iDreamPost
android-app
ios-app

టైటిల్ చేంజ్ తప్పడం లేదు

  • Published Mar 13, 2021 | 10:20 AM Updated Updated Mar 13, 2021 | 10:20 AM
టైటిల్ చేంజ్ తప్పడం లేదు

ఇటీవలే ఏ1 ఎక్స్ ప్రెస్ తో పలకరించిన సందీప్ కిషన్ హీరోగా జి నాగేశ్వర్ రెడ్డి దర్శకత్వంలో కోన వెంకట్ నిర్మాణంలో రూపొందుతున్న సినిమా షూటింగ్ దాదాపు పూర్తి కావొస్తోంది. దీనికి చాలా రోజుల క్రితమే రౌడీ బేబీ టైటిల్ ని ప్రకటించి ఓ పోస్టర్ ని కూడా విడుదల చేశారు. అయితే ఇవాళ సాంకేతిక కారణాల వల్ల పేరు మార్చబోతున్నామని వెంకట్ ట్వీట్ చేయడంతో అసలేం జరిగిందానే ఆసక్తి అభిమానుల్లో నెలకొంది. అసలే రౌడీ బేబీ అనే పదం మాస్ కి విపరీతంగా కనెక్ట్ అవుతుంది. మారి 2లో ధనుష్ సాయి పల్లవిల డాన్స్ కాంబినేషన్ లో వచ్చిన ఈ సాంగ్ ఎన్ని రికార్డులు సృష్టించిందో కొత్తగా చెప్పాల్సిన పని లేదు.

అలాంటప్పుడు ఎందుకీ మార్పు అనే ప్రశ్న ఉత్పన్నం కావడం సహజం. ఇన్ సైడ్ టాక్ ప్రకారం రౌడీ బేబీ టైటిల్ ని ఎన్నో నెలల క్రితమే ఓ డబ్బింగ్ సినిమా కోసం ఎవరో నిర్మాత ఫిలిం ఛాంబర్ లో రిజిస్టర్ చేయించారట. అడిగినా కూడా ఇవ్వలేదని భారీ మొత్తం డిమాండ్ చేసినట్టుగా మరో టాక్ కూడా వచ్చింది. ఇదంతా నిజమో కాదో కానీ రౌడీ బేబీ టైటిల్ ని మారుస్తున్నారన్న వార్త ఇప్పుడీ పాయింట్ కి బలాన్ని చేకూరుస్తోంది. దీని స్థానంలో గాలి రౌడీ అనే కొత్త టైటిల్ లాక్ అవ్వొచ్చని ఫ్రెష్ అప్ డేట్

ఇలాంటి టైటిల్ తలనెప్పులు గతంలోనూ చాలా వచ్చాయి. నాని గ్యాంగ్ లీడర్, కళ్యాణ్ రామ్ కత్తి, మహేష్ బాబు ఖలేజా, పవన్ కళ్యాణ్ కొమరం పులి ఇలాంటి ఇబ్బందులను ఎదురుకున్నవే. అయితే వాటికి బలమైన స్టార్ సపోర్ట్ ఉండటంతో ఏదోలా మేనేజ్ చేశారు కానీ సందీప్ కిషన్ కు ఈ స్థాయిలో లాబీయింగ్ చేయడం కష్టం. ఏ1 ఎక్స్ ప్రెస్ ఫలితం క్లియర్ గా తెలిసే లోపే కేవలం వారం గ్యాప్ తో జాతిరత్నాలు వచ్చి పడటంతో ఫైనల్ గా యావరేజ్ ఫలితంతో సంతృప్తి పడాల్సి వస్తోంది. తనతో తెనాలిరామకృష్ణ తీసిన నాగేశ్వర్ రెడ్డి చెప్పిన కథ బాగా నచ్చడంతో దీనికి ఓకే చెప్పాడట. మేలోగా విడుదలయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి