iDreamPost
android-app
ios-app

ఆ టైంలో విజయ్ దేవరకొండ అందరం కలిసి చచ్చిపోతాం అన్నాడు

  • Published May 25, 2022 | 7:06 PM Updated Updated May 25, 2022 | 7:06 PM
  • Published May 25, 2022 | 7:06 PMUpdated May 25, 2022 | 7:06 PM
ఆ టైంలో విజయ్ దేవరకొండ అందరం కలిసి చచ్చిపోతాం అన్నాడు

పెళ్లి చూపులు, ఈ నగరానికి ఏమైంది లాంటి హిట్ సినిమాల డైరెక్టర్ తరుణ్ భాస్కర్ ఆ తర్వాత నటుడిగా, హీరోగా, యాంకర్ గా, సింగర్ గా, ఎడిటర్ గా కూడా పని చేసి అందర్నీ మెప్పిస్తున్నాడు. తెలుగు సినీ ఇండస్ట్రీకి విశ్వక్సేన్, విజయదేవరకొండ లాంటి ఇద్దరు స్టార్ హీరోలని అందించాడు. ప్రస్తుతం వేరే సినిమాలకి రచయితగా పని చేస్తూ తన నెక్స్ట్ సినిమా ప్లాన్ లో ఉన్నాడు తరుణ్.

తాజాగా ఆలీతో సరదాగా ప్రోగ్రాంకి వచ్చిన తరుణ్ పలు ఆసక్తికర విషయాలని తెలియచేశాడు. ఈ ప్రోగ్రాంకి సంబంధించిన ప్రోమోని రిలీజ్ చేయగా ఇందులో ఆలీ అడిగిన పలు ప్రశ్నలకి సమాధానాలు ఇవ్వడంతో పాటు, తన లైఫ్ లో జరిగిన ఇన్సిడెంట్స్ ని కూడా ప్రేక్షకులతో షేర్ చేసుకున్నాడు. ఈ ప్రోమోలో విజయ్ దేవరకొండతో పెళ్లి చూపులు షూటింగ్ టైంలో జరిగిన ఓ వింత అనుభవాన్ని షేర్ చేసుకున్నాడు.

తరుణ్ దీని గురించి చెప్తూ.. పెళ్లి చూపులు సినిమా షూటింగ్ సమయంలో ట్రక్కు బ్రేకులు ఫెయిల్ అయ్యాయి. విజయ్ డ్రైవ్ చేస్తున్నాడు, పక్కన దర్శి ఉన్నాడు, నాతో పాటు మరికొంతమంది ఉన్నారు. బ్రేకులు ఫెయిల్ అవ్వగానే మొదట విజయ్‌ దేవరకొండ భయపడ్డాడు, కానీ తర్వాత సడన్‌గా రిలాక్స్‌ అయ్యాడు. ఆ తర్వాత దర్శి హ్యాండ్‌ బ్రేక్‌ తీస్తే అది కూడా ఊడి చేతులోకి రావడంతో అందరం భయపడుతుంటే విజయ్ మాత్రం రిలాక్స్ గా ఉన్నాడు. మొత్తానికి ట్రక్కు వెళ్లి ఒక చెట్టును ఢీ కొట్టి ఆగింది. దీంతో అందరం బతికి బయటపడ్డాం. ఆ సమయంలో నేను బతికి ఉన్నాను అనేదానికంటే కూడా అలాంటి పరిస్థితిలో విజయ్‌ అంత కూల్‌గా ఎలా ఉన్నాడో అని తెలుసుకోవాలని విజయ్ ని అడిగితే ఫస్ట్‌ స్టార్టింగ్‌ల భయం వేసింది రా, ఆ తర్వాత అందరం కలిసి చచ్చిపోతాం కదా, ఏముంది అని ఆన్సర్ ఇవ్వడంతో షాక్ అయ్యాను అని తెలిపారు.

ఇక భవిష్యత్తులో నా ఖర్మ కాలి వరుసగా మూడు ఫ్లాప్స్ వస్తే మళ్ళీ విజయ్ దేవరకొండతోనే సినిమా తీస్తాను అని కూడా తరుణ్ భాస్కర్ తెలిపాడు. ఈ సంఘటన గురించి చెప్పడంతో విజయ్ ఫాన్స్ ఈ ప్రోమోని వైరల్ చేస్తున్నారు. ఇంటర్వ్యూలో తరుణ్ భాస్కర్ ఇంకా ఏం చెప్పాడో అని విశ్వక్, విజయ్ ఫాన్స్ ఫుల్ ఎపిసోడ్ కోసం ఎదురు చూస్తున్నారు.

Jojobet GirişJojobetHoliganbetHoliganbetGrandpashabetGrandpashabetJojobetHoliganbetHoliganbetjojobet güncel girişcratosroyalbetganobetgrandpashabetiptv satın alCasibomcasibomjojobetcasibomcasibomHoliganbetcasibomjojobetgrandpashabetcasibom girişgrandpashabetcasibom