iDreamPost
android-app
ios-app

మంచి సినిమాకు ప్రేక్షకుల శుభాకాంక్షలు – Nostalgia

  • Published Aug 30, 2021 | 11:10 AM Updated Updated Aug 30, 2021 | 11:10 AM
మంచి సినిమాకు ప్రేక్షకుల శుభాకాంక్షలు – Nostalgia

ప్రతి ప్రేమకథ ముగింపు ఇద్దరూ కలుసుకోవడంతోనే ముగించాలన్న రూల్ ఏమి లేదు. ఇప్పుడంటే ఎంగేజ్ మెంట్ అయిన హీరోయిన్ ని హీరో ట్రాప్ చేసి ఆమె ఇంట్లో వాళ్ళందరినీ బకరా చేయడం అనే కాన్సెప్ట్ ని ఎక్కువగా చూస్తున్నాం కానీ స్వచ్ఛమైన ప్రేమ ఎప్పుడూ తనకు దక్కనిది కూడా సుఖంగా ఉండాలని కోరుకునేలా చూపించిన సినిమాలు తక్కువ. అందులో ప్రత్యేకంగా ప్రస్తావించాల్సిన మూవీ శుభాకాంక్షలు. 1996లో విక్రమన్ దర్శకత్వంలో విజయ్ సంగీత జంటగా ‘పూవే ఉనక్కగ’ వచ్చింది. అప్పట్లో ఈ చిత్రం 8 కేంద్రాల్లో 300 రోజులు ప్రదర్శింపబడటం చెదిరిపోని రికార్డు. హీరో విజయ్ కు స్టార్ స్టేటస్ రావడానికి దోహదం చేసిన మొదటి సినిమా ఇది.

నిర్మాత ఆర్బి చౌదరి దీన్ని తెలుగులో తీసే ఉద్దేశంతో దర్శకుడు భీమినేని శ్రీనివాసరావుతో జగపతి బాబు-రవళి-రాశి కాంబినేషన్ లో ప్రాజెక్ట్ సెట్ చేసుకున్నారు. భీమినేని డెబ్యూ ‘శుభమస్తు’ కూడా రీమేకే. అది హ్యాండిల్ చేసి విజయవంతం చేసిన తీరు చూసి చౌదరి ఆయనకు అవకాశం ఇచ్చారు. కోటి సంగీత దర్శకుడిగా ఎంపికయ్యారు. కామెడీ ఎంటర్ టైనర్స్ ని బ్రహ్మాండంగా రాస్తారని పేరున్న మరుధూరి రాజా సంభాషణల రచయిత కాగా ఆయనకు చింతపల్లి రమణ- రమేష్ గోపి సహకారం అందించారు. క్యాస్టింగ్ లో రాజీ లేకుండా సత్యనారాయణ, నగేష్, ఆనంద్ రాజ్, దేవన్, బ్రహ్మానందం, సుధాకర్, షావుకారు జానకి, ఏవీఎస్ తదితరులను తీసుకున్నారు. ఒక ప్రత్యేక గీతానికి సూపర్ స్టార్ కృష్ణ నర్తించడం బిజినెస్ పరంగా చాలా హెల్ప్ అయ్యింది.

ఒక ప్రేమ జంట వల్ల రెండు పచ్చని కుటుంబాలు విడిపోతే వాళ్లకు ఏ మాత్రం సంబంధం లేని ఓ అనాథ యువకుడు మనవడిగా నటించి ఆ వైషమ్యాలను తొలగించడం అసలు కథ. ఇదంతా ఎందుకు చేయాల్సి వచ్చిందనేది హృద్యమైన ఫ్లాష్ బ్యాక్ లో చూపిస్తారు. ఇద్దరు హీరోయిన్లు ఉన్నా హీరో చివరికి ఒంటరిగానే మిగిలిపోవడం ఇందులో కొత్తదనం. తను ప్రేమించిన అమ్మాయి ఇంకొకరిని పెళ్లి చేసుకుంటే తనను ప్రేమించిన మరో అమ్మాయిని బలవంతంగా ఎస్ చెప్పలేకపోతాడు. లవ్ స్టోరీనే అయినప్పటికీ ఇందులో చూపించిన అద్భుతమైన ఎంటర్ టైన్మెంట్ కి జనం మనసారా నవ్వుకున్నారు. ఎమోషన్స్ కి బరువెక్కిన హృదయంతో కన్నీరు పెట్టుకున్నారు. 1997 ఫిబ్రవరి 14న విడుదలైన శుభాకాంక్షలు శతదినోత్సవం చేసుకుని ఘనవిజయం దక్కించుకుంది

Also Read : బ్లాక్ బస్టర్ కాంబో మొదటి అడుగు – Nostalgia