iDreamPost
android-app
ios-app

Summer Heat: అధిక ఎండల దృష్ట్యా..ప్రభుత్వం కీలక నిర్ణయం.. ట్రాఫిక్ సిగ్నల్ వద్ద..!

రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు దేశంలోని అన్ని ప్రాంతాల్లో రోజు రోజుకు ఎండలు మండిపోతున్నాయి. ఏటి ఏటా తన రికార్డును తానే  బ్రేక్ చేస్తున్నాడు సూర్యుడు. ఈ నేపథ్యంలో ఓ ప్రభుత్వం తీసుకున్న ఓ నిర్ణయం ఎండతో అల్లాడిపోయే వారికి ఊరట అనే చెప్పాలి.

రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు దేశంలోని అన్ని ప్రాంతాల్లో రోజు రోజుకు ఎండలు మండిపోతున్నాయి. ఏటి ఏటా తన రికార్డును తానే  బ్రేక్ చేస్తున్నాడు సూర్యుడు. ఈ నేపథ్యంలో ఓ ప్రభుత్వం తీసుకున్న ఓ నిర్ణయం ఎండతో అల్లాడిపోయే వారికి ఊరట అనే చెప్పాలి.

Summer Heat: అధిక ఎండల దృష్ట్యా..ప్రభుత్వం కీలక నిర్ణయం.. ట్రాఫిక్ సిగ్నల్ వద్ద..!

ప్రస్తుతం దేశంలో ఎండలు మండిపోతున్నాయి. ఏపీ, తమిళనాడు, తెలంగాణ వంటి మరికొన్ని రాష్ట్రాలు అయితే మండే అగ్నిగోళంలా ఉన్నాయి. ఉష్ణోగ్రతలు రోజు రోజుకూ ఎక్కువ అవుతున్నాయి. ఏ ప్రాంతంలో చూసిన వేడి గాలులు వేధిస్తున్నాయి. ఇక భానుడి తాపానికి ఇళ్లలో నుంచి బయటకు వచ్చేందుకు జనాలు భయపడుతున్నారు. ముఖ్యంగా పిల్లల, వృద్ధులు అయితే అల్లాడిపోతున్నారు. అలానే విధుల నిమిత్తం ఆఫీసులకు, ఇతర కార్యాలయాలకు , వాహనాదారులు ఎండ తీవ్రతకు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. ఈక్రమంలోనే  ఓ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంతో ఎండతో అల్లాడిపోయే వారికి ఊరట అనే చెప్పాలి. మరి.. ఆ వివరాలు ఏమిటో ఇప్పుడు చూద్దాం..

రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు దేశంలోని అన్ని ప్రాంతాల్లో రోజు రోజుకు ఎండలు మండిపోతున్నాయి. ఏటికి ఏటా తన రికార్డును తానే  బ్రేక్ చేస్తున్నాడు సూర్యుడు. అత్యధిక ఉష్ణోగ్రతలతో పలు రాష్ట్రాలు నిప్పుల కొలిమిలా మారుతున్నాయి. పగటిపూట కాలు బయటపెడితే నిప్పులు మీద నడిచిన దాని కంటే ఘోరంగా ఉందని పలువురు చెబుతున్నారు. ఇప్పుడే ఇలా ఉంటే మే నెల మధ్యవారం, చివరి వారంలో ఇక  ఎండల ఏ స్థాయిలో ఉంటాయో అని ఆందోళన వ్యక్తం చేశారు. కానీ, కొందరు ఆఫీసులు, ఇతరత్రా అవసరాల కోస బయటకు వెళ్లక తప్పని పరిస్థితి.

ముఖ్యం ఎండలు ఉన్న సరే కొందరు వాహనాల్లో ప్రయాణం చేయాల్సి ఉంటుంది. అలాంటి వారి కోసం పుదుచ్చేరి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పుదుచ్చేరి కేంద్ర పాలిత ప్రాంతంలోని అన్ని ట్రాఫిక్‌ సిగ్నల్స్‌ ప్రత్యేక ఏర్పాటు చేశారు. ట్రాఫిక్ సిగ్నల్ వద్ద ఆగే వాహనదారులు ఎండలో ఇబ్బందిపడకుండా ఉండేందుక పచ్చని వలతో పందిళ్ల మాదిరిగా ఏర్పాట్లు చేసింది. స్టేట్ పబ్లిక్ అఫైర్స్ డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో పుదుచ్చేరి వ్యాప్తంగా పలు ట్రాఫిక్ సిగ్నళ్ల ఈ గ్రీన్ షేడ్ ను ఏర్పాటు చేశారు. సిగ్నల్ పడితే వాహనాలు ఎంత వరకు ఆగుతాయో అనే దాని ప్రకారం..కొంత దూరం వరకు ఈ గ్రీన్ షేడ్ ను ఏర్పాటు చేశారు.

ఇందుకు సంబంధించిన దృశ్యాలను కొందరు వీడియో తీసి సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేశారు. ప్రస్తుతం ఈ వీడియోలు నెట్టింట వైరల్‌ అవుతున్నాయి. సూర్యుడి ప్రతాపంతో అల్లాడిపోతున్న వాహనదారులకు ఉపశమనం కలిగించేలా పుదుచ్చేరి ప్రభుత్వం చేసిన ఈ ప్రయత్నాన్ని నెటిజన్లు మెచ్చుకుంటున్నారు.  ఇప్పటికే పలు రాష్ట్రాల్లో దంచికొడుతున్న ఎండల దృష్ణ్యా అనేక  జాగ్రత్తలు తీసుకున్నారు. ప్రభుత్వ పాఠశాలలకు సెలవులు ప్రకటించడంతో పాటు.. వివిధ ఏర్పాట్లను చేశారు.  మొత్తంగా మరి.. పుదుచ్చేరిలో ఎండకు చేసిన ఏర్పాట్లపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి. ఇప్పటికే

 

View this post on Instagram

 

A post shared by Vasanth Murugan (@pondydiaries)