Arjun Suravaram
AP Rain Forecast: ఆంధ్రప్రదేశ్ లో భానుడి భగభగలకు ప్రజలు అల్లాడిపోతున్నారు. ఇంటి నుంచి కాలు బయట పెట్టేదుంకు వణికిపోతున్నారు. ఇలా ప్రజలు అల్లాడిపోతున్న సమయంలో వాతావరణ శాఖ ఓ తీపి కబురు చెప్పింది.
AP Rain Forecast: ఆంధ్రప్రదేశ్ లో భానుడి భగభగలకు ప్రజలు అల్లాడిపోతున్నారు. ఇంటి నుంచి కాలు బయట పెట్టేదుంకు వణికిపోతున్నారు. ఇలా ప్రజలు అల్లాడిపోతున్న సమయంలో వాతావరణ శాఖ ఓ తీపి కబురు చెప్పింది.
Arjun Suravaram
ప్రస్తుతం ఎండలు తీవ్ర స్థాయిలో విజృభిస్తున్నాయి. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ లోని పలు ప్రాంతాలు మండే అగ్నిగోళంలో కనిపిస్తున్నాయి. రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. 40 నుంచి 48 వరకు ఉష్ణోగ్రతలు నమోదు అవుతున్నాయి. శనివారం ప్రకాశం, కడప జిల్లాలో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ప్రకాశం జిల్లాలోని దరిమడగు అనే ప్రాంతంలో 47.5 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. ఇలా రాష్ట్ర వ్యాప్తంగా భానుడు భగభగ మంటున్నాడు. ఇలాంటి సమయంలో ఏపీ ప్రజలకు ఓ చల్లని వార్త వచ్చింది. రేపు, ఎల్లుండి వర్షాలు పడే సూచనలు ఉన్నాయని తెలిపింది. ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే..
ఆంధ్రప్రదేశ్ లో భానుడి భగభగలకు ప్రజలు అల్లాడిపోతున్నారు. ఇంటి నుంచి కాలు బయట పెట్టేదుంకు వణికిపోతున్నారు. ఇక పిల్లలు, వృద్ధులు ఈ ఉక్కపోతకు విలవిల్లాడిపోతున్నారు. ఉదయం 10 నుంచి ఎండల వేడి అదరగొడుతుంది. చల్లటి వాతావరణం ఎప్పుడు చూస్తామా అని ప్రజలు వెయ్యి కళ్లతో ఎదురు చూస్తున్నారు. ఇలా మండే ఎండలకు ఏపీ ప్రజలు అల్లాడి పోతున్నా సమయంలో ఓ చల్లడి వార్త వచ్చింది. రానున్న రెండు రోజుల్లో ఆంధ్రప్రదేశ్‌కి భారీ వర్ష సూచన ఉందంటోంది. రేపు, ఎల్లుండి ఏపీలో భారీ నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని అమరావతి వాతావరణ శాఖ పేర్కొంది. ఇక ఈ వానల ప్రభావం రాష్ట్రంలోని కొన్ని జిల్లాలపై ఉంటుందని వాతావరణ శాఖ తెలిపింది.
శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, విశాఖపట్నం, అనకాపల్లి, పల్నాడు, చిత్తూరు జిల్లాల్లో మోస్తారు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. ఇక, మిగతా చోట్ల తేలికపాటి వానలు కురుస్తాయని సూచించింది. ఉరుములు, మెరుపులు, పిడుగులతో కూడిన వర్షాలు కురిసేందుకు అవకాశం ఉందని తెలిపింది. ఆదివారం, సోమవారాల్లో కోస్తాంధ్ర, రాయలసీమల్లో అక్కడక్కడ తేలికపాటి వర్షాలతో పాటు గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని తెలిపింది. నేడు మాత్రం రాష్ట్రంలోని 247 మండలాల్లో వడగాల్పులు వీచే అవకాశం ఉందని తెలిపింది. ముఖ్యంగా మధ్యాహ్నం సమయంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని.. అత్యవసరం అయితేనే బయటకు రావాలని అధికారులు సూచిస్తున్నారు. మరో వైపు.. ఇప్పటికే తిరుపతి, తిరుమల సహా మరికొన్ని ప్రాంతాల్లో వర్షాలు కురుస్తున్నాయి. ముఖ్యంగా తిరుమలలో అయితే.. గత మూడు రోజులుగా వర్షాలు కురిస్తున్నాయి. తాజాగా వాతావరణ శాఖ చెప్పిన ఈ చల్లని కబురుకు ఏపీ ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.