iDreamPost
android-app
ios-app

కొత్త పుకారు: మహేష్-రాజమౌళి సినిమాలో అల్లు అర్జున్!?

  • Published Dec 13, 2022 | 9:40 PM Updated Updated Dec 13, 2022 | 9:40 PM
  • Published Dec 13, 2022 | 9:40 PMUpdated Dec 13, 2022 | 9:40 PM
కొత్త పుకారు:  మహేష్-రాజమౌళి సినిమాలో అల్లు అర్జున్!?

ఆర్ఆర్ఆర్ తో సంచలన విజయాన్ని అందుకున్న దర్శకధీరుడు రాజమౌళి తన తదుపరి సినిమాని మహేష్ బాబుతో చేయనున్నాడు. ప్రస్తుతం ఆర్ఆర్ఆర్ ని ఆస్కార్స్ బరిలో నిలిపే ప్రయత్నాల్లో ఉన్న రాజమౌళి.. ఆ తర్వాత మహేష్ సినిమా స్క్రిప్ట్ పై పూర్తి దృష్టి పెట్టనున్నాడు. ఇదిలా ఉంటే ఇప్పుడు ఈ మూవీకి సంబంధించి ఓ ఆసక్తికరమైన న్యూస్ చక్కర్లు కొడుతోంది. అదేంటంటే ఈ సినిమాలో అల్లు అర్జున్ కూడా నటించనున్నాడట.

ఆర్ఆర్ఆర్ లో జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ స్క్రీన్ షేర్ చేసుకున్నారు. అలాగే మహేష్ తో రాజమౌళి రూపొందించనున్న ‘ssmb 29’లో కూడా మహేష్ తో బన్నీ స్క్రీన్ షేర్ చేసుకోనున్నాడని సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. ఈ న్యూస్ విని మహేష్ ఫ్యాన్స్ షాక్ అవుతున్నారు. చేస్తే సోలోగా చేయండి లేదా మానేయండి.. అంతేగానీ మల్టీస్టారర్ మాత్రం వద్దని కామెంట్స్ చేస్తున్నారు. ఎందుకంటే ఆర్ఆర్ఆర్ లో తమ హీరోనే మెయిన్ లీడ్ అంటూ ఇప్పటికీ తారక్, చరణ్ ఫ్యాన్స్ మధ్య వార్ నడుస్తోంది. అలాంటి తలనొప్పులు తమకు వద్దని మహేష్ ఫ్యాన్స్ అభిప్రాయపడుతున్నారు. మరోవైపు బన్నీ ఫ్యాన్స్ సైతం.. పుష్ప-1 తో తమ హీరో క్రేజ్ అమాంతం పెరిగిపోయిందని, పుష్ప-2 కోసం పాన్ ఇండియా రేంజ్ లో ఆడియన్స్ ఎదురుచూస్తున్నారని.. ఇలాంటి సమయంలో స్పెషల్ రోల్స్, మల్టీస్టారర్స్ తమ హీరోకి అవసరం లేదని అంటున్నారు.

అయితే ‘ssmb 29’లో అల్లు అర్జున్ నటించనున్నాడనే వార్త నిజమయ్యే అవకాశాలు దాదాపు అసాధ్యమనే చెప్పాలి. ఎందుకంటే ఫారెస్ట్ బ్యాక్ డ్రాప్ లో ఓ యాక్షన్ అడ్వెంచర్ గా రూపొందనున్న ఈ చిత్ర కథ ఇంకా పూర్తిస్థాయిలో రెడీ కాలేదు. ప్రస్తుతం విజయేంద్ర ప్రసాద్ కథను సిద్ధం చేసే పనిలో ఉన్నారు. కథ పూర్తి కాకుండా ఇతర పాత్రల ఎంపిక జరిగే అవకాశం లేదు. అలాగే ఇందులో మహేష్ సోలో హీరో కాబట్టే వర్కింగ్ టైటిల్ ‘ssmb 29’ అని పెట్టారు. ఈ చిత్రంలో తెలుగు మరియు ఇతర సినీ పరిశ్రమలకు చెందిన పలువురు నటీనటులు కీలక పాత్రలు పోషించే అవకాశం ఉంటుంది కానీ ఇది మల్టీస్టారర్ అయితే కాదని తెలుస్తోంది.

Jojobet GirişjojobetJojobetJojobetjojobetjojobetJojobetZirvebetjojobetultrabetcasibomcasibomcasibomjojobetcasibom girişşanlıurfa konteynerbetciobetcioTipobetHoliganbetHoliganbetTipobetjojobetjojobet girişjojobet giriş