iDreamPost
iDreamPost
బెంగుళూరుకు చెందిన ఓ అమ్మాయి చేసిన పని ఇప్పుడు అందర్నీ ఆశ్చర్యపరచడమే కాకుండా సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఓ Startup కంపెనీ కో ఫౌండర్ అయిన ఉదితా పాల్‌కు మంచి అబ్బాయిని చూసి వివాహం చేయాలని ఆమె తండ్రి మాట్రిమోనియల్ సైట్‌లల్లో వెతికి ఒక అబ్బాయి వివరాలను ఉదితాకి వాట్సాప్ ద్వారా పంపించాడు. ఆ మాట్రిమోనియల్ సైట్‌లోని ప్రొఫైల్లో అతని పూర్తి వివరాలు ఉన్నాయి. అతని ప్రొఫైల్‌లో అతనికున్న క్వాలిఫికేషన్, అనుభవాన్ని చూసి ఇంప్రెస్ అయిన ఉదితా ఆ అబ్బాయికి తన కంపెనీలో జాబ్ ఆఫర్ చేసింది.
అయితే ఈ విషయం తన తండ్రికి తెలిసి ఇదే విషయాన్ని వాట్సాప్ లో అడిగాడు. నువ్వేమి చేశావో నీకు తెలుసా? మ్యాట్రిమోనియల్ సైట్ నుంచి ఉద్యోగుల్ని నియమించుకోరు. నేను వాళ్ళ నాన్నకి ఏం చెప్పాలి? నువ్ అతనితో ఇంటర్వ్యూకి అప్లై చేయమని లింక్ పంపించి రెజ్యుమ్ పంపించమని అడిగావు. నీకేమన్నా పిచ్చా? అని తండ్రి అడగగా జాబ్ లో అతని ఎక్స్పీరియన్స్ బాగుంది. అందుకే జాబ్ ఆఫర్ చేశాను అని చెప్పింది.
అయితే ఇదంతా వాట్సాప్ లో చాటింగ్ జరగగా దీన్ని స్క్రీన్ షాట్ తీసి ట్విట్టర్ లో పోస్ట్ చేసింది ఉదితా. ఇంకేముంది తెల్లారేసరికి ఈ ట్వీట్ వైరల్ గా మారింది. ఉదితా రాత్రికి రాత్రే పాపులర్ అయిపోయింది. ఇక దీన్ని వార్తగా రాసిన పలు ఆర్టికల్స్ ని కూడా ఉదితా తన ట్విట్టర్ లో షేర్ చేస్తోంది.
What getting disowned from father looks like. pic.twitter.com/nZLOslDUjq
— Udita Pal 🧂 (@i_Udita) April 29, 2022