Swetha
కరోనా సమయంలో కరోనాను నియంత్రించే విషయంలో.. ఆధునిక వైద్యం విఫలమైందంటూ.. ప్రముఖ యోగ గురు బాబా రామ్ దేవ్ పలు వ్యాఖ్యలు చేశారు. ఈ విషయంలో అంతటా విమర్శలు రావడంతో ఆయన తన వ్యాఖ్యలు వెనక్కి తీసుకున్నారు. అయితే, తాజాగా ఈ చర్చలు మరొకసారి తెరపైకి వచ్చాయి.
కరోనా సమయంలో కరోనాను నియంత్రించే విషయంలో.. ఆధునిక వైద్యం విఫలమైందంటూ.. ప్రముఖ యోగ గురు బాబా రామ్ దేవ్ పలు వ్యాఖ్యలు చేశారు. ఈ విషయంలో అంతటా విమర్శలు రావడంతో ఆయన తన వ్యాఖ్యలు వెనక్కి తీసుకున్నారు. అయితే, తాజాగా ఈ చర్చలు మరొకసారి తెరపైకి వచ్చాయి.
Swetha
కొన్నాళ్ల క్రితం ప్రముఖ యోగ గురు బాబా రామ్ దేవ్ .. కరోనా కట్టడి విషయంలో ఆధునిక వైద్యం విఫలమైందని.. పలు వ్యాఖ్యలు చేశారు. ఆ సమయంలో ఈ వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా ఎన్నో చర్చలకు దారి తీశాయి. అంతటా విమర్శల వర్షం వెల్లువెత్తింది. దీనితో రామ్ దేవ్ తన వ్యాఖ్యలు వెనుక్కు తీసుకున్నారు. అయితే, మరల ఇప్పుడు ఈ చర్చలు తెరపైకి వచ్చాయి. రామ్ దేవ్ కు చెందిన ప్రముఖ సంస్థ వ్యాపార ప్రకటనలపై.. న్యాయస్థానం స్పందించింది. ఆ ప్రకటనలతో ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని రామ్ దేవ్ కు.. షోకాజ్ నోటీసులు జారీచేసింది. బాబ రామ్ దేవ్, ఆ సంస్థ ఎండీ ఆచార్య బాలకృష్ణన్ తమ న్యాయస్థానం ముందు హాజరు కావాలని ఆదేశాలు జారీ చేసింది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
వ్యాక్సినేషన్, ఆధునిక ఔషధాలకు వ్యతిరేకంగా.. బాబా రామ్ రామ్ దేవ్ తప్పుడు ప్రచారం చేసారని.. ఆరోపిస్తూ ఇండియన్ మెడికల్ అసోసియేషన్ దాఖలు చేసిన పిటిషన్ పై.. కోర్టు విచారణ చేపట్టింది.కోర్టు బాబా రామ్ దేవ్ ను ఆదేశిస్తూ..”పతంజలి ఆయుర్వేదం అన్ని తప్పుడు, తప్పుదోవ పట్టించే ప్రకటనలు తక్షణమే నిలిపివేయాలి.. ఈ కోర్టు అటువంటి ఉల్లంఘనలను చాలా తీవ్రంగా పరిగణిస్తుంది.. ఒక నిర్దిష్టమైన వ్యాధిని నయం చేయగలదని తప్పుడు ప్రకటన చేసిన ప్రతి ఉత్పత్తిపై రూ. 1 కోటి వరకు జరిమానా విధించడాన్ని పరిశీలిస్తాం” అంటూ తెలియజేసింది. ఈ విషయంలో బాబా రామ్ దేవ్ పై అసహనం వ్యక్తం చేసింది. గతంలో కూడా ఐఎంఏ ఆయనపై రూ.1,000 కోట్లకు పరువు నష్టం దావా వేసింది. ఇక ఇప్పుడు మళ్ళీ షోకాజ్ నోటీసులను జారీ చేసింది. కరోనా సమయంలో రామ్ దేవ్ చేసిన వ్యాఖ్యలపై.. తీవ్ర విమర్శలు రావడంతో.. ఆ మాటలకు వెనక్కు తీసుకుని..తానూ ఉద్దేశపూర్వకంగా అలా అనలేదని.. వాట్సాప్‌లో వచ్చిన మెసేజ్‌ను చదివి వినిపించాననంటూ చెప్పుకొచ్చారు.
కాగా, ఫిబ్రవరి 27న రక్తపోటు, కీళ్ల నొప్పులు, మధుమేహం, ఉబ్బసం, ఊబకాయం వంటి ఇతర వ్యాధులకు సంబంధించి.. పతంజలి ఆయుర్వేదం అందించే మందులపై ప్రకటనలను కూడా ప్రచురించడానికి వీలు లేదని.. సుప్రీం కోర్టు ఆదేశాలు జారీ చేసింది. ప్రస్తుతం వారికీ షోకాజ్ నోటీసులు జారీ చేసి.. కోర్టుకు హాజరు కావాలని ఆదేశించింది. దీని గురించి పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. ఏదేమైనా, ఆయుర్వేదం అయినా ఆధునిక వైద్యం అయినా కూడా రెండు ప్రజలకు ఉపయోగపడేవి కాబట్టి.. ప్రజలు వీటిపై అవగాహన కలిగి ఉండాలి. మరి, ప్రముఖ యోగ గురు బాబా రామ్ దేవ్ కు సుప్రీం కోర్టు నోటీసులు.. జారీ చేసే విషయంలో మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.