పారిపోయిన టీడీపీ…

  • Published - 05:30 AM, Mon - 27 January 20
పారిపోయిన టీడీపీ…

కర్ర ఉన్నోడిదే గొఱ్ఱె అన్న సామెతను నిజం చేస్తూ నిర్ణయాధికారం లేని మండలి ద్వారా రాజధాని వికేంద్రీకరణ మీద ప్రభుత్వం పెట్టిన బిల్లు మీద పట్టుబట్టి సెలెక్ట్ కమిటీ కి పంపించేలా చేసినన టీడీపీ ఈ విషయం మీద శాసనసభలో జరిగే చర్చలో పాల్గొనకుండా సభకు హాజరుకామని ప్రకటించింది.

Read Also: జగన్‌ రద్దు చేస్తే.. చంద్రబాబు పెడతారట..

శాసనమండలి చైర్మన్ బిల్లును సెలెక్ట్ కమిటీకి పంపి నిరవధిక వాయిదావేసిన చైర్మన్ షరీఫ్ మండలిలో తుదపరి చర్చలేకుండా చేశాడు . మండలి నిర్ణయం మీద శాసనసభలో చర్చ జరపటం రాజ్యాంగ విరుద్ధం అని టీడీపీ వింత వాదన మొదలుపెట్టింది. రాజ్యాంగంలో మండలి నిర్ణయాధికార వ్యవస్థకాదని,మండలి ఒకసారి బిల్లును తిరస్కరించినా అదే బిల్లును రెండవసారి ప్రవేశ పెట్టె అధికారం ప్రభుత్వానికి ఉంది కానీ రెండవసారి తిరష్కరించే హక్కు మండలికి లేదు ఆనం విషయం అందరికి తెలిసిందే.

Read Also: మండ‌లికి మంగ‌ళం.. 13 ఏళ్లకే ముగిసిన ప్రయాణం

పెద్దలసభ అంటూ పెద్దల సభ నిర్ణయం మీది దిగువ సభ అంటే శాసనసభలో చర్చ చేయకూడదని టీడీపీ వాదించటం చూస్తుంటే ఇవి చట్టసభల అంశామా లేక వారి పార్టీ తీర్మానాల మీద చర్చనా అని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

Show comments