Idream media
Idream media
స్లోగన్లు ఇవ్వడంలో రాజకీయ పార్టీల నేతల తర్వాతే ఎవరైనా. అదీ కూడా రైమింగ్‌తో కూడిన స్లోగన్లలో వారిదే పై చేయి. అయితే రాజకీయ పార్టీల నేతలు స్లోగన్లు ఇచ్చే ముందు బాగా ఆలోచించాల్సి ఉంటుంది. లేదంటే సెల్ఫ్ గోల్ పడే అవకాశం ఉంది. ఇప్పుడు ఇలాంటి సెల్ఫ్ గోల్‌ను టీడీపీ శాసన సభాపక్ష ఉపనేత, పాలకొల్లు ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు వేసుకున్నారు.
తెలుగుదేశం పార్టీ ప్రభుత్వ హయాంలో అందరికీ ఇళ్లు పేరిట కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం వాటాతోపాటు లబ్ధిదారులు వాటా. బ్యాంకు రుణంతో పట్టణాలల్లో పేదలకు ఇళ్లు నిర్మించే కార్యక్రమం చేపట్టారు. అపార్ట్‌మెంట్ తరహాలో ఈ ఇళ్లు నిర్మించారు. అయితే ప్రభుత్వ భూమి, ఇసుక, రాయితీ సిమెంట్ ఇస్తున్నా.. చదరపు అడుగు నిర్మాణానికి చంద్రబాబు ప్రభుత్వం కాంట్రాక్టర్‌కు 2,200 రూపాయలు చెల్లించాలని నిర్ణయించింది. అయితే బహిరంగ మార్కెట్‌లో బిల్డర్లు చదరపు అడుగు వెయి రూపాయలకే నిర్మించి ఇస్తున్నారు. వాస్తవ ధరకు రెట్టింపు చెల్లించాలని నిర్ణయించిన నాటి చంద్రబాబు ప్రభుత్వంలో భారీ స్కాం జరిగినట్లు ఆరోపణలు వచ్చాయి. ఫలితంగా ఇళ్ల లబ్ధిదారులపై భారీగా బారం పడింది.
కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు 1.50 లక్షల చొప్పన ఇళ్ల నిర్మాణ పధకానికి కేటాయించాయి. ఇంటిని బట్టి లబ్ధిదారుల వాటాగా 500, 50 వేలు, లక్ష రూపాలయ చొప్పన మూడు కేటగిరిలు నిర్ణయించారు. ఇది కాకుండా ప్రతి ఇంటికి మూడు లక్షల రూపాయల బ్యాంకు లోను ప్రభుత్వం ఇప్పిస్తోంది. ఈ మూడు లక్షల రూపాయలు నెల వారీ వాయిదాల రూపంలో 20 ఏళ్లపాటు కట్టాలని పథకంలో పేర్కొన్నారు. వెయి రూపాయల ఖర్చు అయ్యే చదరపు గజం నిర్మానానికి చంద్రబాబు ప్రభుత్వం రెట్టింపు ధర కాంట్రాక్టర్‌కు కట్టబెట్టాలని చూడడంతో పేదలపై ఆ భారం పడింది. అందరికీ ఇళ్లు పథకంలో భారీ స్కాం జరిగినట్లు గణాంకాలు ద్వారా అర్థం అవడంతో దీనిపై విచారణ చేయాలని జగన్ సర్కార్ నిర్ణయించింది. ఇప్పటికే మిగిలి ఉన్న ఇళ్ల నిర్మాణాకు రివర్స్ టెండర్ నిర్వహించింది. ఫలితంగా నిర్మాణ ధర తగ్గింది.
ఎన్నికల సమయంలోనే సీఎం జగన్.. ఈ ఇళ్ల ధరలు, పథకం అమలుపై విమర్శలు చేశారు. మార్కెట్‌ధర కన్నా ఎక్కువ చెల్లిస్తూ, ఆ మొత్తం పెద్దలు ముడుపులు తీసుకుంటున్నారని, లబ్ధిదారులపై ఆ భారం మోపుతున్నారని గణాంకసహితంగా వివరించారు. సొంత ఇళ్లు కాకుండా.. అద్దె ఇంట్లో ఉన్నట్లుగానే లబ్ధిదారులు ప్రతి నెలా బ్యాంకులకు వాయిదాలు చెల్లించాల్సి వస్తుందని వివరించారు. తాము అధికారంలోకి వస్తే బ్యాంకు రుణం మూడు లక్షల రూపాయలు మాఫీ చేస్తామని ప్రకటించారు. ఈ పథకంలో జరిగిన అక్రమాలను తేల్చిన తర్వాత లబ్ధిదారులకు ఇళ్లు పంపిణీ చేయాలని జగన్ సర్కార్ యోచిస్తోంది.
అయితే ప్రభుత్వంపై విమర్శలు చేసేందుకు ఏ అంశం లభించన టీడీపీ నేతలు ఈ ఇళ్లను తమ రాజకీయ కార్యక్రమాల కోసం ఉపయోగించుకుంటున్నారు. ఈ క్రమంలోనే పాలకొల్లు ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు.. తన పార్టీ కార్యకర్తలతో కలసి స్థానికంగా ఆందోళన నిర్వహించారు. ఇందులో.. ‘‘ నా ఇళ్లు నా సొంతం’’, ఇళ్లు స్వాధీనం చేయండి లేదా పేద వాడి ఇంటి అద్దె చెల్లించండి’’ అంటూ నినాదాలు చేశారు. నా ఇళ్లు నా సాంతం అనే నినాదం బాగున్నా.. టీడీపీ అమలు చేసిన ఇందరికీ ఇళ్లు పథకంలో 20 ఏళ్లపాటు లబ్ధిదారులు బ్యాంకులకు వాయిదాలు కట్టాలన్న విషయాన్ని రామానాయుడు మరిచిపోయినట్లుగా ఉన్నారు. అది సొంత ఇళ్లు కాదు.. అద్దె ఇళ్లు అని వైసీపీ శ్రేణులు ఎద్దేవా చేస్తున్నాయి. అందుకే ప్రారంభంలో చెప్పినట్లు స్లోగన్లు ఇచ్చేటప్పుడు రాజకీయ నేతలు ఆలోచించాలి. లేదంటే సెల్ఫ్ గోల్ తప్పదు.