Mango సమ్మర్ సీజన్.. మామిడి పండ్లు తింటే ఎంత లాభమో తెలుసా??

 

మనకి ఒక్కో సీజన్లో ఒక్కో పండు స్పెషల్ గా వస్తుంది. సంవత్సరం అంతా ఎన్ని పళ్ళు ఉన్నా మనం ఎదురు చూసేది మాత్రం మామిడిపండు కోసమే. సమ్మర్ సీజన్ వచ్చిందంటే చాలు చిన్నపిల్లల దగ్గర నుంచి ముసలివాళ్ళ వరకు అందరూ మామిడిపండు ఎప్పుడు తింటామా అని ఎదురుచూస్తూ ఉంటారు. మామిడిపండ్లు ఎంతరుచిగా ఉంటాయో అంతే ఆరోగ్యాన్ని కూడా ఇస్తాయి.

 

మామిడి పండులో ప్రొటిన్స్, కార్బోహైడ్రేట్స్‌, షుగర్‌, ఫైబర్‌, కేలరీలు, విటమిన్‌ సీ, కాపర్‌, పొటాషియం లాంటి మినరల్స్ ఉంటాయి. మామిడిపండు తినడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఇవే..

మామిడి పండ్లు తినడం వల్ల

#రోగ నిరోధక వ్యవస్థ బలోపేతం అవుతుంది.
#అధిక రక్తపోటు సమస్యను నివారిస్తుంది.
#రక్తహీనతను తగ్గిస్తుంది.
#ఆహారం సులువుగా జీర్ణమవుతుంది.
#కంటి సమస్యలు తగ్గుతాయి.
#రేచీకటి రాకుండా ఉండేందుకు తోడ్పడుతుంది.
#జీర్ణ వ్యవస్థను సక్రమంగా పనిచేసేలా చేస్తుంది.
#చెడు కొలెస్ట్రాల్‌ను నివారిస్తుంది.
#కాన్సర్‌ రాకుండా ఉండేందుకు తోడ్పడుతుంది.
#మామిడి జ్యూస్ శక్తిని ఇస్తుంది.

ఒక్క మామిడిపండు తినడం వల్ల ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయి కాబట్టి ప్రతి సమ్మర్ లోనూ మామిడిపండ్లు తినాలి.

Show comments