశారని విలేఖరుల సమావేశంలో ఎమ్మెల్యే శిల్పా చక్రపాణిరెడ్డి వాపోయారు. ఈ విషయంపై తానే బాధితులతో పోలీసులకు ఫిర్యాదు చేయించినట్లు ఎమ్మెల్యే తెలిపారు.ఏదిఏమైనా ఘనంగా ఆహ్వానిస్తే చాలు ముందు వెనక చూడకుండా ప్రారంభోత్సవాలకు హాజరయ్యే నాయకులకు ఈ సంఘటన కనువిప్పులా ఉందని ప్రజలు చర్చించుకుంటున్నారు.