మనం కథల్లోనో, ఫాంటసీ సినిమాల్లోనో సముద్రం లోపల బంగారు నిధి ఉందని చదివి లేదా చూసి ఉంటాం. కానీ, ఇది నిజంగా నిజం. ఆ ప్రాంతంలోని సముద్ర గర్భంలో కోట్లు విలవ చేసే బంగారం ఉంది.
1708లో స్పెయన్ – బ్రటీష్ దేశానికి మధ్య యద్ధం జరిగింది. ఆ సమయంలో స్పెయిన్ దేశానికి చెందిన శాన్ జోస్ అనే పెద్ద నౌక బ్రిటీష్ దాడిలో మునిగిపోయింది. నౌక నీట మునిగిన సమయంలో 600 మంది అందులో ప్రయాణం చేస్తున్నారట. వాళ్ళతో పాటు బంగారు నాణేలు, రత్నాలు, ఆభరణాలు ఉన్నాయి.
కొలంబియాలో మునిగిపోయిన రెండు నౌకల శిథిలాల కింద దీన్ని గుర్తించారు పరిశోధకులు. ఈ ప్రాంతంలో గుట్టల కొద్దీ బంగారు నాణేలు, అనేక ఇతర వస్తువులు ఉన్నట్లుగా చెప్తున్నారు. ప్రస్తుత కాలంలో వీటి విలువ దాదాపు 17 బిలియన్ డాలర్లుగా ఉండగా, మన కరెన్సీలో చూస్తే 1.32 లక్షల కోట్లకు పైనే ఉంటుందట.
2015లో ఈ నౌక శిథిలాలను గుర్తించగా, ఆరోజు నుంచి కొలంబియా పరిశోధకులు ప్రయత్నిస్తూనే ఉన్నారు. దాదాపు 3100 అడుగుల లోతులో ఈ శిథిలాలు ఉన్నట్లు ప్రకటించారు. తాజాగా సాంకేతికత సహాయంతో రిమోట కంట్రోల్ వాహనాన్ని పంపడం ద్వారా ఈ విషయం బయట ప్రపంచానికి తెలిసింది.