iDreamPost
android-app
ios-app

అసెంబ్లీ నుండి తెలుగుదేశం వాకౌట్

అసెంబ్లీ నుండి తెలుగుదేశం వాకౌట్

రెండు రోజుల విరామం తర్వాత ఈరోజు ఉదయం ప్రారంభమైన శాసన సభ ప్రశ్నోత్తరాల సమయంలో, తెలుగుదేశం పాలకొల్లు శాసనసభ్యులు నిమ్మల రామానాయుడుగారు పాలకొల్లు పట్టణంలో నిర్మాణంలో టిట్కోహౌసింగ్ స్కీంపై ప్రశ్న లేవనెత్తగా, దీనిపై స్పందించిన మునిసిపల్ శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ సమాధానమిస్తున్న తరుణంలో ఇరువురి మధ్య రివర్స్ టెండరింగ్, గత ప్రభుత్వం L &T కంపెనీకి ఎక్సెస్ టెండర్ ఇచ్చిందని వాడివేడి చర్చ జరుగుతుండగా, మధ్యలో అచ్చంనాయుడు కల్పించుకొని రాజకీయ విమర్శలు చేయడంతో సభలో వాతావరణం ఒక్కసారిగా వేడెక్కింది.

ఒక దశలో బొత్స సత్యనారాయణ గత ప్రభుత్వంలో జరిగిన హౌసింగ్ అక్రమాలు మీద చర్చకు సిద్ధమని అందులో వారు చెవుతున్నట్టు సౌకర్యాలు చూపిస్తే తాను సభలోనే రాజీనామా చేస్తానని సవాల్ విసరడంతో వెంటనే తెలుగుదేశం సభ్యులు మాకు కూడా మాట్లాడే అవకాశం ఇవ్వాలని స్పీకర్ ని కోరారు. దానికి సభాపతి అవకాశం ఇవ్వకుండా ఇప్పటికే ఒక్క ప్రశ్నమీద 42 నిమిషాల చర్చ జరిగిందని ఈరోజు ఇంకా 14 బిల్లులు ఉన్నాయని, ఇక సమయం ఇవ్వడం కుదరదని వేరే ప్రశ్నలకి వెళ్లడంతో ఆగ్రహించిన టిడిపి ప్రభుత్వ తీరుకు నిరసనగా సభ నుండి వాకౌట్ చేసింది.