iDreamPost
iDreamPost
సూపర్ స్టార్ మహేశ్ బాబు, త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్‌లో ఎస్‌ఎస్‌ఎంబీ28 (SSMB28) వర్కింగ్ టైటిల్‌తో సెట్స్‌పైకి తీసుకురానున్నారు. అతడు, ఖలేజాల తర్వాత వీరి కాంబినేషన్‌లో వస్తున్న చిత్రమిది. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ పతాకంపై రూపొందే ఈ సినిమా చాలా అంచనాలున్నాయి. ఈ సినిమా తర్వాత మహేశ్ బాబు సరాసరి రాజమౌళి సినిమా షూటింగ్ కు వెళ్లిపోతారు. బాహుబలికి ముందు ప్రభాస్ కు మిర్చిలా, మహేశ్ బాబుకు బ్లాక్ బస్టర్ హిట్ నివ్వాలన్నది త్రివిక్రమ్ కోరిక. అందుకే స్టోరీని వినిపించడం కోసం ఏకంగా జర్మనీకే వెళ్లారు త్రివిక్రమ్.
The Evergreen Combo of Super Star @urstrulyMahesh & our Darling Director #Trivikram is back to REIGN! 🔥
The most eagerly awaited #SSMB28 pre-production has started on EPIC proportions! Shoot starts This Aug✨
Be Ready for a MASSive Blast at the Screens ~ Summer 2023! pic.twitter.com/m4g6m3p9Ad
— Haarika & Hassine Creations (@haarikahassine) July 9, 2022
అందుకే ఈ సినిమా సెట్స్‌పైకి వచ్చేది ఎప్పుడెప్పుడా? ఫ్యాన్స్ ఆత్రుతుగా ఎదురుచూస్తువేళ, ఓ క్రేజీ అప్‌డేట్‌ను వదిలారు నిర్మాతలు. ‘ఎస్‌ఎస్‌ఎంబీ28 చిత్రం ప్రస్తుతం ప్రీ-ప్రొడక్షన్ పనులను జరుపుకుంటోంది. అగస్ట్‌లో రెగ్యూలర్ షూటింగ్’ అని మేకర్స్ ట్విటర్ లో ప్రకటించారు. వచ్చే ఏడాది సమ్మర్‌లో ఈ సినిమాను విడుదల చేయబోతున్నట్లు కూడా రివీల్ చేశారు. ఇందులో మహేశ్‌కు జోడిగా పూజా హెగ్డే నటిస్తుంటే, తమన్ మ్యూజిక నిస్తున్నారు.
వరుస ఫ్లాపులొస్తున్నా, తాజా అప్ డేట్ తో, పూజా ట్విట్టర్ లో ట్రెండింగ్ అవుతోంది.