iDreamPost
android-app
ios-app

3Dలో స్ట్రీట్ డాన్సర్ మెప్పిస్తాడా

  • Published Jan 23, 2020 | 4:21 AM Updated Updated Jan 23, 2020 | 4:21 AM
3Dలో స్ట్రీట్ డాన్సర్ మెప్పిస్తాడా

రేపు రాబోతున్న కొత్త సినిమాల్లో అందరి కళ్ళు రవితేజ డిస్కో రాజా మీదే ఉన్నాయి. కానీ రేస్ లో మరో చిత్రం కూడా ఉంది. అదే స్ట్రీట్ డాన్సర్. ప్రత్యేకత ఏమిటంటే ఇది 3Dలో విడుదల చేస్తున్నారు. హిందీలో రూపొందినప్పటికీ తెలుగులోతో పాటు ఇతర సౌత్ భాషల్లో డబ్బింగ్ చేసి వదులుతున్నారు. గతంలో వచ్చిన ఎబిసిడి రెండు భాగాలకు కొనసాగింపుగా దీనికి ప్రచారం వచ్చినప్పటికీ నిర్మాణ సంస్థల్లో ఒకటైన డిస్నీ తప్పుకోవడంతో టైటిల్ కూడా మారింది. కాకపోతే వాటిలో ఉన్న స్టార్ క్యాస్ట్ దాదాపు ఇందులో కూడా ఉన్నారు.

Read Also: డిస్కోరాజా టార్గెట్ పెద్దదే – ప్రీ బిజినెస్ ఫిగర్స్

ప్రపంచవ్యాప్తంగా భారీ ఎత్తున రిలీజ్ కు ప్లాన్ చేశారు. వరుణ్ ధావన్ హీరోగా సాహో భామ శ్రద్ధ కపూర్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ మూవీలో డాన్సింగ్ దిగ్గజం ప్రభుదేవా కీలక పాత్రలో కనిపించనున్నాడు. రెమో డిసౌజా దర్శకత్వం వహించాడు. సాధారణంగా ఇలాంటి సినిమాల కథలన్నీ డాన్స్ కాంపిటీషన్ల చుట్టే తిరుగుతాయి. అంతకన్నా కొత్తదనం చూపించే స్కోప్ లేకపోవడం ప్రధానమైన మైనస్. అందుకే దర్శకుడు ఈసారి తెలివిగా జనాల దేశభక్తిని ఎమోషన్ ని క్యాష్ చేసుకునే ప్రయత్నం చేస్తున్నాడు.

ఇందులో ఇండియా పాకిస్థాన్ టీమ్స్ మధ్య ఇంటర్నేషనల్ లెవెల్ లో జరిగే పోటీని ఆధారంగా చేసుకుని రూపొందించారట. త్రిడి ఎఫెక్ట్స్ ని బాగా ఎంజాయ్ చేసేందుకు కొరియోగ్రఫీని కూడా చాలా స్పెషల్ గా డిజైన్ చేసినట్టుగా బాలీవుడ్ టాక్. మాములుగా అయితే ఫాంటసీ లేదా యాక్షన్ సినిమాలు త్రీడిలో చూసేందుకు బాగుంటాయి. కాని డాన్స్ మూవీస్ ఆ స్థాయిలో ఎంజాయ్ చేయడం అంటే ఎలా ఉంటుందో చూడాలి. గతంలో ఏబిసిడి 2 కూడా 3డిలోనే రిలీజ్ చేశారు. అప్పుడు పర్వాలేదు అనిపించుకుంది. ఇప్పుడు మరి ఏయే మార్పులతో స్ట్రీట్ డాన్సర్ త్రీడిని తీశారో చూడాలి మరి