Idream media
Idream media
ఏ కాలానికైనా గాంధీ సిద్ధాంతాలు ఆచరణీయమని బీజేపీ ఎంపీ సుజనా చౌదరి అన్నారు. శుక్రవారం ఆయన గుంటూరులో మీడియాతో మాట్లాడుతూ గాంధీ సంకల్పయాత్ర విజయవంతంగా సాగుతుందన్నారు. ప్రాంతీయ పార్టీలకు భవిష్యత్తులో చోటు లేదని జోస్యం చెప్పారు. ప్రాంతీయ పార్టీలన్నీ కుటుంబాల చేతుల్లో ఉన్నాయని, తెలుగు రాష్టాల్లో బీజేపీ ఏ పార్టీతోను పొత్తు పెట్టుకోదన్నారు. రాజధానిపై ప్రజల్లో ఉన్న గందరగోళం పై ముఖ్యమంత్రి స్పందించాలని డిమాండ్ చేశారు. రాజధానిపై బిజెపి ఇప్పుడే ఏమీ స్పందించమని సుజనా చౌదరి అన్నారు.