iDreamPost
android-app
ios-app

TDP CBN Pattabhi-అస‌లుకే ఎస‌రు.. జ‌ర జాగ్ర‌త్త బాబోరూ..!

TDP CBN Pattabhi-అస‌లుకే ఎస‌రు.. జ‌ర జాగ్ర‌త్త బాబోరూ..!

అనుకున్న‌దొక‌టి.. జ‌రుగుతున్న‌దొక‌టి.. అన్న చందంగా మారింది తెలుగుదేశం పార్టీ ప‌రిస్థితి. టీడీపీ అధికార  ప్ర‌తినిధి ప‌ట్టాభి రామ్ నోటి దురుసు తెచ్చిన తంటాల నుంచి బ‌య‌ట‌ప‌డేందుకు అధినేత చంద్ర‌బాబు ర‌క్తి క‌ట్టిస్తున్న రాజ‌కీయాల‌పై పార్టీ సీనియ‌ర్లు ఆందోళ‌న చెందుతున్న‌ట్లు తెలుస్తోంది. చంద్రబాబు ఎందుకు పట్టాభి ప్రభావంలో పడుతున్నారు… లేక చంద్రబాబే పట్టాభితో ఇలా మాట్లాడించారా? ఇలా అనేక అనుమానాలు తెలుగు తమ్ముళ్లను వెంటాడుతున్నాయి. పట్టాభి ఇంటిపై ,పార్టీ కార్యాలయాలపై జరిగిన దాడులను ప్రచారాస్త్రంగా చేసుకోవాలని టీడీపీ అధినేత చంద్రబాబు వ్యూహాలు రచిస్తున్నారు. అయితే ఈ వ్యూహాలు అసలుకే మోసం చేస్తున్నాయని ఆ పార్టీ సీనియర్లు హెచ్చరిస్తున్నారు.

ఇప్ప‌టికే పట్టాభి వ్యాఖ్య‌ల వ‌ల్ల ప్ర‌శాంతంగా ఉన్న రాష్ట్రాన్ని అగ్నిగుండంగా మార్చారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. రాజ్యాంగ పదవుల్లో ఉన్న వ్యక్తులపై పరుష పదజాలంతో దూషించడం తగదని హితవు పలుకుతున్నారు. సీఎం జగన్ ను ఉద్దేశించి పట్టాభి చేసిన వ్యాఖ్యలను టీడీపీలోని పలువురు సీనియర్లు కూడా తప్పుబడుతున్నారు. పట్టాభిని చంద్రబాబు వెనుకేసుకుని రావడంపై అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. పట్టాభి వ్యాఖ్యలపై టీడీపీలో అంతర్గతంగా భిన్న వాదనలు వినిపిస్తున్నాయి. ప్రజల్లో పనిచేయకుండా కేవలం మీడియాకే పరిమితమైన నేతల వ్యవహారశైలి ఇలాగే ఉంటుందనే చర్చ ఆ పార్టీలో ప్రారంభమైంది. ప్రజల నాడి తెలుసుకోకుండా ఇష్టానుసారంగా మాట్లాడితే పార్టీకే నష్టమనే అభిప్రాయాలు టీడీపీలో బలంగా వినిపిస్తున్నాయి. పైగా ఇలాంటి నేతలను చంద్రబాబు సమర్దించడం మంచిదికాదని పలువురు సూచిస్తున్నారు.

ఆందోళ‌న‌ల‌తో అల‌జ‌డులు, రెచ్చగొట్టే వ్యాఖ్యల వల్ల పార్టీకి నష్టమేనని హెచ్చరిస్తున్నారు. ఇలాంటి ఘటనల వల్ల ఎలాంటి ఉపయోగం ఉండదని పార్టీ పరువు పోతుందని చెబుతున్నారు. రెచ్చగొట్టే మార్గాల వల్ల ప్రజలకు చేరువ కాలేమని ప్రభుత్వ వైఫల్యాలను ప్రజలలోకిి తీసుకెళ్లినప్పుడు మాత్రమే మనం అనుకున్న లక్ష్యాన్ని అందుకోగలమని వ్యాఖ్యానిస్తున్నారు. వ్యక్తిగత దూషణలు చేయడం వల్ల ప్రజల్లో పార్టీ పట్ల సానుకూలత రాదని చెబుతున్నారు. ఇలాంటి ఘటన వల్ల మీడియాలో ప్రచారమే తప్ప.. అంతిమంగా పార్టీకి ఇబ్బందేనని హెచ్చరిస్తున్నారు. పార్టీ నేతల వ్యాఖ్యలను వ్యవహారశైలిని ప్రజలు ఎప్పటికప్పుడు గమనిస్తూ ఉంటారని చెబుతున్నారు. ప్రజల్లో వ్యతిరేకత రానంత వరకు ఎలాంటి ఇబ్బందులు ఉండవని ఒక్కసారి ప్రజల్లో వ్యతిరేకత వస్తే ఆ నష్టాన్ని పూడ్చుకోవడం కష్టమేనని టీడీపీ నేతలు హెచ్చరిస్తున్నారు.

టీడీపీ కార్యాలయాలపై జరిగిన దాడులకు నిరసనగా చంద్రబాబు రాష్ట్ర బంద్ కు పిలుపు ఇచ్చినా పెద్ద‌గా స్పంద‌న లేక‌పోవ‌డాన్ని గుర్తించి అయినా జాగ్ర‌త్తప‌డాల‌ని పార్టీలోని కొంద‌రు సీనియ‌ర్లు చంద్ర‌బాబుకు సూచించిన‌ట్లు తెలుస్తోంది. చంద్రబాబు బంద్ ద్వారా కార్యకర్తల్లో ఉత్తేజాన్ని నింపాలని చూశారని అందుకు భిన్నంగా ఫలితాలు వచ్చాయనే చర్చ టీడీపీలో అంతర్గతంగా సాగుతోంది. ఇవ‌న్నీ ప‌రిశీలిస్తే పార్టీ తీసుకుంటున్న నిర్ణ‌యాలు, చేస్తున్న ఆందోళ‌న‌ల‌తో ప్ర‌జ‌ల మ‌ద్ద‌తు పెర‌గ‌క‌పోగా, అస‌లుకే ఎస‌రు వ‌చ్చేలా క‌నిపిస్తోంద‌న్న వాద‌న‌లు వినిపిస్తున్నాయి.

Also Read : YS Jagan – ఇన్నాళ్ళూ ఒక లెక్క.. ఇకపై మరో లెక్క