iDreamPost
android-app
ios-app

రోహిత్‌ శర్మ కెప్టెన్సీపై సురేష్‌ రైనా సంచలన వ్యాఖ్యలు

  • Published Oct 17, 2023 | 6:39 PM Updated Updated Oct 17, 2023 | 6:39 PM
  • Published Oct 17, 2023 | 6:39 PMUpdated Oct 17, 2023 | 6:39 PM
రోహిత్‌ శర్మ కెప్టెన్సీపై సురేష్‌ రైనా సంచలన వ్యాఖ్యలు

వన్డే వరల్డ్‌ కప్‌ 2023లో టీమిండియా అదరగొడుతోంది. హ్యాట్రిక్‌ విజయాలతో పాయింట్స్‌ టేబుల్లో ఫస్ట్‌ ప్లేస్‌లో ఉంది రోహిత్‌ సేన. తొలుత పటిష్టమైన ఆస్ట్రేలియాను, రెండో మ్యాచ్‌లో పిసికూన ఆఫ్ఘనిస్థాన్‌ని.. ఆ తర్వాత మూడో మ్యాచ్‌లో చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్‌ను చిత్తుగా ఓడించిన భారత్‌.. మూడు వరుస విజయాలను ఖాతాలో వేసుకుని.. మోస్ట్‌ సక్సెస్‌ఫుల్‌ టీమ్‌గా ఉంది. అయితే.. టీమిండియా విజయంలో అందరు ఆటగాళ్లకు భాగం ఇచ్చినా.. కెప్టెన్‌ రోహిత్‌ శర్మకు కొన్ని మార్కులు అదనంగా ఇవ్వాలి. ఎందుకంటే అంత అద్భుతంగా రోహిత్‌ కెప్టెన్సీతో టీమిండియాను ముందుండి నడిపిస్తున్నాడు.

పాకిస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో బౌలర్లను అద్భుతంగా మారుస్తూ.. మంచి ఫలితం రాబట్టాడు. రోహిత్‌ కెప్టెన్సీతో పాటు టీమిండియా బౌలర్లు సత్తా చాటడంతో.. పాకిస్థాన్‌ 191 పరుగులకే కుప్పకూలింది. అయితే.. పాకిస్థాన్‌కు ఆరంభంలో మంచి స్టార్ట్‌ లభించింది. ఓపెనర్లు ఇమామ్‌ ఉల్‌ హక్‌-అబ్దుల్లా షఫీక్‌ పాక్‌కు మంచి స్టార్ట్‌ ఇచ్చారు. ఆ తర్వాత బాబర్‌ అజమ్‌-రిజ్వాన్‌ సైతం మంచి భాగస్వామ్యంతో పాక్‌కు బిగ్‌స్కోర్‌ అందించేలా కనిపించారు. ప్రమాదకరంగా మారుతున్న ఈ జోడీని విడదీసేందుకు రోహిత్‌ శర్మ.. వికెట్‌ టేకింగ్‌ బౌలర్‌ అయిన సిరాజ్‌ను రెండో స్పెల్‌ కోసం బరిలోకి దింపాడు.

అది అద్భుతంగా పనిచేసింది. సిరాజ్‌ రాగానే బాబర్‌ను క్లీన్‌ బౌల్డ్‌ చేశాడు. ఆ వెంటనే కుల్దీప్‌ యాదవ్‌తో అదనపు ఓవర్‌ వేయించిన రోహిత్‌.. పాక్‌ను కోలుకోకుండా చేశాడు. సిరాజ్‌ బాబర్‌ను అవుట్‌ చేసిన మరుసటి ఓవర్‌లో.. కుల్దీప్‌ రెండు వికెట్ల తీశాడు. అక్కడి నుంచి పాక్‌ కుప్పకూలింది. ఇలా రోహిత్‌ తన కెప్టెన్సీ నైపుణ్యంతో బౌలింగ్‌లో అద్భుత మార్పులు చేశాడు. ఇదే విషయంపై టీమిండియా మాజీ క్రికెటర్‌ సురేష్‌ రైనా మాట్లాడుతూ.. రోహిత్‌ కెప్టెన్సీపై ప్రశంసల వర్షం కురిపించాడు. రోహిత్‌ అద్బుతంగా కెప్టెన్సీ చేస్తున్నాడని, కెప్టెన్‌గా ధోనికి లభించిన గౌరవం రోహిత్‌కి కూడా దక్కుతుందని అన్నాడు. బౌలింగ్‌ మార్పులను అద్భుతంగా చేస్తూ.. సిరాజ్‌, బుమ్రా, శార్దుల్‌, కుల్దీప్‌ యాదవ్‌లను సరిగ్గా వాడుకుంటూ.. సూపర్‌ సక్సెస్‌ అవుతున్నాడని అన్నాడు. మరి రోహిత్‌ కెప్టెన్సీపై రైనా వ్యాఖ్యలపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

ఇదీ చదవండి: భారత్-పాక్ మ్యాచ్​పై గౌతం గంభీర్ సంచలన కామెంట్స్!