Idream media
Idream media
గుంటూరు జిల్లా మాచర్ల ఎమ్మెల్యే, ప్రభుత్వ చీఫ్ విప్ పిన్నెల్లి రామకృష్ణారెడ్డిపై అమరావతి ఉద్యమకారులు, టీడీపీ కార్యకర్తలు దాడి చేశారు. కాజా టోల్ ప్లాజా వద్ద ఎమ్మెల్యే కారుపై ఈ దాడి జరిగింది. మాచర్ల నుంచి విజయవాడకు వెళుతున్న పిన్నెల్లి కారుపై ఈ దాడి జరిగింది. సర్వీస్ రోడ్డులో వెళుతున్న పిన్నెల్లి కారుపై ముందుగా దూరం నుంచి రాళ్లు రువ్విని ఆందోళన కారులు ఆ తర్వాత కాన్వాయ్ దగ్గరకు వచ్చి ఎమ్మెల్యేతో వాగ్వాదం చేశారు. కర్రలు, రాళ్లతో టీడీపీ కార్యకర్తలు, ఆందోళన కారులు దాడులు చేయడంతో ఎమ్మెల్యే కారు, కాన్వాయ్ అద్దాలు ధ్వంసమయ్యాయి. ఈ దాడిలో ఎమ్మెల్యే సెక్యూరిటీ సిబ్బంది గాయలైనట్లు సమాచారం.
Read Also:చురుగ్గా సర్కారు-అమరావతి ఉద్యమ పయనం ఎటు?
రైతుల ముసుగులో టీడీపీ కార్యకర్తలే ఈ దాడికి పాల్పడినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. గత 20 రోజులుగా అమరావతి ఒక్కటే రాజధానిగా ఉంచాలని డిమాండ్ చేస్తూ ఆందోళన చేస్తున్నారు. ఈ నేపధ్యంలో ఈ రోజు మంగళిగిరి వద్ద జాతీయ రహదారిపై ఆందోళనలు చేస్తున్నారు.
సర్వీస్ రోడ్డులో వెళుతుంటే తనపై దాడి జరిగినట్లు పిన్నెళ్లి మీడియాతో మాట్లాడుతూ చెప్పారు. దాదాపు 30 నుంచి 40 మంది టీడీపీ కార్యకర్తలు తాగి వచ్చి తన కాన్వాయ్‌పై ముందు రాళ్లు రువ్వారని, ఆ తర్వాత కర్రలతో తన కాన్వాయ్‌పై దాడి చేసినట్లు చెప్పారు. చంద్రబాబు తన పార్టీ వారితో రైతుల ముసుగులో దాడులు చేయించి శాంతి భద్రతల సమస్య సృష్టించే ప్రయత్నం చేస్తున్నారని పేర్కొన్నారు. రైతు ముసుగులో కాకుండా టీడీపీ నేతలు నేరుగా రావాలని ఎమ్మెల్యే సవాల్ విసిరారు.