iDreamPost
android-app
ios-app

పుష్ప 2లో శ్రీవల్లి చనిపోతుందా??

  • Published Jun 19, 2022 | 6:46 PM Updated Updated Jun 19, 2022 | 6:46 PM
  • Published Jun 19, 2022 | 6:46 PMUpdated Jun 19, 2022 | 6:46 PM
పుష్ప 2లో శ్రీవల్లి చనిపోతుందా??

అల్లు అర్జున్, రష్మిక మందన్న జంటగా సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన ‘పుష్ప’ సినిమా ఎంతటి భారీ విజయం సాధించిందో అందరికి తెలిసిందే. అంచనాలకి మించి ఈ సినిమా విజయం సాధించింది. బాలీవుడ్ లో అయితే పుష్పరాజ్ అందర్నీ మెప్పించాడు. ఇప్పుడు ‘పుష్ప 2’ కోసం సౌత్ ఆడియన్స్ తో పాటు నార్త్ ఆడియన్స్ కూడా ఎదురు చూస్తున్నారు.

పుష్ప సినిమా పాన్ ఇండియా హిట్ అవ్వడంతో ‘పుష్ప 2’ మీద సుకుమార్ మరింత కాన్సంట్రేట్ చేశారు. దీని వల్ల సినిమా డిలే అవుతుంది. జులై ఆఖర్లో ‘పుష్ప 2’ సినిమా షూటింగ్ మొదలు పెడతారని సమాచారం. ప్రస్తుతం ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. అయితే ఇప్పట్నుంచే ‘పుష్ప 2’ సినిమా ఎలా ఉండబోతుంది అందులోని పాత్రలు ఎలా ఉంటాయి? కథ ఎలా ఉండబోతుందని ప్రేక్షకులు పలు రకాలుగా కథలు అల్లేసుకుంటున్నారు.

పుష్ప రాజ్ పక్కనే ఉన్న కేశవ శత్రువులతో చేతులు కలుపుతాడని, దాక్షాయణి పుష్పరాజ్ మీద పగ తీర్చుకోవడానికి ట్రై చేస్తూ ఉంటుందని, భన్వర్ సింగ్ కూడా పుష్పరాజ్ ని ఎలా దెబ్బ తీయాలని చూస్తాడని, పుష్ప మరింత పెద్ద డాన్ గా ఎదుగుతాడని, శత్రువులు పుష్పని చంపలేక తల్లిని, భార్య శ్రీవల్లిని చంపడానికి ప్లాన్ చేస్తారని, అందులో శ్రీవల్లి చనిపోతారని ఊహాగానాలు వస్తున్నాయి. హీరోయిన్ పాత్రని చంపేస్తే హీరో మరింత కోపం తెచ్చుకొని విలన్లని అంతమొందిస్తాడని అంటున్నారు.

ఇలా రకరకాల కథలు ప్రేక్షకుల్లో నడుస్తున్నాయి. మరి నిజంగానే రష్మిక క్యారెక్టర్ ని చంపేస్తారా ‘పుష్ప 2’లో. ఇందుకు స్టార్ హీరోయిన్ గా ఉన్న రష్మిక ఒప్పుకుంటుందా? అని కూడా ఆలోచిస్తున్నారు. మరి ఎవరి అంచనాలకి అందకుండా సుకుమార్ ఎలా ప్లాన్ చేస్తాడో చూడాలంటే మరిన్ని నెలలు ఆగక తప్పదు.

Jojobet GirişmeritkingDeneme Bonusu Veren SitelerbetparkGrandpashabetgrandpashabetGrandpashabetGrandpashabetGrandpashabetGrandpashabetcasibomjojobet girişjojobet güncel girişdeneme bonusu veren sitelerMariobetJojobetMadridbetMadridbetcasibomgrandpashabet girişJojobetcasibomgrandpashabetjojobetcasibomjojobetjojobetgrandpashabet girişcasibomgrandpashabet girişcasibom girişgrandpashabet girişgrandpashabetgrandpashabetholiganbet