iDreamPost
android-app
ios-app

ఈ చిన్న పాప ఇప్పుడు.. ఏకంగా చిరంజీవి పక్కనే నటిస్తుంది!

  • Published Mar 19, 2024 | 5:33 PM Updated Updated Mar 19, 2024 | 5:33 PM

మోడలింగ్ రంగం నుండి ఇండస్ట్రీలోకి వచ్చి సత్తా చాటిన నటీమణులు ఉన్నారు. నార్త్ ఇండియాలో పుట్టి.. దక్షిణాది చిత్రాలతో ఎంట్రీ ఇచ్చి.. ఇక్కడే పేరు ప్రఖ్యాతలు తెచ్చుకుంటున్నారు. ఈ ఫోటోలో చిన్నారి కూడా ఆ జాబితాలోకి వచ్చేస్తుంది.

మోడలింగ్ రంగం నుండి ఇండస్ట్రీలోకి వచ్చి సత్తా చాటిన నటీమణులు ఉన్నారు. నార్త్ ఇండియాలో పుట్టి.. దక్షిణాది చిత్రాలతో ఎంట్రీ ఇచ్చి.. ఇక్కడే పేరు ప్రఖ్యాతలు తెచ్చుకుంటున్నారు. ఈ ఫోటోలో చిన్నారి కూడా ఆ జాబితాలోకి వచ్చేస్తుంది.

  • Published Mar 19, 2024 | 5:33 PMUpdated Mar 19, 2024 | 5:33 PM
ఈ చిన్న పాప ఇప్పుడు.. ఏకంగా చిరంజీవి పక్కనే నటిస్తుంది!

మోడల్ రంగం నుండి ఎంతో మంది నటీమణులు ఇండస్ట్రీలోకి వచ్చారు. జమ్ము కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు చాలా మంది బ్యూటీస్.. వెండితెరపై వెలిగేందుకు వస్తూనే ఉన్నారు.. అలరిస్తూనే ఉన్నారు. బిగ్ స్క్రీన్‌లోకి రాకముందు పలు యాడ్స్ చేశాక.. సినిమా అవకాశాలను సంపాదిస్తున్నారు. సాధారణంగా ఓ హీరోయిన్ ఆయా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టి .. అక్కడ క్రష్ అన్న ముద్ర వేయించుకుంటూ ఉంటుంది. కానీ ఇప్పుడు మనం చెప్పుకోబోయే అమ్మడు మాత్రం పరభాష చిత్రంతో టాలీవుడ్ ప్రేక్షకుల గుండెల్లో స్థానం సంపాదించుకుంది. వారెవ్వా.. ఏముందీరా ఈ అమ్మాయి అనిపించేలా చాలా పద్దతిగా కనిపించి మెస్మరేజ్ చేసేసింది అనడంలో ఎటువంటి సందేహం లేదు. సినిమాలో ఆమెకు ఇచ్చిన ఎలివేషన్ అలాంటిది మరి.

ఇదిగో ఈ ఫోటోలో ఉన్న చిన్నారి గురించే ఇప్పుడు మాట్లాడుకునేది. సైకిల్ తొక్కుతూ చిరు నవ్వులతో ఫోటోలకు ఫోజులిస్తున్న ఈ పాప గురించే ఇదంతా. బాబ్రీ కట్‪తో టామ్ బాయ్ ను తలపిస్తున్న ఈ బేబీ.. తమిళ సినిమాతో తెలుగులో క్రేజ్ తెచ్చుకుంది. ఢిల్లీ భామ.. తమిళ తంబీ గల్లీలోకి ఎంటరైంది. తెలుగు, తమిళ, కన్నడ భాషల్లో సత్తా చాటుతోంది. ఈ బ్యూటీ తెలుగు టాప్ హీరో సినిమాలో ఛాన్స్ కొట్టేసింది. ఇలాంటి అవకాశం బహుశా ఇటీవల కాలంలో టైర్ 2 హీరోయిన్లకు దక్కలేదనే చెప్పొచ్చు. ఇంతకు ఆ బ్యూటీ ఎవరంటే.. సురభి. ఈ నార్త్ ఇండియన్ పూర్తి పేరు సురభి పురాణిక్. బోర్న్ అండ్ బ్రోటప్ అంతా ఢిల్లీలోనే. ఎంటర్ టైన్ మెంట్ రంగంపై మక్కువతో యాక్టింగ్ కోర్సు తీసుకుంది. ఆమెకు గురువు .. ప్రముఖ నటుడు మనోజ్ భాజ్ పేయ్.

నటన తర్వాత తమిళ ఇండస్ట్రీలోకి అడుగు పెట్టింది. ఇవన్ వీరమత్రి అనే చిత్రం ఆమెకు తొలి సినిమా ఎక్స్ పీరియన్స్. ఇక రెండవ ఛాన్సే ధనుష్ మూవీలో. రఘువరన్ బీటెక్ సినిమాలో సెకండ్ హీరోయిన్‌గా నటించింది. అందులో ఉంది కొద్ది సేపైనా కీలక పాత్ర పోషించింది. ఇందులో ఆమె అందానికి ఫిదా అయిపోయారు ఆడియన్స్. అదే ఆమెకు తెలుగులో అవకాశాలు ఇచ్చేలా చేసింది. బీరువా, ఎక్స్ ప్రెస్ రాజా వంటి చిత్రాలతో అలరించింది సురభి. రామ్ గోపాల్ వర్మ ఎటాక్, నానితో జెంటిల్ మెన్, అల్లు శిరీష్ సరసన ఒక్క క్షణం, ఓటర్, శశి వంటి చిత్రాలు ఆమెకు టైర్ 2 హీరోయిన్ గా నిలబెట్టాయి. ఇప్పుడు మెగాస్టార్ చిరంజీవితో కలిసి నటించే గోల్డెన్ ఛాన్సును కొల్లగొట్టింది ఈ బ్యూటీ. మల్లిడి విష్ణు, చిరంజీవి కాంబోలో వస్తున్న విశ్వంభరలో హీరోయిన్‌గా ఫిక్స్ అయ్యింది ఈ ఢిల్లీ సోయగం.

Jojobet GirişjojobetJojobetjojobetjojobetJojobetZirvebetjojobetultrabetcasibomcasibomcasibomjojobetcasibom girişşanlıurfa konteynerbetciobetcioTipobetHoliganbetHoliganbetTipobetjojobetjojobet girişjojobet giriş