iDreamPost
android-app
ios-app

Jordar Sujatha జబర్దస్త్ రాకేష్ కి లక్ష రూపాయల ఫోన్ గిఫ్ట్ ఇచ్చిన ప్రియురాలు..

  • Published May 03, 2022 | 4:46 PM Updated Updated May 03, 2022 | 5:08 PM
Jordar Sujatha  జబర్దస్త్ రాకేష్ కి లక్ష రూపాయల ఫోన్ గిఫ్ట్ ఇచ్చిన ప్రియురాలు..

 

 

జబర్దస్త్ షోలో ఆర్టిస్టులని స్కిట్ ల పేరుతో జంటలుగా కలుపుతున్న సంగతి తెలిసిందే. కొంచెం క్లోజ్ గా ఉండి, స్కిట్ లో మంచి కామెడీ, ఎమోషన్ పండిస్తే వాళ్ళని జంటగా చేసి మరింత ప్రమోట్ చేస్తున్నారు జబర్దస్త్ నిర్వాహకులు. అలా పైకి వచ్చిన జంటల్లో ఒకరు రాకేష్ -సుజాత. రాకేష్ ముందు నుంచి జబర్దస్త్ లో ఉండి టీం లీడర్ గా ఎదిగి ప్రస్తుతం మంచి ఫామ్ లో ఉన్నాడు. ఇక సుజాత న్యూస్ యాంకర్ గా పరిచయమై జోర్దార్ సుజాతగా పేరు తెచ్చుకొని తర్వాత బిగ్‌బాస్‌ షోతో మరింత పాపులారిటీ తెచ్చుకుంది. హౌస్ లో నుంచి బయటకి వచ్చాక జబర్దస్త్ కి వచ్చి రాకేష్ టీంలోను, ఈవెంట్స్ లోనూ కనువిందు చేస్తుంది. అంతేకాక యూట్యూబ్ ఛానల్ పెట్టి తన అభిమానులకి రెగ్యులర్ గా అప్డేట్ లో ఉంటుంది.

ఇక జబర్దస్త్ లో వీరిద్దరూ చేసే హంగామా అంతా ఇంత కాదు. వీరిద్దరూ నిజంగానే ప్రేమించుకుంటున్నారేమో అనేట్టుగా వీళ్ళ జంట తయారయింది. ఇటీవల వీరిద్దరూ కలిసి గోవాకి కూడా వెళ్లొచ్చారు. తాజాగా జబర్దస్త్ రాకేష్ కి సుజాత లక్ష రూపాయల ఫోన్ గిఫ్ట్ ఇచ్చింది. ఈ మేరకు తన యూట్యూబ్‌ ఛానల్‌లో ఓ వీడియోను పోస్ట్ చేసింది సుజాత. ఈ వీడియోలో సుజాత, రాకేష్, జబర్దస్త్ లో చేసే మరో ఆర్టిస్ట్ పార్వతి కలిసి మొబైల్ షో రూమ్ లోకి వెళ్లి ఫోన్ కొన్నారు. సుజాత మాట్లాడుతూ.. నా క్లోజ్ ఫ్రెండ్‌, అంతకంటే ఎక్కువ అయిన రాకేశ్‌కు ఫోన్‌ కొనిస్తున్నాను. కొద్దిరోజుల నుంచి రాకేష్ మొబైల్‌తో ఇబ్బందిపడుతున్నాడు. రాకేష్ కి కోపం వస్తే ఫోన్‌ పగలగొట్టే అలవాటు కూడా ఉంది. అందుకే నేను అతడి మనసుకు దగ్గరైన వ్యక్తిని కాబట్టి, నేను ఫోన్‌ కొనిస్తే రాకేష్ అది పగలగొట్టడానికి ఆలోచిస్తాడు. అతను నా లైఫ్ లోకి వచ్చిన దగ్గరినుంచి నేను చాలా సంతోషంగా ఉన్నాను. అందుకే రాకేష్ కి ఫోన్ కొనిస్తున్నాను. నేను కొనిస్తే జాగ్రత్తగా చూసుకుంటాడు అని నా నమ్మకం అని తెలిపింది.

రాకేష్ కి సామ్‌సంగ్‌ గెలాక్సీ S22 అల్ట్రా ఫోన్‌తో పాటు ఓ స్మార్ట్‌ వాచ్‌ ని కూడా కొనిచ్చింది. ఈ రెండిటి ఖరీదు లక్షా 20 వేల రూపాయలు అని రాకేశ్‌ ఈ వీడియోలో వెల్లడించాడు. సుజాత నా కోసం కొనిచ్చింది, చాలా హ్యాపీగా ఉంది, ఏం మాట్లాడాలో తెలియట్లేదు అని చెప్పాడు.