iDreamPost
android-app
ios-app

అమలాపురంలో ఒక రూపాయికే చీర.. దుకాణం మూసేకున్న యజమాని

అమలాపురంలో  ఒక రూపాయికే చీర.. దుకాణం మూసేకున్న యజమాని

కస్టమర్లను ఆకట్టుకునేందుకు దుస్తుల దుకాణం యజమానులు రకరకాల ఆఫర్లు ప్రకటిస్తుంటారు. షోరూం ప్రారంభ సమయంలోనూ లేదా పండగ సందర్భంలోనూ ఈ ఆఫర్లు సాధారణంగా కనిపిస్తుంటాయి. ఆఫర్ల వల్ల అమ్మకాలు పెరుగుతాయి. అయితే ఒక్కక్క సారి ఈ ఆఫర్ల వల్ల తలనొప్పులు వస్తాయి. ఇలాంటిదే తూర్పుగోదావరి జిల్లా అమలాపురంలో జరిగింది.

శుభమస్తు అనే దుకాణం అమలాపురంలో నూతనంగా ప్రారంభమైంది. పండగ వ్యాపారం అంతా సొంతం చేసుకనేందుకు దుకాణం యజమాని సరికొత్త ఆఫర్‌ ప్రకటించారు. రూపాయికే చీర, 20 పైసలే షర్ట్‌ అని ప్రచారం చేశారు. ఉదయం దుకాణం తీయకముందే మహిళలు బారులు తీరారు. దుకాణం తీసిని వెంటనే గుంపులు గుంపులుగా ఫోరూంలోకి వెళ్లారు. ఎవరికి దొరికిన చీర వారు పట్టుకున్నారు. షోరూం అంతా గందరగోళంగా మారింది. కొంత మంది మహిళలు రూపాయి కౌంటర్‌ వద్ద ఇచ్చేచి చీరలు పట్టుకెళ్లారు. రోడ్డుపై ఇంకా భారీ సంఖ్యలో మహిళలు ఉన్నారు. దీంతో ఏమి చేయాలో తెలియని షోరూం యజమాని పోలీసులను ఆశ్రయించారు.

దుకాణంలోని మహిళలను పోలీసుల సహాయంతో బయటకు పంపారు. వారితోపాటు దుకాణంలో పనిచేసే సిబ్బందిని బయటకు పంపి షోరూం మూసేసేశారు. తానుకొటి తలిస్తే దైవమొకటి తలచినట్లు వ్యాపారం కోసం ఆలోచిస్తే.. అసలు దుకాణమే మూసేసుకోవాల్సి వచ్చిందని షోరూం నిర్వాహకులు పోలీసుల వద్ద వాపోయారు.