iDreamPost
android-app
ios-app

షాకింగ్ పాత్రల్లో కాజల్ శ్రీలీల

  • Published Jan 30, 2023 | 3:33 PM Updated Updated Jan 30, 2023 | 3:33 PM
  • Published Jan 30, 2023 | 3:33 PMUpdated Jan 30, 2023 | 3:33 PM
షాకింగ్ పాత్రల్లో కాజల్ శ్రీలీల

పెళ్లి చేసుకుని కొడుకు పుట్టాక కూడా కాజల్ అగర్వాల్ మరీ ఫేడ్ అవుట్ అయితే కాలేదు. ఇంకా అవకాశాలు వస్తున్నాయి. ఖైదీ నెంబర్ 150లో చిరంజీవితో చేశాక సీనియర్ హీరోల నుంచి ఆఫర్లు తగ్గడం లేదు. కమల్ హాసన్ ఇండియన్ 2లో ఎంపికవ్వడానికి కారణం అదే. తాజాగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో బాలకృష్ణ హీరోగా రూపొందబోయే సినిమాలో కాజల్ నే తీసుకున్నారనే లీక్ ఆల్రెడీ వచ్చేసింది. బాలయ్యకు జోడిగా అని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అధికారికంగా చెప్పకపోయినా ఆల్మోస్ట్ లాక్ అయినట్టేనని అంటున్నారు.

ఇక్కడే ఒక ట్విస్ట్ ఉంది. ఇందులో శ్రీలీల నటిస్తోంది. అది కూడా హీరో కూతురిగా. ఆ హింట్ ముందే ఓ ఇంటర్వ్యూలో ఇచ్చింది. అంటే కాజల్ ఆటోమేటిక్ గా తల్లి పాత్ర చేస్తున్నట్టేగా. ఇద్దరు మధ్య వయసు వ్యత్యాసం పదహారేళ్లు ఉన్నప్పటికీ మరీ అంత పెద్ద తల్లి పాత్రలో తనను ఫ్యాన్స్ రిసీవ్ చేసుకుంటారా అనేది సందేహమే. గతంలో ఇదే తరహాలో ఒక్క మగాడులో సిమ్రాన్ ముసలి వేషం వేసి బాలకృష్ణ మదర్ క్యారెక్టర్ చేస్తే సినిమా డిజాస్టర్ కావడంతో పాటు ఆమెకూ ఎలాంటి ప్రయోజనం దక్కలేదు.ఇవి రిస్క్ తో కూడుకున్నవి.

గతంలోనూ ఇలాంటివి చాలా జరిగాయి కానీ ఆడియన్స్ ఇలాంటి కాంబోలను ఎంతమేరకు ఒప్పుకుంటారనేది చూడాలి. మగధీరుడులో చిరంజీవితో జట్టు కట్టిన జయసుధ రిక్షావోడులో అదే మెగాస్టార్ కు తల్లిగా చేశారు. జమున, విజయశాంతి లాంటి అలా కనిపించడం ఇష్టం లేకే హీరోయిన్ గా రిటైర్ అయ్యారు తప్పించి సపోర్టింగ్ రోల్స్ కి వెళ్లలేకపోయారు. కాజల్ ఒప్పుకుందా లేదా అనేది ఇంకా తెలియాల్సి ఉంది. ధమాకా సూపర్ హిట్ తో మంచి జోష్ మీదున్న శ్రీలీలకు స్టార్ హీరోలతో మొదలుకుని అగ్ర నిర్మాణ సంస్థల దాకా వరసగా ఆఫర్లు వస్తున్నాయి.

Jojobet GirişHoliganbetHoliganbetHoliganbetGrandpashabetturboslothızlıcasinohızlıcasinohızlıcasinoturboslotzenbetjojobetnakitbahiscasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetjojobetcasibom girişCasibomgrandpashabetJojobet Giriş