iDreamPost
android-app
ios-app

హసీన్ దిల్ రుబా రిపోర్ట్

  • Published Jul 03, 2021 | 6:25 AM Updated Updated Jul 03, 2021 | 6:25 AM
హసీన్ దిల్ రుబా రిపోర్ట్

జూలై వచ్చాక మళ్ళీ ఓటిటి రిలీజుల హడావిడి మొదలయ్యింది. నిన్న తాప్సీ ప్రధాన పాత్రలో నటించిన హసీన్ దిల్ రుబా నెట్ ఫ్లిక్స్ ద్వారా నేరుగా ప్రేక్షకుల ఇంటికి వచ్చేసింది. ట్రైలర్ చూసినప్పుడు ఇదో క్రైమ్ థ్రిల్లర్ అనే ఇంప్రెషన్ రావడంతో ఆ జానర్ ని ఇష్టపడే వాళ్లకు దీని మీద ఆసక్తి పెరిగింది. గత కొన్నేళ్లుగా తన పెర్ఫార్మన్స్ తో సినిమాలను నిలబెడుతున్న తాప్సీకి హసీన్ దిల్ రుబా మరో మేజర్ బ్రేక్ గా నిలిచే అవకాశాలు ఇందులో కూడా కనిపించాయి. హిందీతో పాటు తమిళం తెలుగు ఇంగ్లీష్ భాషల్లోనూ డబ్బింగ్ చేసి ఏకకాలంలో స్ట్రీమింగ్ చేసిన ఈ సస్పెన్స్ ఇన్వెస్టిగేటివ్ మూవీ ఎలా ఉందో సింపుల్ రిపోర్ట్ లో చూద్దాం. ముందు కథ.

నది ప్రాంతమైన జ్వాలాపూర్ లో ఉండే రిషబ్(విక్రాంత్ మాసే)విద్యుత్ ఉద్యోగి. ఎన్నో సంబంధాలు పెళ్లి చూపుల దాకా వెళ్లి కుదరక ఫైనల్ గా రాణి(తాప్సీ)తో జీవితం ముడిపడుతుంది. మొదట్లో చిన్న చిన్న అపార్థాలు కమ్యూనికేషన్లతో వీళ్ళ కాపురం సజావుగా సాగదు. రిషబ్ కు తమ్ముడు వరస అయ్యే నీల్(హర్షవర్ధన్ రానే)వచ్చాక రాణిలో మార్పు వచ్చి అతనితో సంబంధం ఏర్పరుచుకుంటుంది. ఓ రోజు నీల్ చెప్పాపెట్టకుండా వెళ్ళిపోతాడు. కొన్ని పరిణామాల తర్వాత రిషబ్ హత్యకు గురవుతాడు. మర్డర్ నీల్ సహాయంతో రాణినే చేసుంటుందన్న ఉద్దేశంతో ఇన్స్ పెక్టర్ కిషోర్(ఆదిత్య శ్రీవాత్సవ)విచారణ మొదలుపెడతాడు. మిగిలిన స్టోరీని తెరమీద చూడాలి.

ఇలాంటి పాయింట్ తో గతంలో చాలా సినిమాలు రావడంతో హసీన్ దిల్ రుబా మరీ ప్రత్యేకంగా అనిపించదు. హీరో ఇంటికి సంబంధించి సహజంగా ఉండే అద్భుతమైన లొకేషన్ ని సెట్ చేసుకోవడం ఒక్కటే అన్నిటికంటే పాజిటివ్ గా కనిపిస్తుంది. కీలకమైన ట్విస్ట్ కూడా సినిమాలు విపరీతంగా చూసే వాళ్ళు ఇంటర్వెల్ ముందే గెస్ చేయగలరు. దానికి తోడు దర్శకుడు వినీల్ మాత్యు, రచయిత కామిక థిల్లాన్ స్క్రీన్ ప్లే ని ఆసక్తికరంగా రాసుకోకపోవడంతో చాలా చోట్ల విపరీతమైన ల్యాగ్ ఉంది. ఆర్టిస్టులలో ఎక్కువగా ఆకట్టుకునేది విక్రాంత్ మాసేనే. తాప్సీ కూడా సోసోగానే అనిపిస్తుంది. వీకెండ్ ఇంకేదీ తోచకపోతేనే హసీన్ దిల్ రుబాని ట్రై చేయండి