Idream media
Idream media
పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో గట్టిగా పోరాడతామన్న ఆ గొంతు లెక్క? ఏపీ ప్రత్యేక హోదా కోసం, స్టీల్ ప్లాంట్ కోసం రాజీనామాలు కూడా చేసేస్తాం అన్న ఎంపీలు ఎక్కడ? రాష్ట్ర ప్రయోజనాల కోసం వైసీపీ నాయకత్వంలో కూడా పని చేస్తామని ప్రగల్బాలు పలికిన నాయకులు ఎక్కడ? పార్లమెంట్ సమావేశాలను పరిశీలిస్తే ఇవే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. రాష్ట్రం కోసం వైసీపీ నాయకత్వంలో కూడా పనిచేయడానికి సద్దమని ప్రకటించిన టీడీపీ ఎంపీల గొంతు పెద్దగా వినిపించడం లేదు. విభజన హామీలు, రాష్ట్ర సమస్యలపై వైసీపీ ఎంపీలు పోరాడుతుంటే, వారికి టీడీపీ ఎంపీలు మద్దతు ఇచ్చినట్లుగా ఇప్పటి వరకూ ఎక్కడా కనిపించ లేదు.
పార్లమెంటు సమావేశాలకు ముందు చంద్రబాబునాయుడు ఆధ్వర్యంలో ఎంపీల భేటీ జరిగింది. ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేకహోదా, విశాఖపట్నం ఉక్కు ఫ్యాక్టరీ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా వైసీపీ ఎంపిలు ఉద్యమించాలని టీడీపీ డిమాండ్ చేసింది. ఆందోళనలకు వైసీపీ ఎంపిలు నాయకత్వం వహిస్తే తాము కూడా మద్దతిస్తామని ఎంపిల తరపున శ్రీకాకుళం ఎంపి కింజరాపు రామ్మోహన్ నాయుడు మీడియాతో చెప్పారు. వారు చెప్పినట్లుగానే వైసీపీ ఎంపీలు పార్లమెంటులో ఉద్యమిస్తున్నారు. కానీ, టీడీపీలు మద్దతు ఇవ్వడం లేదు. అంతేకాకుండా, రాష్ట్ర ప్రయోజనాల కోసం వైసీపీ ఎంపిలు రాజీనామాలు చేస్తే తాము కూడా రాజీనామాలు చేయటానికి రెడీగా ఉన్నామనే బంపర్ ఆఫర్ ఇచ్చారు. రాష్ట్రప్రయోజనాల కోసం రాజీనామాలు చేయాలని టీడీపీ ఎంపిలు అనుకుంటే అందుకు వైసీపీ ఎంపిల రాజీనామాలతో లింకు ఏంటి అన్నదే ప్రశ్న.
ప్రత్యేకహోదా విషయంలో అప్పట్లో వైసీపీ ఎంపీలు రాజీనామాలు చేసిన విషయం అందరికీ గుర్తుండే ఉంటుంది. కాబట్టి ఇపుడు టీడీపీ ఎంపిలు కూడా రాజీనామాలు చేసేయచ్చు. సరే ఈ విషయాన్ని పక్కనపెట్టేస్తే కనీసం ఆందోళనల్లో కూడా ఎక్కడా కనబడటంలేదు. పార్లమెంటు సమావేశాలు మొదలైన దగ్గర నుండి వరుసగా రెండు రోజుల పాటు సభా సమావేశాలను స్తంబింపచేస్తున్న విషయం అందరు చూస్తున్నదే. ఇటు రాజ్యసభ అటు లోక్ సభలో వైసీపీ ఎంపిలు ఇంత రచ్చ రచ్చ చేస్తుంటే మరి టీడీపీ ఎంపిలు ఏమి చేస్తున్నట్లు ? ఆందోళనలకు నేతృత్వం వహించాలని వైసీపీ ఎంపిలను డిమాండ్ చేసిన టీడీపీ ఎంపిలు ఏమయ్యారో తెలీటంలేదు. మూడు రోజుల్లో ఎప్పుడు కూడా సభల్లో కనబడకపోవటంతో అసలు టీడీపీ ఎంపిలు పార్లమెంటుకు హాజరవుతున్నారా ? అనే సందేహాలు పెరిగిపోతున్నాయి.
బహుశా వైసీపీ ఎంపీలు ఎలాగూ కేంద్రానికి వ్యతిరేకంగా సభల్లో ఏమీ చేయరన్న ధీమాతోనే టీడీపీ ఎంపి రెచ్చగొట్టినట్లున్నారు. అయితే ఊహించనిరీతిలో వైసీపీ ఎంపిలు ఆందోళనలు మొదలుపెట్టేసరికి టీడీపీ ఎంపిలు అడ్రస్ లేకుండా పోయారు. లేదా బీజేపీకి దగ్గర అవుదామని తమ అధినాయకుడు చేస్తున్న ప్రయత్నాలకు ఎక్కడైతే నష్టం కలుగుతుందో అని మాట్లాడడం లేదో వారికే తెలియాలి.