iDreamPost

ధర తగ్గాలని.. 508 టమాటాలతో అమ్మవారికి మాల!

ధర తగ్గాలని.. 508 టమాటాలతో అమ్మవారికి  మాల!

టమాటా.. ఈ పేరు వింటేనే సామాన్యుడి గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. కారణంగా దీని ధర రోజు రోజుకూ పెరిగి పోతుంది. సెంచరీ, డబుల్ సెంచరీ కొట్టి… ప్రస్తుతం త్రిపుల్ సెంచరీ దిశగా దూసుకెళ్తోంది. దీంతో  సామాన్యుడు టమాటాను బంగారం చూసినట్లు చూస్తున్నారు. వంటల్లో టమాటాలు వినియోగించడమే మానేసారు. ఎప్పుడెప్పుడు టమాటా ధర తగ్గుతుందా? అని మధ్యతరగతి కుటుంబాల వారు వెయ్యి కళ్లతో ఎదురు చూస్తున్నారు. మరికొందరు అయితే టమాటా ధరలు తగ్గాలని దేవుళ్లను మొక్కుతున్నారు. ఇంకొన్ని ప్రాంతాల్లో అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. అలానే తమిళనాడులోని ఓ దేవాలయంలో అమ్మవారికి 508 టమాటాలతో  ప్రత్యేక పూజలు నిర్వహించారు.

తమిళనాడు రాష్ట్రం నాగపట్టణం జిల్లా కురుకుడిలో మహా మరియమ్మన్, నాగమ్మన్ అనే ఆలయం ప్రసిద్ధి చెందింది. ఈ ఆలయానికి ఆ రాష్ట్రం నలుమూలల నుంచి  పెద్ద ఎత్తున భక్తులు వస్తుంటారు. ప్రస్తుతం ఆడి మాసం సందర్భంగా ఈ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. దీంతో పెద్ద సంఖ్యలో భక్తుల తరలివచ్చి మొక్కులు చెల్లించుకుంటున్నారు. అలానే కొంత మంది భక్తులు అమ్మవారికి ప్రత్యేక పూజలు చేసి.. టమాటా ధర తగ్గాలని వేడుకున్నారు. అంతేకాక 508 టమాటాలతో ప్రత్యేక మాల తయారు చేసి.. అమ్మవారి మెడలో అలంకరించారు. టమాటా ధరల దెబ్బకు తాము విలవిల్లాడిపోతున్నామని, వాడి ధర తగ్గించాలని దేవతలకు మొక్కున్నారు.

సాధారణంగా ఎక్కడైనా భక్తులు సంతానం, విద్యా, ఆరోగ్యం బాగుండాలని, ఆర్థిక కష్టాలు తొలగించాలని కోరుకుంటారు. కానీ టమాటాల ధరలు రాకెట్ లా దూసుకెళ్తున్న నేపథ్యంలో ధరలు తగ్గాలని భక్తులు దేవుళ్లకు పూజలు చేస్తున్నారు. టమాటల మాలే కాకుండా నిమ్మకాయల దండను కూడా అమ్మవారికి సమర్పించి ప్రత్యేక పూజలు చేశారు. ఇలా నిమ్మకాయ దండ, టమాటాలు దండలు వేసి అమ్మవారిని పూజించడం పలువురి ఆశ్చర్యానికి గురి చేసింది. ఇక అమ్మవారికి మెడలో వేసిన టమాటాలను భక్తులకు ప్రసాదంగా అక్కడి పూజారులు పంచిపెడుతున్నారు. ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మరి.. ఈ టమాటా దండతో పూజలు చేయడంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

ఇదీ చదవండి:  రాహుల్ గాంధీకి సుప్రీం కోర్టులో ఊరట! ఆ కేసులో..

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి