P Krishna
తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు దగ్గర పడుతున్న సమయంలో అధికార, ప్రతిపక్ష నేతలు ప్రచారాలు ముమ్మరం చేస్తున్నారు.
తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు దగ్గర పడుతున్న సమయంలో అధికార, ప్రతిపక్ష నేతలు ప్రచారాలు ముమ్మరం చేస్తున్నారు.
P Krishna
తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల సమీపిస్తున్నా కొద్ది రాజకీయ సమీకరణాలు మారిపోతూ వస్తున్నాయి. పార్టీకి ఎంతో కాలం సేవ చేసినప్పటికీ సరైన గుర్తింపు లేదని అసంతృప్తి నేతలు వేరే పార్టీలోకి జంప్ అవుతున్నారు. ఎన్నికల షెడ్యూల్ తేదీ వెలువడినప్పటి నుంచి ఇదే తంతు కొనసాగుతుంది. తెలంగాణలో ప్రస్తుతం పోటీలో ప్రధాన పార్టీలు బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ ఉండగా.. టీడీపీ సైతం పోటీ చేసేందుకు సిద్దమైతున్నట్లు నిన్నటి వరకు వార్తలు వచ్చాయి. తాజాగా తెలంగాణలో పోటీపై టీడీపీ అధ్యక్షులు కీలక వ్యాఖ్యలు చేశారు. వివరాల్లోకి వెళితే..
తెలంగాణలో జరగబోతున్న ఎన్నికల్లో ప్రధాన పార్టీ నేతలు ప్రచారాల్లో మునిగిపోయారు. బీఆర్ఎస్ నుంచి స్వయంగా సీఎం కేసీఆర్ రంగంలోకి దిగారు. ఇక ప్రతిపక్షాల తరుపు నుంచి రాష్ట్ర నేతలతో పాటు జాతీయ నేతలు రంగంలోకి దిగి ప్రచారం చేస్తున్నారు. ఇక ఉమ్మడి తెలంగాణలో ప్రధాన పార్టీగా కొనసాగిన టీడీపీ ప్రత్యేక రాష్ట్రం వచ్చిన తర్వాత ఊపు తగ్గింది. టీడీపీ ముఖ్యనేతలు అధికార పార్టీలో చేరారు. ప్రస్తుతం తెలంగాణ అధ్యక్షులుగా కాసాని జ్ఞానేశ్వర్ కొనసాగుతున్నారు. నిన్నటి వరకు 89 నియోజకవర్గాల నుంచి పోటీ చేస్తామని చెబుతూ వచ్చారు. తాజాగా టీడీపీ పోటీపై సంచలన వ్యాఖ్యలు చేశారు కాసాని.
స్కిల్ డెవలప్ మెంట్ కేసులో చంద్రబాబు అరెస్టై రాజమండ్రి సెంట్రల్ జైల్ లో ఉనన విషయం తెలిసిందే. ఈ పరిస్థితుల్లో తెలంగాణ ఎన్నికలపై సరైన ఫోకస్ చేయలేమని టీడీపీ అధినేత చంద్రబాబు అభిప్రాయపడ్డట్టు తెలుస్తుంది. ఈ క్రమంలోనే శనివారం కాసానితో ములాఖత్ అయిన చంబ్రాబు ప్రస్తుతం పోటీ చేయకపోవడమే మంచిదని నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది. తెలంగాణలో టీడీపీ బలం బాగానే ఉందని కాసాని అభిప్రాయం వ్యక్తం చేసినప్పటికీ.. ఒకవేళ ఆశించిన ఫలితాలు రాకుంటే మళ్లీ భంగపాడాల్సి వస్తుందని చంద్రబాబు అన్నట్లు తెలుస్తుంది. ఈ క్రమంలో కాసాని జ్ఞానేశ్వర్ మాట్లాడుతూ.. తెలంగాణలో టీడీపీ పోటీ చేయడానికి సిద్దమైనప్పటి.. ప్రస్తుత పరిస్థితులు అనుకూలంగా లేకపోవడంతో పోటీ నుంచి తప్పుకుంటున్నామని న్నారు.